కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం | bad experience to Kadiri MLA Attar Chand Basha | Sakshi
Sakshi News home page

కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Published Sat, Nov 26 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

కదిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం

కదిరి: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం గోరంట్లవారిపల్లిలో టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ఆయన శనివారం వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ను పార్టీ నుంచి దూరం చేస్తున్నారంటూ ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీకి దిగాయి. చివరకు పోలీసు భద్రత నడుమ చాంద్‌బాషా గ్రామంలోకి వెళ్లి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement