'తొలి సంతకం రుణమాఫీపైనే చేయాలి బాబు' | YSR Congress party MLA Chand Basha demands to Chandrababu naidu due farmers craft loan | Sakshi
Sakshi News home page

'తొలి సంతకం రుణమాఫీపైనే చేయాలి బాబు'

Published Tue, May 27 2014 2:38 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

YSR Congress party MLA Chand Basha demands to Chandrababu naidu due farmers craft loan

ఆంధప్రదేశ్ రైతులు రుణమాఫీ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణమాఫీ ఫైల్పై సంతకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో చాంద్బాషా మాట్లాడుతూ... మైనార్టీలకు వైఎస్ఆర్ సీపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే .... టీడీపీ మాత్రం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మైనార్టీలకు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

 

ఆ స్థానంలో టీడీపీకి అంత పట్టుకూడా లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని చాంద్ బాషా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement