'అతను లేని జీవితం నాకొద్దు' | girl commits suicide after her lover dies in a snakebite in medak district | Sakshi
Sakshi News home page

'అతను లేని జీవితం నాకొద్దు'

Published Mon, Jan 18 2016 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

girl commits suicide after her lover dies in a snakebite in medak district

రేగోడ్: చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఓ బంగారు తల్లి.. 'ఆ యువకుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ అఘాయిత్యానికి పాల్పడింది. ప్రేమ అని తను నమ్మిన ఆ భావనే చివరికి ఒంటికి నిప్పంటించుకునేలా పురికొల్పిన ఈ సంఘటన మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైంది.

జిల్లాలోని రేగోడ్ మండలం మార్పల్లికి చెందిన 13 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడికి మధ్య చనువుపెరిగింది. మంచీచెడులు తెలుసుకోలేని వయసులో తనది ప్రేమేనని నమ్మిందా అమ్మాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ లో శివకుమార్ పాముకాటుకు బలయ్యాడు. అతను చనిపోయిన దగ్గర్నుంచి దిగాలుగా ఉంటోన్న బాలిక ఈనెల 16న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

చికిత్సపొందుతూ సోమవారం చనిపోయిన ఆ బాలిక ఇచ్చిన మరణవాగ్మూలాన్ని రేగోడ్ ఎస్ఐ రాచకొండ రవీందర్ మీడియాకు తెలిపారు. 'శివకుమార్ ను తాను ప్రేమించానని, అతడు లేని జీవితం ఊహించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకున్నా'అని బాలిక చెప్పినట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement