
చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మంగళవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం వల్ల సామాన్యులకు సొంతింటి కల దూరం అవుతుందని ఆయన ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెరిగిందన్నారు.
ఇసుక ధర పెరగడం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయని ఆయన విమర్శించారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై వైఖరీ మార్చుకుంటే ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా చంద్రబాబును చాంద్ బాషా హెచ్చరించారు.