kadiri mla
-
కదిరి ఎమ్మెల్యేపై కందికుంట అనుచరుల అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కదిరి: ‘టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పలు కేసుల్లో నేరస్తుడు, 12 ఏళ్లు శిక్ష పడిన ఖైదీ. డీడీల దొంగ. ఆయన ఇకపై వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది’ అని కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కందికుంట అనుచరులు ఫేస్బుక్లో పెట్టిన అసభ్యకర పోస్టులపై గురువారం పట్టణ సీఐ సత్యబాబుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కందికుంట అనుచరులు పోరెడ్డి ఓబుళరెడ్డి, మారుతీకుమార్, కళ్యాణ్‌చిన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టులను చదివి వినిపించారు. ఉగాండాలో బోరుబండి దగ్గర పైపులు మోసుకునే పోరెడ్డి ఓబుళరెడ్డికి పెద్దగా చదువు రాదని, మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైతే పట్టాభి చేత సీఎం వైఎస్ జగన్‌ను తిట్టించారో, అలాగే ఇక్కడ కూడా కందికుంట తన అనుచరుల ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. విచారణకు పిలిపిస్తే తప్పేంటి?.. ఉగాండాలో ఉన్న వ్యక్తి తనపై అసభ్యంగా ఫేస్బుక్లో పోస్టులు పెడితే విచారణలో భాగంగా పోలీసులు ఆయన తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తే తప్పేంటని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. ఇదేదో పెద్ద నేరమైనట్లు ఎల్లో మీడియా తమ ఛానళ్లలో డిబేట్లు పెట్టి ప్రసారం చేశాయని, అదే మీడియా తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అసభ్యకర పోస్టులపై ఎందుకు కథనాలు ప్రసారం చేయలేదో చెప్పాలన్నారు. ఇదే అవమానం మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తన ట్విట్టర్లో స్పందించడం సరికాదన్నారు. అలాగే కదిరి ‘సాక్షి’ విలేకరిపై అసభ్యకర పోస్టులు పెట్టినా.. జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్) డీఎస్పీకి భయమెందుకు?.. కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ నేరస్తుడైన కందికుంటకు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నేరస్తులకు భయపడితే ఇక సామాన్యులు పరిస్థితి ఏం కావాలన్నారు. మహిళలను దూషిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వారిపై సాటి మహిళగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామన్నారు. కాగా.. ఎమ్మెల్యే పీఏ అబూబాకర్ సైతం తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై మరో ఫిర్యాదు చేశారు. -
చాంద్ బాషాకు చంద్రబాబు షాక్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు చంద్రబాబు నిరాకరించారు. గత ఎన్నికల్లో బాషా చేతిలో ఓడిపోయిన కందికుంట ప్రసాద్‌కు ఈసారి సీటు ఖరారు చేశారు. చాంద్‌బాషాకు మంత్రి పదవి ఇస్తానని చివరి వరకూ ఊరించి ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గోనుకుంట్ల సూర్యనారాయణ, బీకే పార్థసారథిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్‌రెడ్డిని పనిచేసుకోమని చెప్పినా ఖరారుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను కూడా పనిచేసుకోవాలని సూచించినా ఆఖరి నిమిషంలో మారే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో అనంతపురం, రాయదుర్గం, ఉరవకొండ స్థానాలకు ప్రభాకర్ చౌదరి, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌లకు సీట్లు ఖరారు చేశారు. నాలుగు ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు! నాలుగు పార్లమెంట్ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఎంపీ అభ్యర్థులుగా సిట్టింగ్‌లైన కింజరాపు రామ్మోహన్నాయుడు, అశోక్‌గజపతిరాజు పేర్లను శుక్రవారం ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని సిట్టింగ్ ఎంపీ శివప్రసాద్‌కు దాదాపు ఖరారు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయన పార్టీలో చేరకముందే సీటు ఖరారు చేయడం గమనార్హం. తిరుపతి ఎంపీ స్థానాన్ని జూపూడి ప్రభాకర్‌రావుకు కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యేపై టీడీపీ కేడర్ ఆందోళన విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలోని గజపతినగరం ఎమ్మెల్యే కె.అప్పలనాయుడికి వ్యతిరేకంగా అక్కడి టీడీపీ కేడర్ శుక్రవారం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. అప్పలనాయుడు అవినీతికి పాల్పడ్డారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని తేల్చిచెప్పారు. -
‘అసలు విషయం.. సీఎం, ఇతర పెద్దలకే తెలుసు’
సాక్షి, అమరావతి : ఏపీ కాబినేట్ విస్తరణలో భాగంగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. తనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రులుగా స్థానం కల్పించారని.. తన పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రివర్గంలో చేర్చుకునేదుకు గవర్నర్ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అసలు విషయం ముఖ్యమంత్రి, ఇతర పెద్దలకే తెలుసన్నారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు దొరకడం హర్షనీయమన్నారు. మైనారిటీ కోటాలో గత మంత్రివర్గ విస్తరణలో కూడా తన పేరు చర్చకు వచ్చిందని బాషా గుర్తు చేశారు. -
ఏ పార్టీ తరఫున వచ్చావయ్యా!
తలుపుల: అనంతపురం జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్‌బాషాకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా తలుపుల మండలం నూతనకాల్వ పంచాయతీలో పర్యటించిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాను ప్రజలు ‘ఏపార్టీ తరఫున వచ్చావయ్యా..’ అంటూ నిలదీశారు. గతంలో గ్రామానికి వచ్చినప్పుడు తనకు మంచి ఆదరణ లభించిందని, ఇప్పుడేమైందంటూ స్థానికులను ఆయన ప్రశ్నించడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీలో ఉండడం వల్ల ఓట్లేసి గెలిపించుకున్నామని, ఇప్పుడు ఏ పార్టీ తరఫున ఊళ్లో అడుగుపెట్టారంటూ ప్రశ్నించారు. ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక మౌనంగా వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో దిగువ బైగారిపలిలోనూ ఆయనకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది. -
మా ఊళ్లోకి రావొద్దు
బూరుగుపల్లి (కదిరి అర్బన్) : మండల పరిధిలోని బూరుగుపల్లిలో ఎమ్యెల్యే అత్తార్‌చాంద్‌బాషా గ్రామంలోకి రాకూడదంటూ మార్గంలో ఫ్లెక్సీ వెలిసింది. కదిరి మండలంలో మొటుకుపల్లి, కౌలేపల్లి, కుమ్మరవాండ్లపల్లి, బూరుగుపల్లెల్లో శనివారం ఎమ్యెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించారు. గ్రామానికి ఎమ్యెల్యే వస్తున్నారన్న సమాచారంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని చెట్టుకు కట్టారు. పార్టీలు మారిన వారు జనచైతన్యయాత్రలు చేయవచ్చా ? అంటూ ఫ్లెక్సీలో ఉంది. ఫ్లెక్సీ ఎవరో కట్టారో.. ఎందుకు కట్టారో తెలియరాలేదు. మొటుకుపల్లిలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో తాగునీటి సమస్యను కొందరు ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్యెల్యే వెంట ఎస్ఎండీ ఇస్మాయిల్, కాటం శంకర్, అల్ఫాముస్తఫాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చాంద్‌కు చుక్కెదురు
ఎన్పీ కుంట : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు చుక్కెదురైంది. నీళ్ల కోసం మహిâýæలు ఆయనను నిలదీశారు. జనచైతన్య యాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పి.కొత్తపల్లి, పెడబల్లి పంచాయితీల్లో పర్యటించారు. ‘‘సోలార్హబ్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇప్పిస్తామన్నారు... ఇప్పుడు ప్రభుత్వంలోనే చేరారు కదా వెంటనే ఇప్పించాలని పి.కొత్తపల్లిలో మహిâýæలు నిలదీశారు. ఆ తర్వాత పెడబల్లికి వెళ్తున్న ఎమ్మెల్యేకు మార్గమధ్యంలో గొల్లపల్లి గ్రామస్తులు రోడ్డుపై బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేను వెళ్లనీయకుండా రోడ్డుపై బైఠాయించారు. ‘మీరు వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఓట్లేసి గెలిపించామనీ, ఆ అక్కసుతో సర్పంచు భర్త రామాంజులు ఊరికి నీళ్లు రాకుండా చేస్తున్నాడు’ అని గ్రామస్తులు వాపోయారు. అలాగే గ్రామానికి రోడ్డు కూడా వేయించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి జేఈని పిలిపించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
'అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి'
అనంతపురం: అక్రమ మైనింగ్‌ను వెంటనే అరికట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని తలుపుల మండలం ఉడుమలకుర్తిలో సాగుతున్న అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా సూచించారు. -
'వైఎస్ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి'
అనంతపురం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా అన్నారు. బుధవారం అనంతపురంలో మహానేత వైఎస్ఆర్ 66వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చాంద్‌బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా చాంద్‌బాషా వివరించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు, విద్యార్థులు, రైతులు కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవేమీ పట్టకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నారని చాంద్‌బాషా ఆరోపించారు. -
విఐపి రిపోర్టర్ - కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా