visweswar reddy
-
ఏపీలో ఉన్నామా..? అఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?: విశ్వేశ్వర్ రెడ్డి
-
ఓట్ల తొలగింపు వెనుక అధికార పార్టీ నేతల హస్తం
-
ప్రతిపక్ష ఎమ్మెల్యేపై అధికార పార్టీ వివక్ష
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపక్ష, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై అధికార పార్టీ వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్న సమయంలో అధికార పార్టీ నాయకులు మైక్ కట్ చేశారు. సభలో ఆయనను మాట్లాడనీయకుండా చేశారు. అంతేకాకుండా తనకు స్థలం రాలేదని నిరసన వ్యక్తం చేసిన ఓ బాధితుడిని పోలీసులు పక్కకు లాగిపడేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొన్న భూమిలో పట్టాలు పంపిణీ చేశారు తప్ప పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. పది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పట్టాలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. -
రౌడీరాజ్యం అనుకుంటున్నారా?
అనంతపురం సెంట్రల్: ఉరవకొండ నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బెదిరించి హంద్రీనీవా పనులు చేపడుతున్నారని, ఇదేమైనా రౌడీరాజ్యం అనుకుంటున్నారా అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీరివ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులు మొదలుపెట్టాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హంద్రీనీవా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యాలయం వద్ద రైతులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కింద దాదాపు 80వేల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నిరీచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేందుకు వెంటనే పిల్లకాలువలు తవ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టి 8వేల ఎకరాలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. 2016లో అసెంబ్లీలో రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులపై ప్రశ్నించినప్పుడు రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని స్వయంగా సీఎం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని, అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయంపల్లి, నెరిమెట్ల గ్రామాలకు వెల్లే పిల్లకాలువల పనులు ఎందుకు నిలిపేశారని నిలదీశారు. అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పనులు మాని రైతులకు మేలు చేయాలని హితవు పలికారు. బెళుగుప్ప మండలంలో 36వ ప్యాకేజీలో పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బూదగవి చెరువు నింపిన సమయంలో పంటలు సాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి కూడా ఇంతవరకూ పరిహారం అందలేదని తెలిపారు. వెంటనే చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆరునెలలు ఓపిక పడితే వైఎస్ జగన్ సీఎం అవుతారని, వెంటనే మూడు నెలల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి నాయకులు అశోక్‌కుమార్, తోజేనాథ్, ఎర్రిస్వామి, గోపాల్‌రెడ్డి, దుబ్బర వెంకటేసు, నాగరాజు, యోగేంద్రనాథ్, జగన్నాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో పండు ముసలవ్వ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళనలో రాకెట్లకు చెందిన పండుముసలవ్వ సుబ్బమ్మ పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నామని, తాము వైఎస్సార్సీపీ వాళ్లమనే తమ గ్రామాలపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పొలాలకు నీళ్లివ్వాలని సుబ్బమ్మతోపాటు మరో వృద్ధురాలు రేణమ్మ అధికారులకు చేతులు జోడించి వేడుకున్నారు. -
నాలుగేళ్లలో ఒక్క పట్టా ఇచ్చారా?
ఉరవకొండ: అధికారంలోకి వచ్చి నాలుగేళ్లూ పూర్తయినా ఒక్క నిరుపేదకైనా ఇంటిపట్టా ఇచ్చారా..? అని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి 89 ఎకరాల భూమి కొనుగోలు చేశారనీ, అయితే వాటిలో పట్టాలిచ్చేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న డిమాండ్‌తో సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వేలాది మంది ప్రజలతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మండల రూరల్ కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇంటిపట్టాలు ఇవ్వడానికి 2013లో అఖిల పక్ష నేతల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా అర్హులైన వారికి పట్టాలు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు 3,204 మందితో జాబితా సిద్ధం చేసిన అధికారులు.. 2016లో తిరిగి దీనిపై మరోసారి విచారణ జరిపారన్నారు. ఇందులో 1,657 మందిని అర్హులుగా తేల్చారనీ... అయినా పట్టాలు ఇవ్వలేదన్నారు. అర్హులకు ఇంటిపట్టాలు, ఇళ్లు మంజురు చేయాలని గతంలో ఎన్నోసార్లు కలెక్టర్‌కు, జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు తెలిపారు. అయినా టీడీపీ ప్రభుత్వం ఉరవకొండలో ఒక్కరికి కూడా పట్టా మంజూరు చేయలేదన్నారు. పయ్యావుల కేశవ్ డ్రామా అర్హులైన 1,657 మందికి ఇంటిపట్టాలు ఇవ్వాలని తాను హైకోర్టును ఆశ్రయిస్తే దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ కేశవ్ రెవెన్యూ అధికారుల చేత రిట్ పిటిషన్ వేయించారన్నారు. పయ్యావుల కేశవ్ .. కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లు ఇంటిపట్టాల జాబితాలో చేర్చేందుకు అధికారుల చేత నాటకం ఆడించారన్నారు. గతంలో ఎంపిక చేసిన 1,657 మంది లబ్ధిదారుల కూడా పట్టాలు అందకుండా కుట్ర పన్నుతున్నారన్నారు. వారికి ఊడిగం చేయడం మానాలి కొందరు అధికారులు ఎమ్మెల్సీ కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్పకు ఊడిగం చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఉరవకొండలో టీడీపీ పాలన సాగడం లేదని పయ్యావుల పాలన సాగుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజ లకు సేవ చేయడం నేర్చుకోవాలన్నారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యులుగా దొంగలు, దోపిడీదారులు, బ్రాంది షాపు నిర్వాహకులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారే అధికంగా ఉన్నారన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి మధ్యాహ్నం రెండు గంటలవుతున్నా అధికారులు రాకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజలు అధికారుల తీరును నిరసిస్తూ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న ఓబన్న.. జూలై 1వతేదీలోగా ఇంటిపట్టాలు పంపిణీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు లలితమ్మ, తిప్పయ్య, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బోయకొండమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు అశోక్, తేజోనాథ్, బసవరాజు పాల్గొన్నారు. -
తహశీల్దార్, ఎంపీడీవో నిర్భందం.. ఉరవకొండలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : ఉరవకొండ తహశీల్దార్, ఎంపీడీవో, హౌంసింగ్ సిబ్బందిని ఆందోళనకారులు నిర్భంధించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. సోమవారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణతో అసంతృప్తి చెందిన ఆందోళనకారులు వారిని నిర్భందించారు. ఇళ్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేని అసమర్థుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఉరవకొండలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు కట్టించారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఉరవకొండ పట్టణంలో 89 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. ఆయన కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉరవకొండలో పయ్యావుల బ్రదర్స్ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని హితవుపలికారు. -
'చంద్రబాబు సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు'
సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు రోడ్లు ఎక్కి పోరాటం చేస్తుంటే, చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని కడతామంటూ డబ్బాలు కొట్టుకున్న చంద్రబాబు.. నాలుగేళ్లైనా కనీసం అమరావతి డిజైన్లు కూడా ఖరారు చేయలేదని, ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలలో నిండిపోయిందని, వాటిని కప్పి పుచ్చుకునేందుకే అమరావతి ఆనంద నగరం కార్యక్రమం చేపట్టిందంటూ విమర్శించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వ్యతిరేకి అంటూ వ్యాఖ్యానించారు.16న రాష్ట్ర బంద్‌తో హోదా పోరాటాన్ని ఉధృతం చేస్తామని విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. -
ఆయకట్టుకి నీరివ్వాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదు
-
హోదా కోసం అనంతలో వైఎస్సార్సీపీ పోరుబాట
-
'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
అనంతపురం: అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రైతాంగ సమస్యలపై మహాధర్నా చేపట్టనున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. -
'బంద్‌ను విజయవంతం చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ద్రోహులు' అని వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్‌నారాయణ, గుర్నాథ్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అనంతపురంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
'చంద్రబాబుకు మేమంటే భయం'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ భాషా అన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని అన్నారు. అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలుగానీ, పక్కా గృహాలుగానీ కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కార్పొరేట్ శక్తుల చేతిలో సీఎం బందీ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కారని, చర్చ లేకుండానే 8 బిల్లులను ఆమోదించడం దుర్మార్గమని విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండం వల్లే అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చామన్నారు. అసెంబ్లీలో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్‌ను విడుదల చేయకుండా ఎడిట్ చేసిన ఫుటేజ్‌ను మాత్రమే బయటపెట్టడం దారుణమని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. -
'చేతకాని వాళ్లే అలా అంటారు'
-
'చేతకాని వాళ్లే అలా అంటారు'
హైదరాబాద్: చేతకాని వాళ్లు, చేతులెత్తేసిన వాళ్లు ఏమైనా చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి పలువురు అధికార మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై గట్టిగా నిలబడలేనివాళ్లు కేంద్రాన్ని నిలదీయలేని వాళ్లు ఇక రాష్ట్రాన్ని ఎలా సంక్షేమ బాటలో నడిపిస్తారని ప్రశ్నించారు. ముందు నుంచి కూడా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని, దేశం నడిబొడ్డున దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు చేయబోయే నిరవధిక నిరాహార దీక్ష మరో ఉద్యమం కాబోతుందని చెప్పారు. ఇక మరోనేత విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో భాగస్వాములై ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి వారిని పొగడటంతోనే సరిపెడుతున్నారని చెప్పారు. సంకుచిత మనస్తత్వంతో చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైఎస్ జగన్ నిర్మాణాత్మక దీక్షకు దిగారని ప్రత్యేక హోదా సాధించేవరకు దీక్ష ఉంటుందని తెలిపారు. -
'వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షను భగ్నం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం
రాయలసీమకు పట్టుగొమ్మ లాంటి హంద్రీనీవా ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమ కరువుకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. అనంతపురం ఆయకట్టుకు నీరు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాంతాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా సాధన కోసం రైతు సదస్సు ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఎంతవరకైనా పోరాడతామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. -
'బాబూ.. పారిశ్రామికవేత్తలకో న్యాయం, రైతులకు మరో న్యాయమా?'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ మండిపడ్డారు. కరువుపై చంద్రబాబుకు అవగాహన లేదని, అందుకే 2013 ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వనని చెబుతున్నారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు ఓ న్యాయం, రైతులకు మరో న్యాయమా అని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ తప్పుపట్టారు. చంద్రబాబుకు రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే హంద్రీ నీవాకు 1500 కోట్ల రూపాయల నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు, మంత్రులు పొంతనలేని హామీలు ఇస్తున్నారని అన్నారు. అక్రమ సంపాదన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు ముందుకుతెచ్చారని ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. రుణమాఫీ హామీ అమలుగాక రైతులు, డ్వాక్రా మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు టీడీపీకి 2 ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించినా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సూచనలతోనే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ ఆరోపించారు.