అనంతపురం జిల్లా కదిరిలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. తన పై దాడి చేసి వారిని అరెస్టు చేయాలని కోరుతూ ధర్నా చేస్తున్న కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కార్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు వైసీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు.
తమ అరెస్టుకు నిరసన గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసు వాహనం ఎక్కేందుకు నిరాకరించారు. స్టేషన్ వరకూ నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చాంద్ బాషా ఆరోపించారు. తన కారుపై దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు.
కదిరిలో మళ్లీ ఉద్రిక్తత
Published Thu, Apr 7 2016 1:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement