సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఎన్జీవో కాలనీలో ప్రజలు కొనుగోలు చేసిన భూమిలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఆ భూమి తమదంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment