ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్బాషా గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్బాషా గురువారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. రైతుల పట్ల చంద్రబాబు కర్కశంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. రుణమాఫీపై చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.