Girl Commits Suicide Due To TDP Leader Harassment In Sathya Sai District - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్‌ నిజాలు

Published Thu, Oct 6 2022 8:40 AM | Last Updated on Thu, Oct 6 2022 10:18 AM

Girl Commits Suicide Due To TDP Leader Harassment In Sathya Sai District - Sakshi

సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ  నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది.
చదవండి: డేటింగ్‌ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు

ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్‌ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement