chand basha
-
ఎదురు తిరిగిన టీడీపీ కార్యకర్తలు.. దండం పెట్టి పారిపోయిన లోకేష్
-
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ గేయరచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుచిత్ర తండ్రి, చంద్రబోస్ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం , మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
చాంద్ బాషాకు చంద్రబాబు షాక్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు చంద్రబాబు నిరాకరించారు. గత ఎన్నికల్లో బాషా చేతిలో ఓడిపోయిన కందికుంట ప్రసాద్‌కు ఈసారి సీటు ఖరారు చేశారు. చాంద్‌బాషాకు మంత్రి పదవి ఇస్తానని చివరి వరకూ ఊరించి ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గోనుకుంట్ల సూర్యనారాయణ, బీకే పార్థసారథిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్‌రెడ్డిని పనిచేసుకోమని చెప్పినా ఖరారుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను కూడా పనిచేసుకోవాలని సూచించినా ఆఖరి నిమిషంలో మారే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో అనంతపురం, రాయదుర్గం, ఉరవకొండ స్థానాలకు ప్రభాకర్ చౌదరి, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌లకు సీట్లు ఖరారు చేశారు. నాలుగు ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు! నాలుగు పార్లమెంట్ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఎంపీ అభ్యర్థులుగా సిట్టింగ్‌లైన కింజరాపు రామ్మోహన్నాయుడు, అశోక్‌గజపతిరాజు పేర్లను శుక్రవారం ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్‌కు దాదాపు ఖరారు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయన పార్టీలో చేరకముందే సీటు ఖరారు చేయడం గమనార్హం. తిరుపతి ఎంపీ స్థానాన్ని జూపూడి ప్రభాకర్‌రావుకు కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యేపై టీడీపీ కేడర్ ఆందోళన విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలోని గజపతినగరం ఎమ్మెల్యే కె.అప్పలనాయుడికి వ్యతిరేకంగా అక్కడి టీడీపీ కేడర్ శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అవినీతికి పాల్పడ్డారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని తేల్చిచెప్పారు. -
చంద్రబాబు ఎదుటే ఫిరాయింపు ఎమ్మెల్యేకు అవమానం
-
చంద్రబాబు ఎదుటే ఫిరాయింపు ఎమ్మెల్యేకు అవమానం
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు చంద్రబాబు మగళవారం నీటిని విడుదల చేశారు. అనంతరం చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ బాషాకు తీవ్ర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు బాషాను అవమానించారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్) ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రసంగాన్ని కందికుంట వర్గీయులు అడ్డుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే మాట్లొద్దని నినాదాలు చేశారు. బాషా మాట్లాడుతున్నంతసేపు ఈలలు, కేకలతో అల్లరి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బాషా, కందికుంట వర్గాల బల ప్రదర్శనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ ఇరు వర్గాలవారు పోటాపోటీ నినాదాలు చేశారు. -
‘అసలు విషయం.. సీఎం, ఇతర పెద్దలకే తెలుసు’
సాక్షి, అమరావతి : ఏపీ కాబినేట్ విస్తరణలో భాగంగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. తనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రులుగా స్థానం కల్పించారని.. తన పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రివర్గంలో చేర్చుకునేదుకు గవర్నర్ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అసలు విషయం ముఖ్యమంత్రి, ఇతర పెద్దలకే తెలుసన్నారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు దొరకడం హర్షనీయమన్నారు. మైనారిటీ కోటాలో గత మంత్రివర్గ విస్తరణలో కూడా తన పేరు చర్చకు వచ్చిందని బాషా గుర్తు చేశారు. -
పల్లె ఔట్.. కాలవ ఇన్
చివరి నిమిషంలో చాంద్‌కు చేజారిన అవకాశం – కాలవకు మంత్రి పదవి కట్టబెట్టడంతో మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లోనూ వ్యతిరేకత – పార్టీకోసం శ్రమించిన బీకే పార్థసారథి, పయ్యావులకు చంద్రబాబు మొండిచేయి – సిసలైన కార్యకర్తలను గుర్తించడంలో అధిష్టానం విఫలమైందని పెదవివిరుపు – ‘అనంత’ టీడీపీలో చిచ్చురేపుతోన్న మంత్రివర్గ విస్తరణ (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై చంద్రబాబు వేటు వేశారు. చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి కేబినెట్లో చోటు కల్పించారు. పార్టీ కోసం సుదీర్ఘంగా శ్రమించిన తమకు మంత్రి పదవి లభిస్తుందని బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి కాకుండా ‘రిజర్వేషన్ల’ పేరుతో రాజకీయం చేసేవారికి మంత్రి పదవి కట్టబెట్టడంపై బీకే, కేశవ్ తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ‘అనంత’లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కాలవకు పదోన్నతి కల్పించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో జిల్లాలో బలహీనపడిన టీడీపీలో తాజా మంత్రివర్గ విస్తరణ చిచ్చురేపుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 12 అసెంబ్లీస్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి అధికారం దక్కిన తర్వాత పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు కేబినెట్లో చోటు కల్పించారు. అయితే వీరిద్దరి పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవులు అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా, ఆర్థికంగా లబ్ధి పొందడం మినహా పార్టీ బలోపేతానికి వీరు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరినీ తప్పించి కొత్తవారిని తీసుకోవాలని భావించారు. అయితే పల్లె రఘునాథరెడ్డిని మాత్రమే తప్పించి సునీతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖాళీ స్థానంలో బీసీలకు కేటాయించాల్సి వస్తే పార్టీలో సీనియర్ నేత అయిన తనకే ప్రాధాన్యం ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి భావించారు. పదేళ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించానని, తనకు చోటు ఖాయమనుకున్నారు. ఇదే క్రమంలో 2004–14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీ ఉన్నతి కోసం పాటుపడిన వారిలో తాను కూడా ఉన్నానని, 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతోనే మంత్రి పదవి దూరమైందని, విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని కేశవ్ ఆశపడ్డారు. పైగా కేబినెట్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా కేశవ్‌ను నియమించడంతో విస్తరణలో తన ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి మొండిచేయి చూపించి ‘లాబీయింగ్’కే చోటు కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలవకు చోటుపై ఎమ్మెల్యేల మండిపాటు కాలవ శ్రీనివాసులు 1999 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. అనంతపురం ఎంపీగా బీసీ, బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో కాలవ శ్రీనివాసులు పేరును పయ్యావుల కేశవ్ అప్పట్లో సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో కాలవ విజయం సాధించారు. ఆపై 2004, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. ఆపై 2014 ఎన్నికల్లో కూడా రాయదుర్గం టిక్కెట్టును కేశవ్ ఇప్పించారని చెబుతున్నారు. 2004–14 వరకు ఓడిపోయిన పదేళ్లు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మినహా పార్టీ అభివృద్ధి కోసం ఏ రకంగానూ కాలవ పాటుపడలేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కాలవకు ఓ కేడర్ లేదని, వ్యక్తిగతంగా కనీసం 500 ఓట్లను సాధించే చరిష్మా కూడా లేదంటున్నారు. ఇలాంటి వ్యక్తికి చీఫ్‌విప్‌గా చోటు కల్పించారని, అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించామంటున్నారు. కానీ పని చేసిన వారికి న్యాయం చేయాల్సిన సమయంలో చంద్రబాబు రిజర్వేషన్లను సాకుగా చూపి తమకు మొండిచేయి చూపారని కేశవ్, పార్థ తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇవ్వాల్సి వస్తే తనకంటే కాలవకు ఉన్న అర్హతలేమిటో చెప్పాలని బీకే తన సన్నిహిత ఎమ్మెల్యేతో వాపోయినట్లు తెలుస్తోంది. నిర్వేదంలో కేశవ్ మంత్రివర్గంలో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విశ్వప్రయత్నాలు చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరితో పాటు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేశవ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకోవడంతో రాష్ట్రంలో మరో కమ్మ సామాజిక వర్గం వారికి చోటు కల్పించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. మంత్రి పరిటాల సునీతను దాదాపు మూడేళ్లపాటు కొనసాగించారని, పార్టీ కోసం శ్రమించినా తనకూ రెండేళ్లు అవకాశం ఇవ్వలేరా? అని కేశవ్ సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంత శ్రమించినా ఫలితం లేదన్నపుడు, ఎందుకు పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలని కేశవ్ వారితో వేదనపడ్డారని తెలుస్తోంది. విస్తరణలో పార్టీ సమన్యాయం చేయకపోగా పార్టీ కోసం శ్రమించినవారిని కాదని పత్రికా యజమానులు చెప్పిన వారికి చోటు కల్పించారని, వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మెజార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన పల్లె రఘునాథరెడ్డికి చీఫ్ విప్ ఇస్తారని సమాచారం. అయ్యో అత్తార్ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు మైనార్టీ కోటాలో తొలుత కేబినెట్లో బెర్త్ ఖరారు చేశారు. దీంతో ‘అనంత’కు మూడు మంత్రుల పదవులు వచ్చినట్లు అయ్యింది. తనకు మంత్రి పదవి ఖరారు అయిందనే సమాచారాన్ని చాంద్‌బాషా కదిరిలోని తన కుటుంబ సభ్యులు, అనుచరులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో కదిరిలో అత్తార్ అనుచరులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో మునిగి ఉండగానే టీవీలో షాకింగ్ న్యూస్ వెలువడింది. ఆఖరి నిమిషంలో చాంద్‌బాషా స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు బీసీ కోటాలో చంద్రబాబు మంత్రి పదవి ఖరారు చేశారు. దీంతో అత్తార్ మంత్రి పదివి ఆశలు అడియాసలు అయ్యాయి. -
ఉరేసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : రూరల్ మండలం పిల్లిగుండ్లకాలనీలో చాంద్‌బాషా(22) అనే ఆటోడ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనంమేరకు... స్థానికంగా నివాసముంటున్న ఇబ్రహీం కుమారుడైన చాంద్‌బాషా గతంలో పెయింటర్‌గా పని చేసేవారు. ఇటీవల ఆటో నడుపుకొంటున్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అప్పటినుంచి కొంత మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నారు. టూటౌ¯ŒS పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం
కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లిలో టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆయన శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీకి దిగాయి. చివరకు పోలీసు భద్రత నడుమ చాంద్‌బాషా గ్రామంలోకి వెళ్లి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. -
మా ఊళ్లోకి రావొద్దు
బూరుగుపల్లి (కదిరి అర్బన్) : మండల పరిధిలోని బూరుగుపల్లిలో ఎమ్యెల్యే అత్తార్‌చాంద్‌బాషా గ్రామంలోకి రాకూడదంటూ మార్గంలో ఫ్లెక్సీ వెలిసింది. కదిరి మండలంలో మొటుకుపల్లి, కౌలేపల్లి, కుమ్మరవాండ్లపల్లి, బూరుగుపల్లెల్లో శనివారం ఎమ్యెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించారు. గ్రామానికి ఎమ్యెల్యే వస్తున్నారన్న సమాచారంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని చెట్టుకు కట్టారు. పార్టీలు మారిన వారు జనచైతన్యయాత్రలు చేయవచ్చా ? అంటూ ఫ్లెక్సీలో ఉంది. ఫ్లెక్సీ ఎవరో కట్టారో.. ఎందుకు కట్టారో తెలియరాలేదు. మొటుకుపల్లిలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో తాగునీటి సమస్యను కొందరు ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్యెల్యే వెంట ఎస్ఎండీ ఇస్మాయిల్, కాటం శంకర్, అల్ఫాముస్తఫాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
కదిరిలో పచ్చ రచ్చ
ఎమ్మెల్యే చాంద్‌బాషా, పార్టీ ఇ¯ŒSచార్జ్ కందికుంట వర్గీయుల మధ్య ఘర్షణ కదిరి : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్‌బాషా వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ చిన్న కారణం దొరికినా ఆ సాకుతో గొడవలకు దిగుతున్నారు. గురువారం పట్టణంలోని వలీసాబ్ రోడ్లో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీ గొడవ జరిగింది. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోకపోతే పరిస్థితి అదుపు తప్పేది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జనచైతన్య యాత్రలకు సంబంధించి ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ స్థానిక వలీసాబ్‌రోడ్‌లో రెండు రోజుల క్రితం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే అనుచరుడు మస్తాన్ ఫొటోకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయాక ఎవరో పెన్నుతో మీసాలు గీశారు. ఆ దృశ్యాన్ని ఫేస్బుక్లో కూడా పెట్టారు. చివరకు ఆయన ఫొటోను పూర్తిగా చింపేశారు. మస్న్బంధువులు ఫేస్బుక్ ద్వారా ఈ దృశ్యాన్ని చూసి, వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. ఎవరు అలా చేశారని అడగడంతో ఆయన మనస్తాపానికి గురై ఎమ్మెల్యే అనుచరులతో చెప్పి బాధపడ్డారు. దీంతో వారంతా ఏకమై మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ ఆ పని చేశాడని భావించారు. షామీర్ ఆ వీధిలోకి రాగానే గొడవకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా ఆ వీధిలోకి రావడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. షామీర్పై దాడికి దిగారు. దీంతో కందికుంట అనుచరులు షామీర్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ పెద్దదైంది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు గోపాలుడు, ఉగాది వెంకట ప్రసాద్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. వెంటనే ఆ వీధిలో దుకాణాలు, టీ కొట్టులను మూయించారు. రోజంతా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యే చాంద్‌కు చుక్కెదురు
ఎన్పీ కుంట : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు చుక్కెదురైంది. నీళ్ల కోసం మహిâýæలు ఆయనను నిలదీశారు. జనచైతన్య యాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పి.కొత్తపల్లి, పెడబల్లి పంచాయితీల్లో పర్యటించారు. ‘‘సోలార్హబ్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇప్పిస్తామన్నారు... ఇప్పుడు ప్రభుత్వంలోనే చేరారు కదా వెంటనే ఇప్పించాలని పి.కొత్తపల్లిలో మహిâýæలు నిలదీశారు. ఆ తర్వాత పెడబల్లికి వెళ్తున్న ఎమ్మెల్యేకు మార్గమధ్యంలో గొల్లపల్లి గ్రామస్తులు రోడ్డుపై బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేను వెళ్లనీయకుండా రోడ్డుపై బైఠాయించారు. ‘మీరు వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఓట్లేసి గెలిపించామనీ, ఆ అక్కసుతో సర్పంచు భర్త రామాంజులు ఊరికి నీళ్లు రాకుండా చేస్తున్నాడు’ అని గ్రామస్తులు వాపోయారు. అలాగే గ్రామానికి రోడ్డు కూడా వేయించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి జేఈని పిలిపించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అనంతపురం సెంట్రల్ : సుభాష్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన చాంద్‌బాషా శుక్రవారం ఆటోలో టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి వైపుకు వస్తుండగా మార్గమధ్యలో ఆ బైక్ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చాంద్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పరాభవాల పరంపర
► కదిరి ఎమ్మెల్యేను స్వాగతించలేకపోతున్న టీడీపీ శ్రేణులు ► మినీ మహానాడుకు ముఖం చాటేసిన చాంద్‌బాషా ► హాజరైతే భౌతికదాడులకు సిద్ధమైన కందికుంట అనుచరులు (సాక్షిప్రతినిధి, అనంతపురం) ఎన్నో ఆశలతో టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికే అత్తార్ అధికారాలకు కత్తెర పెడితే.. జిల్లా నేతలు కూడా చేరదీయడం లేదు. ఇటీవల టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పరాభవాన్ని మరవకముందే.. అత్తార్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. కదిరిలో బుధవారం జరిగిన మినీమహానాడుకు హాజరుకాలేదు. కందికుంట వర్గం బెదిరింపుల నేపథ్యంలో తిరుపతికి పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం కదిరిలోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ మినీ మహానాడును నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎమ్మెల్యే చాంద్‌బాషా మాత్రం గైర్హాజరయ్యారు. దీనిపై జిల్లాలో తీవ్ర చర్చ సాగుతోంది. మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి మినీమహానాడులో తీర్మానాలు చేస్తారు. వీటిని మహానాడులో నివేదిస్తారు. నియోజకవర్గస్థాయిలో ఇంతకంటే ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం టీడీపీకి మరొకటి లేదు. దీన్ని వాస్తవానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించాలి. కానీ కందికుంట.. చాంద్‌బాషాను బైపాస్ చేసి మహానాడును నిర్వహించారు. చాంద్‌బాషా హాజరైతే అవమానించి పంపాలని, అవసరమైతే భౌతికదాడి చేయాలని కందికుంట వర్గం భావించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫంక్షన్‌హాలు బయట కొంతమంది పాగావేసినట్లు గ్రహించిన చాంద్‌బాషా తిరుపతికి పారిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఆయన అనుచరులు కూడా అటువైపు చూడలేదు. విస్తృతస్థాయి సమావేశంలోనూ అవమానమే ఈ నెల 3న ‘అనంత’లో నిర్వహించిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి చాంద్‌బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చాంద్‌బాషా వైఖరిపై పరోక్షంగా చురకలంటించారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ‘పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఒక్క కార్యకర్త పార్టీ వీడలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రెండేళ్లు కూడా ఉండలేకపోతున్నారు’ అని పరోక్షంగా చాంద్ కు చురకలంటించారు. కేశవ్ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన మొహం చిన్నబోయింది. సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తల కళ్లన్నీ చాంద్‌బాషా వైపు చూశాయి. తర్వాత కందికుంట మాట్లాడుతూ ‘ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశానికి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఇటీవల జరిగిన ఘటన వ్యక్తిగతంగా నొప్పి కల్గించింది. తప్పనిపరిస్థితుల్లో పార్టీ అధినేత కోసం స్వాగతించాం’ అని నేరుగా ఎమ్మెల్యేనుద్దేశించి అన్నారు. సమావేశానికి వచ్చిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా చాంద్‌తో అంటీముట్టనట్లు వ్యవహరించారు. అధికారాలకూ కత్తెర చాంద్‌బాషాకు కదిరి నియోజకవర్గంపై ఎలాంటి పెత్తనమూ లేకుండా చేయడంలో టీడీపీ నేతలు సఫలీకృతులయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాలకు లబ్ధిదారుల ఎంపికలోనూ ఎమ్మెల్యే సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని, కందికుంటకే ప్రాధాన్యతివ్వాలని జిల్లా ఇన్చార్జ్మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలోనే జిల్లా అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. మంగళవారం మరోసారి ఇదే విషయాన్ని పునురుద్ఘాటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో ‘అనుకున్నది ఒకటైతే...అయ్యేది మరోలా ఉందని’ చాంద్‌బాషా డీలాపడుతున్నారు. టీడీపీలోకి వచ్చి పెద్ద తప్పు చేశానని తన అనుచరులతో వాపోతున్నట్లు అత్తార్ సన్నిహితులు ‘సాక్షి’తో చెప్పారు. -
చాంద్‌బాషాపై మైనారిటీల ఆగ్రహం
► అమ్ముడుపోయావంటూ దిష్టిబొమ్మ దహనం ► ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా టీడీపీలో చేరడంపై శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. 'ఎన్నికల్లో ఆ రోజు మేము నిన్ను చూసి ఓట్లు వేయలేదు. వైఎస్సార్ కుటుంబాన్ని చూసి నిన్ను గెలిపించుకున్నాం. నీకు ఏమాత్రమూ సిగ్గు..లజ్జ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీచేసి గెలువు. కదిరికి వస్తే చొక్కా పట్టుకొని నిలదీస్తాం' అని మైనార్టీలు హెచ్చరించారు. కదిరి పట్టణంలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో ఎమ్మెల్యేకు చెందిన అత్తార్ రెసిడెన్సీ ఎదుట చాంద్‌బాషా దిష్టిబొమ్మను దహనం చేశారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కాకు పలుమార్లు వెళ్లొచ్చి, హాజీగా పేరు గడించి, ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసగించడం సరికాదని మండిపడ్డారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓట్లు వేయొద్దని చెప్పి ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వెళ్లావని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల ద్రోహి..అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు బాబా, జిలాన్, అల్లాబక్ష్, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు జక్కల ఆదిశేషు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర నేత లింగాల లోకేశ్వర్‌రెడ్డి, ఎన్పీకుంట సింగిల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా నాయకులు కుర్లి శివారెడ్డి, గాండ్లపెంట మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు సలీం, ఉపేంద్రశీనా, నాగేంద్ర, కోటి, ఎస్సీ సెల్ నాయకులు రాంప్రసాద్, విద్యార్థి విభాగం నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. -
చాంద్‌బాషా చేరికతో అనంతలో ముసలం
విజయవాడ : అనంతపురం టీడీపీలో ముసలం మొదలైంది. కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేరికతో అసమ్మతి తీవ్రస్థాయిలో చెలరేగింది. చాంద్‌బాషా చేరికపై కదిరి టీడీపీ ఇంఛార్జ్ కందికుంట ప్రసాద్... టీడీపీ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. చాంద్‌బాషా చేరిక నేపథ్యంలో ఈ రోజు ఉ. 9.30 గంటలకు సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు...ప్రసాద్‌తో మంతనాలు సాగించారు. దీంతో ఆయన్ని శాంత పరిచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంత్రి పరిటాల సునీత జోక్యం చేసుకుని... ప్రసాద్‌ను చంద్రబాబు వద్దకు స్వయంగా తీసుకునివెళ్లారు. చాంద్ బాషా చేరికపై చంద్రబాబు ఎదుటే ప్రసాద్ అసంతృప్తి వ్యక్త చేశారు. దీంతో చాంద్ బాషా చేరిక ప్రక్రియ పూర్తికాకుండానే ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
'డబ్బులకు అమ్ముడుపోయిన చాంద్‌బాషా'
కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా...టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు శనివారం కదిరి పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డబ్బులకు అమ్ముడుపోయిన చాంద్‌బాషా అంటూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే చాంద్‌బాష దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే ఎమ్మెల్యేకి చెందిన లాడ్జి ముందు ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీఈసీ సభ్యుడు జక్కాల ఆదిశేషు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మైనారిటీలు పాల్గొన్నారు. -
'చంద్రబాబుకు మేమంటే భయం'
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ భాషా అన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని అన్నారు. అవినీతి సొమ్ముతోనే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, ఏ ఒక్కరికీ ఇళ్ల స్థలాలుగానీ, పక్కా గృహాలుగానీ కట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కదిరిలో మళ్లీ ఉద్రిక్తత
అనంతపురం జిల్లా కదిరిలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. తన పై దాడి చేసి వారిని అరెస్టు చేయాలని కోరుతూ ధర్నా చేస్తున్న కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కార్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు వైసీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. తమ అరెస్టుకు నిరసన గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసు వాహనం ఎక్కేందుకు నిరాకరించారు. స్టేషన్ వరకూ నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చాంద్ బాషా ఆరోపించారు. తన కారుపై దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి
అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. తలుపుల ఉరుసు ఉత్సవాల్లో దుండగులు బీభత్సం సృష్టించి, ఎమ్మెల్యే కారు అద్దాలను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. చాంద్ బాషా తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు చేసి 12 గంటలు అయినా పోలీసులు స్పందించలేదు. చాంద్ బాషా మాట్లాడుతూ.. తన వాహనంపై దాడి చేయడం పిరికిపందల చర్య అని అన్నారు. తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కారు అద్దాలను ధ్వంసం చేశారని విమర్శించారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు. -
లెక్కలు తేల్చాల్సిందే
మైనారిటీలకు కేటాయింపుల లెక్కల్లో తేడాలు వైఎఎస్ఆర్సీపీ సభ్యుల తీవ్ర నిరసన పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు స్పీకర్ వైఖరి నశించాలంటూ నినాదాలు హైదరాబాద్ మైనారిటీల వ్యవహారంపై మంత్రి చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా వివరించబోతుండగా మధ్యలోనే ఆపినందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. స్పీకర్ వైఖరి నశించాలంటూ నినదించారు. మైనారిటీలకు కేటాయించిన నిధుల లెక్కలు తేల్చాలని పట్టుబట్టారు. వుయ్ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకే ఇలా చేస్తోందని, లెక్కలు చూపించడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మైకులు కట్ చేయడం ఏంటని, చర్చకు ఎందుకు అవకాశం ఇవ్వరని అడుగుతూ పోడియం వద్ద బైఠాయించారు. తొలుత మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రన్న రంజాన్ కానుక పేరుతో ఒకసారి, రంజాన్ కానుక పేరుతో మరోసారి వారికి సాయం అందిస్తున్నామని మంత్రి రఘునాథరెడ్డి చెప్పారు. దీనికి కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా అభ్యంతరం తెలిపారు. మంత్రి చెబుతున్నది చూస్తుంటే మైనారిటీలకు ప్రభుత్వం చాలా చేసేస్తోందని అనిపిస్తుందని, కానీ అవన్నీ అవాస్తవాలని అన్నారు. మైనారిటీల కోసం అదనంగా నిధులు ఖర్చు చేశామంటున్నారు గానీ, అదంతా తప్పేనన్నారు. రెండేళ్ల క్రితం బడ్జెట్లో రూ. 246 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 2015-16 బడ్జెట్లో రూ. 376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించారని, కానీ బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మైనారిటీ హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఇలా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చుపెట్టినట్లు చెప్పడం ఏంటని మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన లేదని అన్నారు. అయితే చాంద్ బాషా ఇలా వివరిస్తుండగానే.. స్పీకర్ కలగజేసుకుని, సబ్జెక్టుల వారీగా వివరంగా అక్కర్లేదని, తక్కువగా ఖర్చు పెట్టారని చెబితే సరిపోతుందని అన్నారు. అయితే గతంలో ఒకో ప్రశ్నకు 20-40 నిమిషాలు కూడా కేటాయించేవారని, ఇప్పుడు మైనారిటీలకు సంబంధించిన అంశానికి కనీసం 5 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగని చాంద్ బాషా అడిగారు. కనీసం అనుబంధ ప్రశ్నకు అయినా అవకాశం ఇవ్వపోతే ఎలాగని అన్నారు. అయినా స్పీకర్ మాత్రం మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సమాధానం ఇవ్వాలని చెప్పారు. దాంతో ఆయన సమాధానం ఇస్తుండగానే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా లేచి నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత, టీ విరామం కోసం అసెంబ్లీని పది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
'రైతుల పట్ల బాబు కర్కశంగా వ్యవహరిస్తున్నారు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్‌బాషా గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రైతుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'పెంచిన ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలి'
అనంతపురం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు సతమతమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పై మండిపడ్డారు. తాజాగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో సామాన్యులపై మోయలేని భారం పడిందని చాంద్ బాషా అన్నారు. -
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టింది
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని ఆదివారం అనంతపురంలో మండిపడ్డారు. అందుకే రాజధాని శంకుస్థాపన పేరుతో చంద్రబాబు రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నివసించడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో సాధ్యమని చాంద్ బాషా స్పష్టం చేశారు. -
’సింగపూర్ బృందాలకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు’
-
రుణ మాఫీ చేసింది కేవలం 7వేల కోట్లే
-
'అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి'
అనంతపురం: అక్రమ మైనింగ్‌ను వెంటనే అరికట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని తలుపుల మండలం ఉడుమలకుర్తిలో సాగుతున్న అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా సూచించారు. -
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కదిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చాంద్‌బాషా మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితుల వల్లే రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. అటు సాగు నీరు ఇటు తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని చాంద్‌బాషా ఆందోళన వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం
-
అణచివేతకు దిగితే ప్రజలే బుద్ధిచెబుతారు
హైదరాబాద్ సిటీ: శాంతియుతంగా చేసే నిరసనలను, ఆందోళనలను టీడీపీ ప్రభుత్వం అణచి వేస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష హెచ్చరించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నగరికి వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కడపలో ఇద్దరు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామికమన్నారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ కుటుంబీకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నా చేయాలనుకోవడం కూడా నేరమేనా? అని ఆయన ప్రశ్నించారు. నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు విద్యార్థినుల మృతికి నిరసనగా బంద్ చేస్తూంటే తమ ఎమ్మెల్యేలను ఆందోళనలో పాల్గొనకుండా చేయడం నీచమన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు చనిపోతోంటే కనీసం విచారణకు ఆదేశించడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నో ఆశలతో తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని కూలీ నాలీ చేసిన డబ్బుతో చాలా మంది తల్లిదండ్రులు నారాయణ కళాశాలలకు పంపుతున్నారని వారు మరణిస్తే ఆ శోకం ఎలాంటిదో ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన అన్నారు. -
ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా బుధవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా ? లేక రౌడీ రాజ్యమా ? అని సర్కార్‌ను సూటిగా ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని సర్కార్‌ను నిలదీశారు. తమ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేసినా ప్రజలు స్వచ్చంధంగా కడప, నగరిలో బంద్ పాటిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని చాంద్‌బాషా స్పష్టం చేశారు. -
'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి'
అనంతపురం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా అన్నారు. బుధవారం అనంతపురంలో మహానేత వైఎస్ఆర్ 66వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చాంద్‌బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా చాంద్‌బాషా వివరించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, విద్యార్థులు, రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ పట్టకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని చాంద్‌బాషా ఆరోపించారు. -
తాగునీటిపైనే దృష్టి
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తోందని రాష్ట్ర పౌరసంబందాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్‌హాలులో చెర్మైన్ చమన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 22.7 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. బోర్లు మరమ్మతులు, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, డీపెనింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే శ్రీరామిరెడ్డి తాగునీటి, జేసీ నాగిరెడ్డి, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాకు సాగు,తాగునీటిని అందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ బారిన పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడదెబ్బకు గురై చనిపోయిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ నేతృత్వంలో కమిటీ నిర్దారణ చేసిన తర్వాత ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను తీసుకురావడానికి చెర్మైన్‌తో కలిసి కృషి చేస్తానన్నారు. రైతు రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేయగా వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేయాలని ఎల్డీఎంను మంత్రి ఆదేశించారు. రానున్న ఖరీఫ్‌లో 3.25 లక్షల విత్తన వేరుశనగ అవసరమని, ప్రస్తుతానికి రూ. 18 వేల క్వింటాళ్లు సేకరించామని వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి వివరించారు. మంత్రి మాట్లాడుతూ... రానున్న జూన్2, 3 తేదీల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆలోగా లక్ష క్వింటాళ్ల విత్తన వేరుశనగ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. నాణ ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, నాశిరకం విత్తనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీరు- చెట్టు కార్యక్రమంలో పూడికమట్టిని ప్రభుత్వ ఖర్చులతో రైతులు తమ పొలంలోకి తరలించుకోవచ్చునని, చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే సభ్యులు 3 కిలోమీటర్లకే పరిమితం చేశారని ఫిర్యాదు చేయడంతో ఇందులో మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాకు వివిద పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద సెంట్రల్యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు వచ్చాయని, త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ... జిల్లాలో లక్ష మరుగుదొడ్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వేగవంతంగా మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు ఆర్డీటీ సంస్థకు 34వేలు నిర్మించాలని కోరామన్నారు. మిగిలిన ఎన్జీఓల ద్వారా లక్ష సాధనకు మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. తాగునీటి సమస్యలోనూ రాజకీయం: విశ్వ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ‘ఉరవకొండ నియోజకవర్గం జె.రాంపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడేందుకు బోరు వే యగా రాజకీయం చేసి అడ్డుకున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాలను సైతం తహశీల్దార్ బేఖాతర్ చేస్తున్నాడని ఆరోపించారు. అలాగే బ్యాంకుల నుంచి రైతులకందే సాయంపై దృష్టి సారించాలని కోరారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రుణాలు తీసుకునేందుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని అంటున్నా ఆ దిశగా పనులు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కేవలం రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇలాగైతే ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఏడాదికైనా జిల్లాలో 1.18 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు కదిరి నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీరు-చెట్టు ప్రొగాం నియోజకవర్గంలో జరుగుతున్నా స్థానిక శాసనసభ్యునిగా తనకు కనీస ఆహ్వానం లేదని, ఇంతకన్నా దౌర్బాగ్యముంటుందా అని ప్రశ్నించారు. వెంటనే అధికారులతో ప్రొటోకాల్ విషయంపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు తన కృషితో మంజూరైన రూ.42 లక్షలు ఎక్కడికిపోయాయో తెలియడం లేదన్నారు. నియోజకవర్గంలోని తాగునీటి ఇబ్బందులపై చర్చించాలని అధికారులు ఆహ్వానిస్తే సార్.. మీ దగ్గరుకు వస్తే మా ఉద్యోగాలు పోతాయి అని అంటున్నారు. నేనేమైనా ఉగ్రవాదినా? అసాంఘిక కార్యకలపాలు ఏమైనా చేస్తున్నానా? ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ మాట్లాడుతూ.. గతంలోనే పనులు మంజూరు చేయడం వలన ఎమ్మెల్యే సిఫారుస చేసిన పనులు చేపట్టలేకపోయామని సంజాయిషీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులున్నాయని, వెంటనే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్‌ను తూచతప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ యామనిబాల, జెడ్పీ వైఎస్ చైర్మన్ సుబాషిణమ్మ, ఎమ్మెల్సీ గేయానంద్, జెడ్పీ సీఈఓ రామచంద్ర, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషాలు నిప్పులు చెరిగారు. మంగళవారం అనంతపురంలో వై విశ్వేశ్వరరెడ్డి, చంద్బాషా మాట్లాడుతూ... హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా పూర్తి చేస్తే రాయలసీమలో ఆత్మహత్యలు తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుపై ఎందుకు హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయాలన్న డిమాండ్‌తో జనవరి 28, 29 తేదీల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 15 రోజులు చాలంటూ ఆర్థిక మంత్రి యనమల పేర్కొనడం దురదృష్టకరమని ఎమ్మెల్యే చాంద్‌బాషా వ్యాఖ్యానించారు. ఏపీలో రాజధాని నిర్మాణం, రుణమాఫీ, నిరుద్యోగభృతి వంటి అనేక సమస్యలున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు 45 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పలేక అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు ప్రభుత్వం కుదిస్తోందని చాంద్ బాషా విమర్శించారు. -
చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మంగళవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం వల్ల సామాన్యులకు సొంతింటి కల దూరం అవుతుందని ఆయన ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెరిగిందన్నారు. ఇసుక ధర పెరగడం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయని ఆయన విమర్శించారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై వైఖరీ మార్చుకుంటే ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా చంద్రబాబును చాంద్ బాషా హెచ్చరించారు. -
'సభను నడిపిన తీరుకు అధికార పక్షం సిగ్గుపడాలి'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం వ్యవహరించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్బాషా, నారాయణస్వామి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద వారు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి... సభను ఏకపక్షంగా నడిపారని విమర్శించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, నూతన రాజధాని, ఉద్యోగుల తొలగింపు, నిరుద్యోగులు, ఐకేసీ, అంగన్వాడీ వంటి ప్రజా సమస్యలపై సభలో తాము లేవనెత్తిన ఏ అంశానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. మైనారిటీ సమస్యలు లేవనెత్తడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశృ఼రు. సభను నడిపిన తీరుకు అధికారపక్షం సిగ్గుపడాలని అన్నారు. -
రుణమాఫీ గిన్నిస్ రికార్డ్ అంటున్నారు.. ఎక్కడయ్యా మీ రికార్డ్?
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకూ ఏ ఒక్కటైనా నెరవేర్చరా?అంటూ బాషా ప్రశ్నించారు. ఎన్నికల వేల ఇచ్చిన హామీలపై టీడీపీ నాన్చవేత ధోరణిని తప్పుబట్టిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణమాఫీ గిన్నిస్ రికార్డ్ అంటున్నారు.. అసలు ఎక్కడయ్యా మీ రికార్డ్ అంటూ ఆయన నిలదీశారు. చంద్రబాబు విదేశీ టూర్లు, మంత్రుల రియల్ దందాలకు మాత్రమే పరిమితమయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలపై దాటవేత ధోరణి అవలంభిస్తున్నార్నారు. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజు ఎంతో దూరంలో లేదని చాంద్ బాషా విమర్శించారు. -
కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు వస్తున్నాయి. నెల రోజుల్లోగా పార్టీకి రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకోవాలని, లేకపోతే చంపేస్తామని ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే చాంద్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని తలపుల మండలం ఇందుకూరుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సూర్యగా గుర్తించారు. నిందితునిపై ఐపీసీ 341, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు. దీనిపై ఎమ్మెల్యే చాంద్ బాషా ఇలా చెప్పారు.. ''నేను తలపుల మండలం వెళ్తుంటే .. ఈనెల 11వ తేదీన మిస్డ్ కాల్ వచ్చింది. మూడు నిమిషాల తర్వాత మరో కాల్ వచ్చింది. రాజీనామా చేయాలని అన్నారు. ఎవరు నువ్వు అని అడిగాను. నేనెవరో అనవసరం, రాజీనామా చేస్తావా చెయ్యవా అని అడిగారు. నేనెవరో తెలుస్తుంది.. నెల రోజుల్లోగా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం అన్నారు. దీనిపై నేను విచారణ చేసిన తర్వాత తలపుల మండలానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అని తెలిసింది. అతడు ఇంతకుముందు శివారెడ్డి అనే వ్యక్తి మీద జరిగిన హత్య కేసులో కూడా నిందితుడని తెలిసింది. పోలీసులు తర్వాత అతడిని పట్టుకున్నారు.'' -
చంద్రబాబును కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
అనంతపురం: అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు. ఈ సందర్భంగా వారు అనంతపురానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... చంద్రబాబును కోరారు. కాగా నాయుడి జిల్లా పర్యటన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఎక్కడా ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా నిర్ణయించుకున్న విధంగా చెప్పాల్సింది చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, ప్రజలు సహకరించాలని ప్రతి చోటా చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయం పడుతుందని, ఓపికతో ఉండాలని కోరారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగిలాయి. వనరులు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఉన్నవాటిని ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒకొక్కటిగా నెరవేరుస్తా. నేను ఒక్కటే చెబుతున్నాను. నాకు మీ సహకారం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'ముస్లింలపై చంద్రబాబుకు కక్ష'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై కక్ష పెంచుకున్నారని, ఆయన కంటే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెయ్యిరెట్లు నయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నేత చాంద్ బాషా విమర్శించారు. జనాభాలో ఎనిమిది శాతం వరకు ఉన్న ముస్లింల కోసం చంద్రబాబు ఏమీ చేయడంలేదని, రంజాన్ మాసం అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంపై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆయన అన్నారు. వాగ్దానాలు అమలు చేయని ప్రభుత్వాన్ని దించేయాలని ఆ వ్యాజ్యంలో కోరుతానని చాంద్ బాషా చెప్పారు. -
మైనార్టీలపై చంద్రబాబు కపట నాటకం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా విమర్శించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకి కూడా చోటు కల్పించలేదని, బ్లాక్ డే గా పరిగణిస్తామని చెప్పారు. చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకుండా కమిటీ నియమించడం రైతులను మోసగించడమేనని చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు కపట నాటకాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని చాంద్ బాషా చెప్పారు. -
'తొలి సంతకం రుణమాఫీపైనే చేయాలి బాబు'
ఆంధప్రదేశ్ రైతులు రుణమాఫీ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో చాంద్‌బాషా మాట్లాడుతూ... మైనార్టీలకు వైఎస్ఆర్ సీపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే .... టీడీపీ మాత్రం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మైనార్టీలకు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. ఆ స్థానంలో టీడీపీకి అంత పట్టుకూడా లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని చాంద్ బాషా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.