Cabinate reshuffle
-
కొలువుదీరిన బొమ్మై కొత్త టీం.. యడ్డీ కుమారుడికి నిరాశ
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి.. చివరకు ఆయనకు మొండి చేయి ఎదురయ్యింది. కొత్త మంత్రలు జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. అలానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు భావించినప్పటికి.. చివరికి ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన 29 మంది వీరే.. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోవింద్ కరజోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్. అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, మురేగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, సీఎస్ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, ఎస్టీ సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజు, డాక్టర్ కె.సుధాకర్, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారయణ గౌడ, బీసీ నగేష్, వి.సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర్ పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బొమ్మై కేబినెట్లో ఎనిమిది మంది లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. -
రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకు ప్రాధాన్యం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 7న(బుధవారం) కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు సా.5:30 నుంచి 6 గంటల మధ్య కేబినెట్ విస్తరణ జరుగనుంది. తొలుత జూలై 7వ తేదీన కేబినెట్ పునర్వీవ్యవస్థీకరణ జరుగనున్నట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత జూలై 8వ తేదీన కేబినెట్ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కాగా, మళ్లీ ముందు అనుకున్న తేదీ ప్రకారం జూలై 7వ తేదీనే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు మొగ్గు చూపారు. ఈ కేబినెట్లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్సీపీ సింగ్, లల్లన్ సింగ్ (బిహార్), అప్నా దళ్ నేత అనుప్రియ పాటిల్, పంకజ్ చౌదరి(యూపీ), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్ కథేరియా (యూపీ), పశుపతి పారస్, రాహుల్ కశ్వన్, చంద్రప్రకాశ్ జోషి (రాజస్థాన్) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. -
మంగళవారం మంత్రివర్గ విస్తరణ
బెంగళూరు: అనుకున్న విధంగానే మంగళవారం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని.. మరో 2-3 గంటల్లో అమిత్ షా నుంచి మంత్రుల తుది జాబితా తనకు అందుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. మూడు వారాల క్రితం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి కూలిన తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని శాఖల్ని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి మూడు వారాలు గడుస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు కురుపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మరికొన్ని గంటల్లో అమిత్ షా నుంచి మంత్రుల తుది జాబితా అందుతుంది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం 10.30 నుంచి 11.30గంటల మధ్య ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్‌కి తెలియజేశాను. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను’ అని మీడియాకు వెల్లడించారు. 13 నుంచి 14 మంది మంత్రులు మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. -
చోటెవరికి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం కోసం జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని సీఎం నిర్ణయించడం, తొలిదశ విస్తరణలో ఆరు లేదా ఎనిమిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందన్న సమాచారంతో ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సామాజిక సమీకరణలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, చీఫ్ విప్‌లు, విప్ పదవులను దృష్టిలో పెట్టుకొని జాబితా రూపొందిస్తున్నారు. ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం 33 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుందనే చర్చ టీఆర్ఎస్లో జోరుగా సాగుతోంది. డిసెంబర్ 13న కొత్త ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్‌అలీ మాత్రమే ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ చెప్పినప్పటికీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటన, ప్రాజెక్టుల పనుల పరిశీలన, వివిధ శాఖలపై వరుస సమీక్షల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ఇప్పటివరకు వీలు కాలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం సైతం వాయిదా పడటం తెలిసిందే. విధేయులు, సమర్థులకే చోటు... రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 17 మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను కలిపితే మరో నాలుగు అవుతాయి. శాసనమండలి, శాసనసభలలో చీఫ్ విప్, విప్ పదవులు ఉన్నాయి. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అన్నింటినీ కలిపి 33 పదవులు ఉండేలా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. టీఆర్ఎస్లో ఆశావహులు సైతం ఎక్కువగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున రామగండంలో గెలిచిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థిగా వైరాలో గెలిచిన లావుడ్య రాములు నాయక్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. మరోవైపు ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే టీఆర్ఎస్కు విధేయులుగా ఉండటంతోపాటు సమర్థులైన వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో కంటే మెరుగైన మంత్రివర్గం ఉండేలా ఎమ్మెల్యేల జాబితాను రూపొందిస్తున్నారు. స్పీకర్‌తోనే అన్ని... అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఉంటారనేది స్పష్టత వస్తేనే మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనా రానుంది. గత అసెంబ్లీలో స్పీకర్‌గా వ్యవహరించిన ఎస్. మధుసూదనచారి ఈసారి ఓడిపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరిని స్పీకర్‌గా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ విధేయులు పేర్లను పరిశీలిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లలో ఒకరిని స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవిని గతంలోలాగే బీసీ వర్గాలకు కేటాయిస్తే మంత్రివర్గం కూర్పులో మార్పులు జరగనున్నాయి. తొలిదశ విస్తరణ పరిమితంగానే ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే స్పష్టత ఇచ్చినా అశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. -
సంక్రాంతి తర్వాతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశాల్లేవని తేలింది. కేబినెట్ విస్తరణకు తొందరేం లేదంటూ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంక్రాంతి పండుగ వరకు విస్తరణ ఉండదని తెలుస్తోంది. పీడదినాల్లో విస్తరణ వద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారని, సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ, శాసనసభ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక తదితర కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ కలిపి ఒకే మంత్రిత్వశాఖ పరిధిలోకి తేవాలని కూడా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించగా ఈ ప్రక్రియ ముగిశాక ఏ శాఖను ఎవరికి అప్పగించాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసకోనున్నారు. దీన్నిబట్టి ఈసారి మంత్రివర్గంలో మార్పులతోపాటు కొద్ది మందికే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందుకే సంక్రాంతి తర్వాత తొలి విడత మంత్రివర్గాన్ని విస్తరించాలని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం దిశగా కసరత్తు... మంత్రివర్గంలోకి తీసుకునే మంత్రుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశమున్నందున మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల అంశం తెరపైకి రానుంది. ఇందుకోసం న్యాయశాఖ అధికారులు గత కొంతకాలంగా కుస్తీలు పడుతున్నారు. గతంలోనూ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినప్పటికీ కోర్టు నుంచి చుక్కెదురు కావడంతో ఈసారి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. పార్లమెంటు సెక్రటరీలుగా ఎంత మందిని నియమించాలి? ఎవరిని నియమించాలి? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎవరిని ఎంపిక చేయాలి? లాంటి నిర్ణయాలన్నీ తీసుకున్న తర్వాత ఒకేసారి నియామకాలు జరపాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ప్రమాణం లాంఛనమే... శాసనసభ సమావేశాల నిర్వహణ కూడా సంక్రాంతి తర్వాతే అని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం ఇచ్చినప్పటి నుంచీ అధికారికంగా ఎమ్మెల్యేగా ఉంటారని చట్టాలు చెపుతున్నాయని, అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం లాంఛనప్రాయమేనని సీఎం కార్యాలయ వర్గాలంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన 53 రోజులకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారని, గత ఎన్నికలు ముగిశాక కూడా ప్రమాణస్వీకారానికి 29 రోజులు పట్టిందని గుర్తుచేస్తున్నాయి. అధికారిక హోదాలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉన్నారని, అయితే శాసనసభలో రాజ్యాంగపరమైన విధులు నిర్వహించేందుకు మాత్రమే ప్రమాణస్వీకారమని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాతే అసెంబ్లీని సమావేశపరచి, అన్ని అధికారిక కార్యక్రమాల లాంఛనాలను అప్పుడే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం. -
‘అసలు విషయం.. సీఎం, ఇతర పెద్దలకే తెలుసు’
సాక్షి, అమరావతి : ఏపీ కాబినేట్ విస్తరణలో భాగంగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. తనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రులుగా స్థానం కల్పించారని.. తన పట్ల మాత్రం పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో విభేదాల నేపథ్యంలో తనను మంత్రివర్గంలో చేర్చుకునేదుకు గవర్నర్ అభ్యంతరం తెలుపుతారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అసలు విషయం ముఖ్యమంత్రి, ఇతర పెద్దలకే తెలుసన్నారు. నాలుగున్నర సంవత్సరాల తరువాత మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు దొరకడం హర్షనీయమన్నారు. మైనారిటీ కోటాలో గత మంత్రివర్గ విస్తరణలో కూడా తన పేరు చర్చకు వచ్చిందని బాషా గుర్తు చేశారు. -
కొత్త రక్తం.. కొత్త రూపం!
► జవదేకర్‌కు కేబినెట్ హోదా.. వెంకయ్యకు సమాచారం ► మోదీ మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు ► ఐదుగురు సహాయమంత్రులపై వేటు.. కొత్తగా 19 మందికి చోటు ► 78కి పెరిగిన మంత్రివర్గం.. జవదేకర్‌కు మానవవనరులు అప్పగింత ► మానవవనరుల నుంచి స్మృతి ఇరానీ తొలగింపు.. జౌళిశాఖకు బదిలీ ► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.. వెంకయ్య నుంచి అనంత్‌కుమార్‌కు బదిలీ ► అరుణ్‌జైట్లీ నుంచి వెంకయ్యనాయుడుకు సమాచార, ప్రసారశాఖ ► న్యాయశాఖ నుంచి గణాంకాలు, పథకాల శాఖకు సదానందగౌడ బదిలీ ► రవిశంకర్‌ప్రసాద్‌కు న్యాయశాఖ.. బీరేంద్రసింగ్‌కు ఉక్కుశాఖ కేటాయింపు ► నరేంద్రసింగ్‌తోమర్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు శాఖలు సాక్షి, న్యూఢిల్లీ: భారీస్థాయి మార్పులు, చేర్పులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గానికి కొత్తరూపునిచ్చారు. ఐదుగురు సహాయమంత్రులను తొలగించి.. కొత్తగా 19 మందికి చోటు కల్పిస్తూ విస్తరించటంతో పాటు.. పలువురు మంత్రుల శాఖలనూ మార్చుతూ పునర్వ్యవస్థీకరించారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతిభవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరుగగా.. రాత్రికి మంత్రివర్గంలో పలు శాఖల మార్పులతో కేటాయింపులు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శాఖలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి. మానవవనరుల అభివృద్ధిశాఖను స్మృతి ఇరానీ నుంచి తొలగించారు. ఆ శాఖను ప్రకాశ్‌జావదేకర్‌కు తాజాగా కేబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకు అప్పగించారు. స్మృతిఇరానీని అంతగా ప్రాధాన్యం లేని జౌళిశాఖకు మార్చారు. ముఖ్యంగా.. హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోనూ, జేఎన్‌యూ వివాదంలోనూ స్మృతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను మానవవనరుల అభివృద్ధిశాఖ నుంచి తప్పించి తక్కువ ప్రాధాన్యం గల శాఖకు బదిలీ చేయటం వ్యూహాత్మక ఎత్తుగడేనా? లేకపోతే.. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ముఖచిత్రంగా ఆమెను వినియోగించుకునేందుకు బాధ్యతల బరువును తగ్గించారా? అన్న అంశాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఎం.వెంకయ్యనాయుడికి కేటాయించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా జైట్లీ వద్దే ఉంది. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్నారు. తాజా మార్పుల్లో ఆయన నుంచి పార్లమెంటరీ వ్యవహారాలను తప్పించి సమాచార ప్రసారశాఖను కేటాయించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అనంత్‌కుమార్‌కు అదనంగా కేటాయించారు. అనంత్ ప్రస్తుతం రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ► న్యాయశాఖను సదానందగౌడ నుంచి తప్పించి.. సమాచార సాంకేతికత(ఐటీ) శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు అప్పగించటం కీలక మార్పు. సదానందకు గణాంకాలు, పథకాల అమలు శాఖను కేటాయించారు. ► చౌదరి బీరేంద్రసింగ్‌కు ఉక్కు శాఖను కేటాయించి.. ఆయన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ శాఖలను నరేంద్రసింగ్ తోమర్‌కు కేటాయించారు. తోమర్ ఇప్పటివరకూ గనులు, ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. హా విద్యుత్, బొగ్గు, పునర్వినియోగిత ఇంధనశక్తి శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న పీయూష్‌గోయల్‌కు అదనంగా గనుల శాఖ ఇచ్చారు. హా రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్‌సిన్హాకు సమాచారశాఖను స్వతంత్ర సహాయమంత్రి హోదాలో అప్పగించారు. ► జౌళిశాఖ స్వతంత్ర సహాయమంత్రిగా ఉన్న సంతోష్‌కుమార్ గాంగ్వర్ను ఆర్థికశాఖకు బదిలీ చేశారు. హా ఆర్థికశాఖలో సహాయమంత్రిగా ఉన్న జయంత్‌సిన్హాను పౌరవిమానయానశాఖకు మార్చారు. ఇప్పటివరకూ ఆ శాఖలో ఉన్న మహేశ్‌శర్మను సంస్కృతి, పర్యాటక శాఖకు మార్చారు. హా అర్జున్‌రామ్‌మేఘ్వాల్‌ను ఆర్థికశాఖలో రెండో సహాయమంత్రిగా చేర్చారు. హా ఇక కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో.. విజయ్‌గోయల్‌కు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు స్వతంత్ర సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖను ఇంతకుముందు సర్బానంద సోనేవాల్ నిర్వహించేవారు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లిన విషయం తెలిసిందే. ► ఇక పర్యాటక శాఖకు జవదేకర్ స్థానంలో అనిల్‌మాధవ్ దవేను స్వతంత్ర సహాయమంత్రిగా నియమించారు. ► అప్నాదళ్ నేత అనుప్రియాపాటిల్‌తో పాటు, ఫగన్‌సింగ్ కులస్తేలకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖలో సహాయమంత్రులుగా చోటు కల్పించారు. ► డాక్టర్ ఎస్.ఆర్.భామ్రేను రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ► కేబినెట్ మంత్రుల్లో గడ్కరీ, ఉమాభారతి, అశోక్‌గజపతిరాజు, పారికర్, సురేష్‌ప్రభు, రాంవిలాస్‌పాశ్వాన్, కల్రాజ్మిశ్రా, మేనకా సంజయ్‌గాంధీ, నజ్మాహెప్తుల్లా, జె.పి.నడ్డా, అనంత్ గీతే, హర్‌సిమ్రత్‌కౌర్, జ్యుయల్ ఓరమ్, రాధామోహన్‌సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్ తదితరుల శాఖల్లో మార్పు లేదు. ఐదుగురు సహాయ మంత్రులపై వేటు... కేంద్రంలో 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. దాదాపు రెండేళ్ల తర్వాత చేపట్టిన రెండో మంత్రివర్గ విస్తరణతో పాటే.. కీలక మార్పులూ చేయటం విశేషం. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో త్వరలో జరుగున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. దళితులు, వెనుకబడిన వర్గాల వారిలో పార్టీని బలోపేతం చేసుకోవటం లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ విస్తరణ చేపట్టారు. ఇప్పటివరకు 64 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య తాజా విస్తరణతో 78కి పెరిగింది. ఒకవైపు మంత్రివర్గానికి కొత్త రక్తం ఎక్కిస్తూనే.. పలు శాఖల మార్పులతో కేబినెట్‌కు కొత్త రూపునూ ఇచ్చారు. ఇప్పటివరకు స్వతంత్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే పదోన్నతినిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. అలాగే ఐదుగురు సహాయమంత్రులు సన్వర్‌లాల్ జాట్ (జలవనరుల శాఖ), మోహన్‌భాయ్ కుందరియా (వ్యవసాయశాఖ), నిహాల్చంద్ (పంచాయతీరాజ్), మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్ (గిరిజన వ్యవహారాలు), ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా (మానవ వనరుల అభివృద్ధి)లపై వేటు వేశారు. వారి రాజీనామా లేఖలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం నాడే ఆమోదించారు. మంత్రుల శాఖల్లో తాజా మార్పులు ► ప్రకాశ్ జవదేకర్ - మానవ వనరుల శాఖ (కేబినెట్ హోదా) ► స్మృతి ఇరానీ - చేనేత, జౌళి శాఖ (మానవ వనరుల శాఖ మార్పు) ► రవిశంకర్ ప్రసాద్ - ఐటీ శాఖకు అదనంగా న్యాయ శాఖ ► సదానంద గౌడ - గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రి (న్యాయ శాఖ తొలగింపు) ► అనంత కుమార్ - ఎరువులు, రసాయనాల శాఖకు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాలు ► వెంకయ్య నాయుడు - పట్టణాభివృద్ధి శాఖకు అదనంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (పార్లమెంటరీ వ్యవహారాలు, గృహ నిర్మాణం తొలగింపు) ► పీయూశ్ గోయల్ - విద్యుత్, పునరుత్పత్తి విద్యుత్ శాఖకు అదనంగా గనులు ► చౌదరీ బీరేంద్ర సింగ్ - స్టీల్ (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం తొలగింపు) ► హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ - హోం శాఖ సహాయ మంత్రి (ఎరువులు, రసాయనాలు శాఖ తొలగింపు) ► సంతోష్ కుమార్ గంగ్వార్ - ఆర్థిక శాఖ సహాయ మంత్రి (చేనేత, జౌళి శాఖ తొలగింపు) ► మనోజ్ సిన్హా - రైల్వే సహాయ మంత్రి, కమ్యూనికేషన్స్ (అదనం) ► సంజీవ్ కుమార్ - జలవనరులు, నదుల అనుసంధానం (సహాయ మంత్రి) వ్యవసాయం (తొలగింపు) ► జయంత్ సిన్హా - పౌర విమానయాన (సహాయ మంత్రి) (ఆర్థిక సహాయ మంత్రి తొలగింపు) ► హరిభాయ్ చౌదరి - సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (సహాయ మంత్రి) (హోం శాఖ తొలగింపు) ► రావ్ ఇందర్జిత్ సింగ్ - ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన (సహాయ మంత్రి) (రక్షణ శాఖ తొలగింపు) ► నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుధ్య (సహాయ మంత్రి), (గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖ తొలగింపు) కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ► అనిల్ మాధవ్ దవే - అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులు (స్వతంత్ర) ► విజయ్ గోయల్ - క్రీడలు, యువజన సర్వీసులు (స్వతంత్ర) ► అర్జున్ రామ్ మేఘ్వాల్ - ఆర్థికర, కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► ఎస్ఎస్ అహ్లువాలియా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► ఫగన్ సింగ్ కులస్తే - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి) ► అనుప్రియ పటేల్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ (సహాయ మంత్రి) ► రాజన్ గోహెన్ - రైల్వే శాఖ (సహాయమంత్రి) ► ఎంజే అక్బర్ - విదేశీ వ్యవహారాలు (సహాయ మంత్రి) ► కృష్ణపాల్ - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి) ► రాందాస్ అఠావలే - సామాజిక న్యాయం, సాధికారత (సహాయ మంత్రి) ► జస్వంత్ సింహ బహదూర్ - గిరిజన వ్యవహారాలు ► పీపీ చౌదరి - న్యాయ, ఐటీ శాఖలు (సహాయ మంత్రి) ► డాక్టర్ సుభాష్ భామ్రే - రక్షణ (సహాయమంత్రి) ► సీఆర్ చౌదరి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ (సహాయ మంత్రి) ► అజయ్ తాంతా - చేనేత, జౌళి (సహాయ మంత్రి) ► మన్షుక్ మాండవీయ - రహదారులు, రవాణా, షిప్పింగ్, ఎరువులు-రసాయనాలు (సహాయ మంత్రి) ► పర్షోత్తమ్ రూపాలా - వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీ రాజ్ (సహాయ మంత్రి) ► డాక్టర్ మహేంద్రనాథ్ పాండే - మానవ వనరుల శాఖ (సహాయ మంత్రి) ► రమేశ్ చందప్ప జిగజినాగి - తాగునీరు, పారిశుద్ధ్యం వేటు వీరిపైనే ► సన్వర్‌లాల్ జాట్, మోహన్‌భాయ్ కుందరియా, నిహాల్చంద్, మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్, ప్రొఫెసర్ రామ్‌శంకర్ కతేరియా -
కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మంగళవారం మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్ ను విస్తరించింది. 19 మంది మంత్రులకు కొత్తగా పదవులను ఇచ్చిన ఎన్డీయే కూటమి, పలువురు మంత్రుల శాఖలను కూడా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 19 మంది మంత్రులలో గుజరాత్, రాజస్థాన్ ల నుంచి నలుగురి చొప్పున, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల నుంచి ముగ్గురి చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ల నుంచి ఒక్కొక్కరికి జాబితాలో స్థానం కల్పించారు. కొందరు కేంద్ర మంత్రులను కీలక శాఖల నుంచి సాధారణ శాఖలకు మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని చేనేత, జౌళిశాఖకు మంత్రిగా నియమించింది. ఆమె స్థానంలో ప్రకాశ్‌జవదేకర్‌ను నియమించారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖను అలాగే ఉంచి.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు. ఆ శాఖకు బదులు గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖను వెంకయ్యనాయుడుకు అదనంగా కేటాయించారు. మంత్రులు-శాఖలు వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖ స్మృతి ఇరానీ- చేనేత, జౌళీశాఖ ప్రకాష్ జయదేవకర్- మానవ వనరుల శాఖ అనంతకుమార్- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంజే అక్బర్- విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ సదానంద గౌడ- గణాంక శాఖ బీరేంద్ర సింగ్- గనుల శాఖ రాందాస్ అథవలే- సామాజిక న్యాయశాఖ ఇంద్రజిత్ సింగ్- పట్టణాభివృద్ధి హౌసింగ్ పట్టణ దారిద్య్ర నిర్మూలన అనిల్ మాధవ్ దవే- స్వతంత్రహోదాలో అటవీ పర్యావరణ శాఖ విజయ్ గోయల్- క్రీడా శాఖ జశ్వంత్ సిన్హా బాభోర్- గిరిజన వ్యవహారాల శాఖ జయంత్ సిన్హా- పౌర విమానయాన సహాయమంత్రి కృష్ణారాజ్- మహిళా శిశు సంక్షేమశాఖ అర్జున్ మేఘ్ వాల్- ఆర్ధికశాక సహాయమంత్రి అనుప్రియ పాటిల్ - ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి