'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి' | Chand Basha pay tributes to ys rajasekhar reddy | Sakshi
Sakshi News home page

'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి'

Published Wed, Jul 8 2015 10:38 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM

'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి' - Sakshi

'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి'

అనంతపురం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా అన్నారు. బుధవారం అనంతపురంలో మహానేత వైఎస్ఆర్ 66వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చాంద్బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా చాంద్బాషా వివరించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, విద్యార్థులు, రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ పట్టకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని చాంద్బాషా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement