హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం | ysrcp mla visweswar reddy condemns chandra babu attitude on handri niva | Sakshi
Sakshi News home page

హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం

Published Thu, Jul 30 2015 6:20 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం - Sakshi

హంద్రీనీవాపై చంద్రబాబు నిర్లక్ష్యం

రాయలసీమకు పట్టుగొమ్మ లాంటి హంద్రీనీవా ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమ కరువుకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.

అనంతపురం ఆయకట్టుకు నీరు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రాంతాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా సాధన కోసం రైతు సదస్సు ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఎంతవరకైనా పోరాడతామని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement