
సాక్షి, అమరావతి : ఏపీ కాబినేట్ విస్తరణలో భాగంగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. తనతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రులుగా స్థానం కల్పించారని.. తన పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రివర్గంలో చేర్చుకునేదుకు గవర్నర్ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.
అసలు విషయం ముఖ్యమంత్రి, ఇతర పెద్దలకే తెలుసన్నారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు దొరకడం హర్షనీయమన్నారు. మైనారిటీ కోటాలో గత మంత్రివర్గ విస్తరణలో కూడా తన పేరు చర్చకు వచ్చిందని బాషా గుర్తు చేశారు.