
సాక్షి, సత్యసాయి: జిల్లాలోని కదిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్రమణల తొలగింపు వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీఐ మధు ఇంటిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారు.
ఈ సందర్బంగా సీఐకి మద్దతుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లలో విచ్చక్షణా రహితంగా దాడులు చేశారు. కాగా, ఈ దాడులను కదిరి టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రేరేపించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటప్రసాద్.. పోలీసులను దుర్బాషలాడుతూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment