
'చంద్రబాబుకు మేమంటే భయం'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ భాషా అన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని అన్నారు.
అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలుగానీ, పక్కా గృహాలుగానీ కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.