kandikunta venkata prasad
-
కదిరి టీడీపీ అభ్యర్థి.. కోటిన్నర నగదు పట్టివేత
-
కబ్జాల కందికుంట
కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్ అలియాస్ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్ చేయించుకోండని ఖాజామోద్దీన్ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్ మనవడు అమీర్‌ఖాన్ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. -
కదిరి టీడీపీ ఇన్చార్జ్ ‘కందికుంట’ బరితెగింపు
కదిరి టౌన్: టీడీపీ నేతలు అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. కొద్దిరోజుల క్రితం కృష్ణా జిల్లా గన్నవరంలో సీఐపై టీడీపీ నేతల దాడిని మరువకముందే.. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోనూ ఒక సీఐపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ బరితెగించారు. తన అనుచరులతో కలిసి శనివారం రాత్రి ఏకంగా పట్టణ సీఐ మధు ఇంటిపై దాడికి తెగబడ్డారు. దౌర్జన్యాలు, భూ దందాలకు కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ పేరుగాంచారు. కదిరికి సీఐ మధు రాకతో కందికుంట అరాచకాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఆయనపై ఎలాగైనా దాడి చేయాలని కందికుంట కొన్నాళ్లుగా కుట్రపన్నుతున్నారు. ఇప్పటికే ఒకసారి దాడికి ప్రయత్నించారు. అయినా భయపడకుండా సీఐ విధులు నిర్వర్తిస్తుండడంతో ఓర్వలేని కందికుంట.. శనివారం రాత్రి తన అనుచరులతో కలిసి కదిరి ఎన్జీవో కాలనీలో ఉన్న సీఐ నివాసంపైన దాడికి తెగబడ్డారు. ‘రేయ్ సీఐ మధు ఎక్కడరా నువ్వు.. రా తేల్చుకుందాం’ అంటూ నానా దుర్భాషలాడారు. ఆ సమయంలో సీఐ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకుని వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పంపించేశారు. అక్కడితో ఆగని కందికుంట... మళ్లీ అనుచరులతో కలిసి సైదాపురం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. మీసాలు మెలేసి తొడకొట్టి హంగామా సృష్టించారు. దీంతో కొన్ని గంటలపాటు వాహనాలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో కొందరు వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలయ్యాయి. కందికుంటపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాక్షి, కదిరి (సత్యసాయి జిల్లా): కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌పై పట్టణ పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ కాలనీ చివరలో బుధవారం జరిగిన స్థల వివాదంలో కుటాగుళ్లకు చెందిన ఎరికల గంగులప్పను కులం పేరుతో దూషించినందుకు కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ మధు తెలిపారు. అలాగే గంగులప్ప ఆస్తిని కాజేయాలని చూసిన కందికుంటపై బాధితుడి ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్లు వివరించారు. భూ వివాదంలో అక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం, పెట్రోలు తెచ్చి తగలబెట్టాలని చూడటం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వారందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: (కదిరి టౌన్ సీఐ మధును చంపాలి) -
శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఎన్జీవో కాలనీలో ప్రజలు కొనుగోలు చేసిన భూమిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఆ భూమి తమదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చదవండి: (అనంతలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ) -
సత్యసాయి జిల్లా కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్
-
Sri Sathyasai District: కదిరి టీడీపీలో గ్యాంగ్‌వార్.. ప్రాణాపాయస్థితిలో..
కదిరి టౌన్: నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చాంద్ వర్గీయుడు శ్రీనివాసులు నాయుడిపై కందికుంట వర్గీయులు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. శ్రీనివాసులు నాయుడు ఈసారి తమ నేత చాంద్‌బాషాకే టికెట్ వస్తుందని సోషల్ మీడియాలో శుక్రవారం సాయంత్రం పోస్టు చేశాడు. దీన్ని కందికుంట వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకుని ఇంటి వద్దకు వెళ్లారు. దాడిలో గాయపడిన శ్రీనివాసులు నాయుడు అక్కడ లేకపోవడంతో పట్టణంలో గాలిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని చాంద్ లాడ్జీ వద్ద ఆటోలో తారసపడ్డాడు. దీంతో అతనిపై కందికుంట వర్గీయులైన టీడీపీ పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, సయ్యద్, ఇమ్రాన్, సోను ఫయాజ్, బాబు, మారుతి, రామాంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చాంద్ వర్గీయులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి రూరల్ సీఐ రియాజ్ అహమ్మద్ తెలిపారు. చదవండి: (అక్రమాలు.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ ఇండస్ట్రీపై కేసు..) -
కదిరి ఎమ్మెల్యేపై కందికుంట అనుచరుల అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కదిరి: ‘టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పలు కేసుల్లో నేరస్తుడు, 12 ఏళ్లు శిక్ష పడిన ఖైదీ. డీడీల దొంగ. ఆయన ఇకపై వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది’ అని కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కందికుంట అనుచరులు ఫేస్బుక్లో పెట్టిన అసభ్యకర పోస్టులపై గురువారం పట్టణ సీఐ సత్యబాబుకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కందికుంట అనుచరులు పోరెడ్డి ఓబుళరెడ్డి, మారుతీకుమార్, కళ్యాణ్‌చిన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అసభ్యకర పోస్టులను చదివి వినిపించారు. ఉగాండాలో బోరుబండి దగ్గర పైపులు మోసుకునే పోరెడ్డి ఓబుళరెడ్డికి పెద్దగా చదువు రాదని, మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైతే పట్టాభి చేత సీఎం వైఎస్ జగన్‌ను తిట్టించారో, అలాగే ఇక్కడ కూడా కందికుంట తన అనుచరుల ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. విచారణకు పిలిపిస్తే తప్పేంటి?.. ఉగాండాలో ఉన్న వ్యక్తి తనపై అసభ్యంగా ఫేస్బుక్లో పోస్టులు పెడితే విచారణలో భాగంగా పోలీసులు ఆయన తండ్రిని పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తే తప్పేంటని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. ఇదేదో పెద్ద నేరమైనట్లు ఎల్లో మీడియా తమ ఛానళ్లలో డిబేట్లు పెట్టి ప్రసారం చేశాయని, అదే మీడియా తనపై, తన కుటుంబ సభ్యులపై పెట్టిన అసభ్యకర పోస్టులపై ఎందుకు కథనాలు ప్రసారం చేయలేదో చెప్పాలన్నారు. ఇదే అవమానం మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తన ట్విట్టర్లో స్పందించడం సరికాదన్నారు. అలాగే కదిరి ‘సాక్షి’ విలేకరిపై అసభ్యకర పోస్టులు పెట్టినా.. జర్నలిస్టు యూనియన్ నాయకులు ఎందుకు స్పందించ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అరెస్ట్) డీఎస్పీకి భయమెందుకు?.. కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ నేరస్తుడైన కందికుంటకు ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నేరస్తులకు భయపడితే ఇక సామాన్యులు పరిస్థితి ఏం కావాలన్నారు. మహిళలను దూషిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వారిపై సాటి మహిళగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దామన్నారు. కాగా.. ఎమ్మెల్యే పీఏ అబూబాకర్ సైతం తనపై పెట్టిన అసభ్యకర పోస్టులపై మరో ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేతకు సుప్రీం కోర్టు షాక్
కదిరి: డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. కింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి.. తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లినప్పుడు ఆ కేసు విచారణలో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక నకిలీ డీడీలకు సంబంధించిన కేసు హైకోర్టులో పరిష్కారమయ్యే వరకు కందికుంట వెంకటప్రసాద్ సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయరని ఆయన తరఫు న్యాయవాది ఎస్.బసంత్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. ఇదీ కేసు.. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు డీడీలు తస్కరించి రూ.8.29 కోట్లు కాజేశారనే కేసులో సీబీఐ కోర్టు కందికుంటకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా వి«ధించింది. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఎస్బీఐ హుస్సేన్ ఆలం బ్రాంచ్‌లో కూడా నకిలీ డీడీలకు సంబంధించి మరో రూ.3.20 కోట్లు మోసగించారంటూ సీబీఐ కోర్టు కందికుంటకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కందికుంట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై కదిరికి చెందిన న్యాయవాది అబుబాకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా దీనిపై సీబీఐ ఎందుకు ఆక్షేపణ తెలియజేయలేదంటూ వారికి కూడా నోటీసు జారీ చేసింది. అప్పుడు సీబీఐ కూడా మరో పిటిషన్ దాఖలు చేసింది. రెండింటినీ ఒకటిగా స్వీకరిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం పైవిధంగా తీర్పు వెలువరించింది. -
కందికుంట.. అక్రమాల పుట్ట!
సాక్షి, కదిరి(అనంతపురం): తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దందాలు, భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి సహకారంతో బాధితులు ఒక్కొక్కరు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కందికుంటతో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కందికుంట హిందూపురం రోడ్లో వీవర్స్ కాలనీ సమీపంలోని సర్వే నెం.70/3లో ఉన్న 3.04 ఎకరాల తమ భూమిని కాజేసి బినామీ పేర్లమీద తప్పుడు పత్రాలు సృష్టించి పట్టాదారు పాసుపుస్తకం కూడా చేయించుకున్నాడన్న బాధితురాల ఫిర్యాదుపై స్పందించిన కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేసిన విషయం విదితమే. ఈ వార్త కదిరి ప్రాంతంలో సంచలనంగా మారింది. అలాగే కందికుంట అనుచరుడు, రౌడీషీటర్ అయిన గూడూరు హరినాథ్ అలియాస్ పాల హరి తమ భూమిని కబ్జాచేసి రాతి కప్పులు నాటాడని రిటైర్డ్ డీసీటీఓ నరసింహులు, ఆయన సతీమణి ఆకుల జయమ్మ ఫిర్యాదు చేస్తే కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్ రికార్డులను పరిశీలించి పాలహరి పొందిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేయడంతో పాటు బాధితురాలు తన ఆస్థిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆమెకు తగిన రక్షణ కల్పించాలని కూడా తహసీల్దార్ ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా కందికుంట అనుచరుడు, టీడీపీ పట్టణాధ్యక్షుడు అయిన అహ్మద్‌వలీ ఇంటి పట్టాల పేరుతో తమ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి తమను మోసగించారని భవన నిర్మాణ కార్మికులు రెండు రోజుల క్రితం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి సంతకం ఫోర్జరీ 2015 డిసెంబర్ 16న అనారోగ్యంతో మరణించిన తమ తండ్రి డా.ప్రభాకర్ నాయుడు అలియాస్ పాముల డాక్టర్ సంతకాన్ని కందికుంట అనుచరులు ఫోర్జరీ చేసి తమ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేశారని ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తండ్రి చనిపోక ముందే తమకు విక్రయ అగ్రిమెంట్ చేయించారని ఫోర్జరీ సంతకాలతో పత్రాలు పుట్టించి జిల్లా కోర్టులో వ్యాజ్యం(ఓఎస్ నెం.66/2016 ) వేశారని దీనిపై తాము కోర్టుకు వాస్తవాలు తెలియజేయడంతో పాటు వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరడంతో వారు ఆ కేసును ఉపసంహరించుకున్నారని ఆ ఫిర్యాదులో తెలియజేశారు. తర్వాత తనతో పాటు తన తల్లిని చంపుతామని బెదిరించి బలవంతంగా తమ దగ్గర సంతకాలు తీసుకొని విక్రయ పత్రాలు సిద్ధం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. తమను బెదిరించి తమ ఆస్థిని కాజేసిన కందికుంట అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో బాధితుడు పవన్ పోలీసులను కోరారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డా.ప్రభాకర్ నాయుడు అలియాస్ పాముల డాక్టర్ పొలం ఇదే.. చంపుతామని బెదిరించి.. తనతో పాటు తన తల్లిని చంపుతామని కందికుంట తన అనుచరుల ద్వారా బెదిరించి తమ భూమిని రిజిస్టర్ చేయించుకున్నారని పట్టణంలోని దేవాలయం వీధికి చెందిన దివంగత డా.ప్రభాకర్ నాయకుడు కుమారుడు పి.పవన్‌కుమార్ గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు(క్రైం.నెం225/2019) నమోదు చేశారు. కందికుంట అనుచరులైన టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూనివాండ్ల వసంత కుమారుడు గూనివాండ్ల చైతన్య, ఎన్పీ కుంట మండలం మేకలచెరువుకు చెందిన రమణ, గాండ్లపెంట మండలం కురుమామిడి ఆర్. శ్రీరాములు, నాగూరుపల్లి రమేష్‌బాబు, పట్టణంలోని సింహకోటకు చెందిన పి.శ్రీనివాసులు, అడపాలవీధికి చెందిన ఎం.రాజశేఖర్‌రెడ్డి, పులివెందులకు చెందిన లింగాల ప్రసాద్‌రెడ్డి, గాండ్లపెంట మండలానికి చెందిన గాజుల సుజన, ఈమె భర్త గాజుల ప్రతాప్‌తో పాటు బెంగుళూరుకు చెందిన దీపక్ కృష్ణమూర్తిలపై ఐపీసీ సెక్షన్ 467, 468, 471, 506(2)తో పాటు రెడ్‌విత్ ఐపీసీ 34 కింద కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేతపై హైకోర్టు సీరియస్..!
సాక్షి, కదిరి: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్మెన్లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ‘కందికుంట తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. ఆయనపై మొత్తం 22 కేసులున్నాయి. అందులో నకిలీ డీడీలకు సంబంధించి 2 కేసుల్లో శిక్ష కూడా పడింది. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు ఎలా ఇస్తారు?’ అంటూ హైకోర్టు మండిపడటంతో పాటు గన్మెన్లను తిరిగి నియమించాలని కోరడంలో అర్థం లేదని సీరియస్ అయ్యింది. ఈ తీర్పుతో కందికుంట వర్గం డీలా పడిపోగా, అదే పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఆనందంలో మునిగి పోయింది. దీన్ని చూసి అత్తార్ చాంద్‌బాషాకు కూడా గన్మెన్లను తొలగించాలని కందికుంట వర్గం డిమాండ్ చేస్తోంది. -
చంద్రబాబు ఎదుటే ఫిరాయింపు ఎమ్మెల్యేకు అవమానం
-
చంద్రబాబు ఎదుటే ఫిరాయింపు ఎమ్మెల్యేకు అవమానం
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షిగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు చంద్రబాబు మగళవారం నీటిని విడుదల చేశారు. అనంతరం చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ బాషాకు తీవ్ర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు బాషాను అవమానించారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్) ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రసంగాన్ని కందికుంట వర్గీయులు అడ్డుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే మాట్లొద్దని నినాదాలు చేశారు. బాషా మాట్లాడుతున్నంతసేపు ఈలలు, కేకలతో అల్లరి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బాషా, కందికుంట వర్గాల బల ప్రదర్శనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ ఇరు వర్గాలవారు పోటాపోటీ నినాదాలు చేశారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష
-
కందికుంట జెండా ఎగురవేయడంపై వివాదం
కదిరి: మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేయడం వివాదాస్పదమైంది. ‘అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సురయాభానుతో కలిసి ఆయన ఎగురవేయడమేమిటని సొంతపార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా నకిలీ డీడీల కుంభకోణం కేసులో ఆయన శిక్షపడిన ఖైదీ అనీ, అలాంటి వ్యక్తి చేత జాతీయ జెండాను ఎలా ఎగురవేసేందుకు అధికారులు అనుమతించారని సొంతపార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారంటున్నారు. మరోవైపు కందికుంట ఎగురవేసిన జాతీయ జెండా తిరగబడిందనేది మరో వివాదం.