
యువతిపై అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య
అత్యాచారానికి గురి కావడంతో, అవమాన భారం తట్టుకోలేక ఓ యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియా ప్రాంతంలో గల గౌరీబజార్ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయి గురువారం రాత్రి ఏదో పని మీద బయటకు వెళ్లినప్పుడు ముబీన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయటకు వెళ్లగా, ఆ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.