girl commits suicide
-
అమ్మానాన్నలు అలా.. కూతురు ఇలా!
చిత్తూరు అర్బన్: భార్యాభర్తలు విడిపోయి, ఎవరిదారి వారు చూసుకున్నారు. కన్న కుమార్తెను గాలికి వదిలేశారు. దీంతో అమ్మమ్మ దగ్గర ఉన్న బాలిక ఇటీవల మేనత్త ఇంటికి వచ్చింది. అయితే కన్న తల్లి దగ్గరికి రానీయకపోవడంతో వేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరులోని మిట్టూరులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, చిత్తూరుకు చెందిన గీత(16) అమ్మానాన్నలు విడిపోవడంతో తమిళనాడులోని అమ్మమ్మ వద్దే చదువుకుంది. అయితే 10 వతరగతి ఫెయిలైంది. ఇటీవల చిత్తూరులోని తన మేనత్త ఇంటికి వచ్చింది. అమ్మ వద్దకు వెళ్లాలనుకున్నప్పటికీ ఆమె అనుమతించకపోవడంతో మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చీరతో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హిజ్రాల వేధింపులతో బాలిక ఆత్మహత్య
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): తీసుకున్న అప్పు తీర్చలేదని హిజ్రాలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. తంబి దాసు, పద్మ దంపతులు. నగరంలోని ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఇద్దరు కూతుళ్లతో కలసి డీమార్టు వెనుక, బావాజీపేట 2వ లైన్లో నివాసముంటున్నారు. పెద్ద కూతురు ల్యాబ్‌లో పనిచేస్తుండగా రెండవ కుమార్తె తంబి అనురాధ (18) నగరంలోని ఒక కళాశాలలో ఇంటర్ చదువుకుంటుంది. ఇటీవల ఇంటి అవసరాల మేరకు కుటుంబసభ్యులు తమకు తెలిసిన ఒక హిజ్రా వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో సోమవారం రాత్రి కొంతమంది హిజ్రాలు వారి ఇంటి ముందుకు చేరి అసభ్యకరంగా దూషణలకు దిగారు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన అనురాధ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 11.30 గంటల సమయంలో బాలిక అమ్మమ్మ కొమ్మూరి నరసమ్మ కూరగాయలు ఇచ్చేందుకు ఇంటికి వచ్చి చూడగా బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానికుల సాయంతో లోపలికి కిందికి దింపి ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా.. -
టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది. చదవండి: డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. -
బాలిక ఆత్మహత్యకు కారణమైన నిందితుడి రిమాండ్
గంగాధర(చొప్పదండి): ప్రేమ పేరుతో వేధించి ఓ బాలిక మృతికి కారకుడైన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. మండలంలోని కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి చెందిన తూడి రచన(17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. దీపావళి పండుగకు ఇంటికిరాగా, అదే గ్రామానికి చెందిన గడ్డం సరేశ్ అనే యువకుడు తనను ప్రేమించాలని లేకుంటే చంపుతానని బెదిరించారు. కొద్ది రోజులుగా కళాశాలకు కూడా వచ్చి వేధిస్తున్నాడని బాధితురాలు ఇంట్లో చెప్పింది. వేధింపులతో మనస్తాపంచెందిన రచన ఇంట్లోని బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రచన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. -
ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి ఆత్మహత్య
నల్గొండ జిల్లా: ఆలేరు మండంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఇదే మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన తుమ్మల స్వాతి (19) మంగళవారం ఇంట్లోని మరుగుదొడ్డిలో ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉద యం స్వాతి మరుగుదొడ్డికని వెళ్లింది. చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తుమ్మల శ్రీనివాసరెడ్డి–పద్మ మరుగుదొడ్డిలో చూశారు. ఆమె అందులో ఉరివేసుకుని కనిపించింది. కొన ఊపిరి ఉండడంతో మరుగుదొడ్డి తలుపులు తెరిచి కిందికి దించారు. వెంటనే చికిత్స నిమిత్తం వలిగొండ ఆస్పత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. మృతురాలి తండ్రి తుమ్మల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం లింగరాజుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫేస్బుక్లో పరిచయం.. మృతురాలు స్వాతికి మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్బుక్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. నరేష్ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్బుక్లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచిం చారు. అయినా నరేష్–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అంబోజు నరేష్ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఇటీవలనే హైకోర్టులోనూ ఫిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈనెల 18న స్వాతితో పాటు ఆమె తండ్రి శ్రీని వాస్‌రెడ్డి, కిడ్నాప్‌కు గురైన నరేష్‌లను కోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం స్వాతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. అసలు స్వాతిది హత్యా..లేక ఆత్మహత్య..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని చౌటుప్పల్ ఏసీపీ స్నేహి త, రామన్నపేట సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ పి.శివనాగప్రసాద్ పరిశీలించారు. -
కలలో ఆత్మహత్య.. నిజం చేసిన బాలిక
కేకే నగర్ (చెన్నై): ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన కలను నిజం చేస్తూ ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తండయారుపేట వినోద్ పాల్ నగర్‌కు చెందిన వేలు ప్రైవేటు సంస్థలో వాచ్మెన్. ఇతని కుమార్తె దుర్గ(16) ఇంటర్ చదువుతోంది. తరచూ తాను ఉరి వేసుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని చనిపోయినట్లు కలలు వచ్చేవని దుర్గ తల్లితో చెప్పేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని బాలిక ఆత్మాహుతికి పాల్పడింది. కేకలు విని అక్కడకు చేరుకున్న చుట్టుపక్కల వారు వెంటనే బాలికను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గ శనివారం ఉదయం మృతిచెందింది. -
యువకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
బల్మూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా): ప్రేమ పేరుతో ఓ యువకుడు ఫోన్లో వేధింపులకు పాల్పడి, బెదిరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లిలో చోటుచేసుకుంది. గట్టుతుమ్మెన్‌కు చెందిన లక్ష్మమ్మ, బాలీశ్వరయ్య దంపతులు స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. కాగా, బాలీశ్వయ్య 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మమ్మ తన కూతురు అంజలి (13) తో కలిసి పుట్టినిల్లు పోలిశెట్టిపల్లికి వచ్చింది. కూలి పనులు చేస్తూ ప్రస్తుతం కూతురును అచ్చంపేటలోని శారద విద్యాలయంలో ఎనిమిదోతరగతి చదివిస్తోంది. ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన బాలిక సాయంత్రం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఫోన్లో వేధింపులు.. అంజలిని కొన్ని నెలలుగా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బాల్‌రాజు అనే యువకుడు ఫోన్లో వేధించసాగాడు. ప్రేమించాలంటూ వచ్చే బెదిరింపుల కాల్స్ కారణంగానే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తహసీల్దార్ అంజిరెడ్డి, ఏఎస్ఐ జిలానీ ఎదుట మరణించే ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, వేధింపులకు గురిచేసిన యువకుడు నాగర్‌కర్నూల్ మండలం నల్లవల్లికి చెందిన తమ సమీప బంధువు ఇంటికి వచ్చి వెళ్లేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం సాయంత్రం అచ్చంపేట ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
నలుగురికి తెలిస్తే పరువు పోతుందని..
హర్యానా: ఓ యువకుడు తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆ విషయం బయటకు తెలిస్తే తలెత్తుకొని తిరగలేననే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ విషయం తెలిసి కుమార్తె కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. హర్యానాలోని జింద్ జిల్లాలోగల దారోడి అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ యువకుడు 11వ తరగతి చదువుతున్న అమ్మాయి వెంట రోజూ పడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన తండ్రితో చెప్పింది. ఇది విన్న ఆ తండ్రి నలుగురిలో ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని, సమాజం అవమానిస్తుందని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కూడా మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే, తండ్రి చనిపోగా.. ఆ అమ్మాయి మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. -
ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ...
ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తర్వాత కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓసీలకు 100 మార్కులు కటాఫ్ పెడితే, ఘజియాబాద్‌కు చెందిన కృతి త్రిపాఠి ఏకంగా 144 మార్కులు తెచ్చుకుంది. కాస్త కష్టపడితే ఆమెకు ఐఐటీలో సీటు గ్యారంటీగా వస్తుందని కూడా అందరూ చెప్పారు. కానీ, అసలు ఆమె కల వేరు.. తనకు ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనుకుంది. ఐఐటీలో బీటెక్ చేస్తే అంతరిక్ష శాస్త్రవేత్త కావడం అసాధ్యం. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా ఆమెను బీటెక్ చేయించాలనుకున్నారు. ఇంజినీరింగ్ చదవక తప్పదనే ఒత్తిడితో 17 ఏళ్ల కృతి త్రిపాఠి బలవన్మరణానికి పాల్పడింది. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఐదు పేజీల ఆత్మహత్య లేఖ రాసిన కృతి ఐదంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది. కృతి కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి కోటాకు తరలివచ్చింది. జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటా కోచింగ్ సెంటర్లకు ఫేమస్. ఇక్కడే ఆమె కోచింగ్ తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆమె తండ్రి కోటాలో ఉండగా, తల్లి ఘజియాబాద్‌లో ఉంది. ఉదయం 8.30 గంటల సమయంలో కృతి తండ్రి అన్షుమన్ జిమ్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆయనకు భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి అపార్టుమెంట్ పై నుంచి దూకేసినట్లు పొరుగువాళ్లు చెప్పారని, ఒకసారి వెళ్లి చూడమని ఆమె అన్నారు. వెంటనే అన్షుమన్ అక్కడకు వెళ్లగా.. విగతజీవిగా పడి ఉన్న తన కూతురు కనిపించింది. అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్స్‌లో ఆమెకు 144 మార్కులు వచ్చాయి. అయినా ఇంజినీరింగ్ ఇష్టం లేదంటూ కృతి ఆత్మహత్య చేసుకుంది. కోటా నుంచి మొత్తం 35వేలమంది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. అయితే, కుటుంబసభ్యుల అంచనాలు, ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. -
ఈవ్‌టీజింగ్ కారణంగా బాలిక ఆత్మహత్య
లక్నో: ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఈవ్ టీజింగ్ కారణంగా ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని లక్నోలో శనివారం వెలుగుచూసింది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనను పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా తనను పదేపదే ఈవ్ టీజింగ్ చేయడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ కూతురి ఫిర్యాదును నమోదు చేయెద్దంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'అతను లేని జీవితం నాకొద్దు'
రేగోడ్: చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఓ బంగారు తల్లి.. 'ఆ యువకుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ అఘాయిత్యానికి పాల్పడింది. ప్రేమ అని తను నమ్మిన ఆ భావనే చివరికి ఒంటికి నిప్పంటించుకునేలా పురికొల్పిన ఈ సంఘటన మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలోని రేగోడ్ మండలం మార్పల్లికి చెందిన 13 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడికి మధ్య చనువుపెరిగింది. మంచీచెడులు తెలుసుకోలేని వయసులో తనది ప్రేమేనని నమ్మిందా అమ్మాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ లో శివకుమార్ పాముకాటుకు బలయ్యాడు. అతను చనిపోయిన దగ్గర్నుంచి దిగాలుగా ఉంటోన్న బాలిక ఈనెల 16న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం చనిపోయిన ఆ బాలిక ఇచ్చిన మరణవాగ్మూలాన్ని రేగోడ్ ఎస్ఐ రాచకొండ రవీందర్ మీడియాకు తెలిపారు. 'శివకుమార్ ను తాను ప్రేమించానని, అతడు లేని జీవితం ఊహించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకున్నా'అని బాలిక చెప్పినట్లు ఎస్సై వెల్లడించారు. -
తల్లిదండ్రులను కలపాలనుకుంది.. కానీ..
-
తల్లిదండ్రులను కలపాలనుకుంది.. కానీ..
ప్రయత్నంలో విఫలమై బాలిక ఆత్మహత్య హైదరాబాద్: విడిపోయిన తల్లిదండ్రులను కలపాలని శతవిధాల ప్రయత్నించిన 9వ తరగతి బాలిక.. అందులో సఫలం కాలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన రాజు, జగదీశ్వరి భార్యాభర్తలు. రాజు పాన్‌డబ్బా నిర్వహిస్తుండగా, జగదీశ్వరి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తోంది. వీరు మనస్పర్థలతో విడిపోయి వేర్వేరు గా ఉంటున్నారు. వీరి కుమార్తె బి.హరిత(16) సంజీవపురంలో తల్లి వద్ద ఉంటూ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు హరిత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు లోపలికి వెళ్లగా హరిత అప్పటికే మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మరో యువతి.. ఇంకో యువకుడు.. ఆత్మహత్య!
కొన్నాళ్ల క్రితం సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున విశ్వవిద్యాలయం హాస్టల్లో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో దాదాపు అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనను ఓ వ్యక్తి పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తుండటంతో.. ఆ అవమానాన్ని తట్టుకోలేక 18 ఏళ్ల అమ్మాయి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది. పచోరా పట్టణంలోని ఓ కాలేజిలో ఆ అమ్మాయి చదువుతోంది. శరద్ పాటిల్ (25) అనే వ్యక్తి ఆమెను పదే పదే వెంబడిస్తూ వేధించేవాడు. ఎంత చెప్పినా వదలకుండా.. అతడు ఈవ్ టీజింగ్ చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆగస్టు 17వ తేదీన ఆమె ఎలుకలను చంపేందుకు వాడే మందు తినేసి ఆత్మహత్య చేసుకుంది. శరద్ పాటిల్‌ను పోలీసులు అదేరోజు అరెస్టు చేశారు. ఆమె ఎక్కడికి వెళ్లినా అతడు వెంటపడేవాడని తెలిపారు. -
నా చావుకు వాడే కారణం..
-
ప్రేమ విషాదాంతం
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని.. బావిలో దూకి బాలిక ఆత్మహత్య స్నేహితుడి ఆత్మహత్యాయత్నం తెలిసీతెలియని వయసు వారిది. ఇద్దరిదీ ఒకే కాలనీ. ఒకరు తొమ్మిదో తరగతి.. మరొకరు ఇంటర్మీడియెట్ సెకండియర్. వారి మధ్య ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా మారింది. ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లికి అతడు నిరాకరించడంతో బాలిక మనస్తాపం చెందింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదని క్షణికావేశానికి లోనై బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలిక అదృశ్యమైనట్లు తెలిసిన సదరు ప్రేమికుడు క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నార్నూర్ మండలం ఇందిరానగర్‌లో జరిగిన ఈ సంఘటన వారిద్దరి కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నార్నూర్, న్యూస్‌లైన్ : మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన చెన్నే శ్యామల(14), అదే కాలనీకి చెందిన గవ్వాలే రాజేశ్వర్ (19) ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. శ్యామల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రాజేశ్వర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతూనే ప్రైవేటు వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం శ్యామల అమ్మ రాధ వ్యవసాయ పనులకు, నాన్న లింగయ్య సొంతూరు లక్సెట్టిపేటకు వెళ్లారు. ఈ సమయంలో శ్యామల ఇంటికి రాజేశ్వర్ వచ్చాడు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. తనకు వేరే అమ్మాయితో సంబంధం కుదిరిందని, తాను పెళ్లి చేసుకోనని రాజేశ్వర్ పేర్కొనగా కచ్చితంగా తననే చేసుకోవాలని శ్యామల పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని శ్యామల తమ్ముడు తెలిపాడు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగదని మనస్తాపం చెందిన శ్యామల బహిర్భూమికని వెళ్లి ఇంటికి చేరలేదు. సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కూతురు కనిపించకపోవడంతో వెతకసాగారు. శ్యామల అదృశ్యమైనట్లు తెలిసిన రాజేశ్వర్ రాత్రి ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో వ్యవసాయ బావి వద్ద చున్నీ, చెప్పులు ఉండడంతో కుటుంబ సభ్యులు మోటార్ సాయంతో నీటిని తోడించగా శ్యామల మృతదేహం తేలింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు రాజేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కుటుంబాల్లో విషాదం.. రాధ, లింగయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా శ్యామల నాల్గో కుమార్తె. ఆమె మృతితో కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు రాంచందర్, అంజనాబాయి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజేశ్వర్. తల్లి వద్ద ఉంటున్న అతడు ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో అంజనాబాయి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ధారం సురేశ్ పేర్కొన్నారు. -
యువతిపై అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య
అత్యాచారానికి గురి కావడంతో, అవమాన భారం తట్టుకోలేక ఓ యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా ప్రాంతంలో గల గౌరీబజార్ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయి గురువారం రాత్రి ఏదో పని మీద బయటకు వెళ్లినప్పుడు ముబీన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయటకు వెళ్లగా, ఆ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.