
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు చంద్రబాబు మగళవారం నీటిని విడుదల చేశారు. అనంతరం చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ బాషాకు తీవ్ర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు బాషాను అవమానించారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్)
ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రసంగాన్ని కందికుంట వర్గీయులు అడ్డుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే మాట్లొద్దని నినాదాలు చేశారు. బాషా మాట్లాడుతున్నంతసేపు ఈలలు, కేకలతో అల్లరి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బాషా, కందికుంట వర్గాల బల ప్రదర్శనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ ఇరు వర్గాలవారు పోటాపోటీ నినాదాలు చేశారు.