కదిరిలో వైఎస్ జగన్‌కు అభిమాన స్వాగతం | heartily welcomes to ys jagan in anantapur kadiri | Sakshi
Sakshi News home page

కదిరిలో వైఎస్ జగన్‌కు అభిమాన స్వాగతం

Published Mon, May 9 2016 10:56 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కదిరిలో వైఎస్ జగన్‌కు అభిమాన స్వాగతం - Sakshi

కదిరిలో వైఎస్ జగన్‌కు అభిమాన స్వాగతం

కదిరి: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరారు.

కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్‌లో ఆయన కాన్వాయ్‌ను చూసిన అభిమానులు అభివాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరడం వల్ల పార్టీకి స్థానికంగా వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement