ఎమ్మెల్యే చాంద్‌కు చుక్కెదురు
ఎన్పీ కుంట : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు చుక్కెదురైంది. నీళ్ల కోసం మహిâýæలు ఆయనను నిలదీశారు. జనచైతన్య యాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పి.కొత్తపల్లి, పెడబల్లి పంచాయితీల్లో పర్యటించారు. ‘‘సోలార్‌హబ్‌లో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇప్పిస్తామన్నారు... ఇప్పుడు ప్రభుత్వంలోనే చేరారు కదా వెంటనే ఇప్పించాలని పి.కొత్తపల్లిలో మహిâýæలు నిలదీశారు.
ఆ తర్వాత పెడబల్లికి వెళ్తున్న ఎమ్మెల్యేకు మార్గమధ్యంలో గొల్లపల్లి గ్రామస్తులు రోడ్డుపై బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేను వెళ్లనీయకుండా రోడ్డుపై బైఠాయించారు. ‘మీరు వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు ఓట్లేసి గెలిపించామనీ, ఆ అక్కసుతో సర్పంచు భర్త రామాంజులు ఊరికి నీళ్లు రాకుండా చేస్తున్నాడు’ అని గ్రామస్తులు వాపోయారు. అలాగే గ్రామానికి రోడ్డు కూడా వేయించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి జేఈని పిలిపించి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.