
కందికుంట జెండా ఎగురవేయడంపై వివాదం
కదిరి: మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేయడం వివాదాస్పదమైంది. ‘అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సురయాభానుతో కలిసి ఆయన ఎగురవేయడమేమిటని సొంతపార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా నకిలీ డీడీల కుంభకోణం కేసులో ఆయన శిక్షపడిన ఖైదీ అనీ, అలాంటి వ్యక్తి చేత జాతీయ జెండాను ఎలా ఎగురవేసేందుకు అధికారులు అనుమతించారని సొంతపార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారంటున్నారు. మరోవైపు కందికుంట ఎగురవేసిన జాతీయ జెండా తిరగబడిందనేది మరో వివాదం.