నలుగురికి తెలిస్తే పరువు పోతుందని.. | Father of sexually harassed girl commits suicide, girl sets herself ablaze | Sakshi
Sakshi News home page

నలుగురికి తెలిస్తే పరువు పోతుందని..

Published Wed, Aug 10 2016 4:41 PM | Last Updated on Thu, Aug 16 2018 4:31 PM

Father of sexually harassed girl commits suicide, girl sets herself ablaze

హర్యానా: ఓ యువకుడు తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆ విషయం బయటకు తెలిస్తే తలెత్తుకొని తిరగలేననే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ విషయం తెలిసి కుమార్తె కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. హర్యానాలోని జింద్ జిల్లాలోగల దారోడి అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ యువకుడు 11వ తరగతి చదువుతున్న అమ్మాయి వెంట రోజూ పడుతున్నాడు.

పెళ్లి చేసుకుంటానని చెబుతూ లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన తండ్రితో చెప్పింది. ఇది విన్న ఆ తండ్రి నలుగురిలో ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని, సమాజం అవమానిస్తుందని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కూడా మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే, తండ్రి చనిపోగా.. ఆ అమ్మాయి మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement