గంగాధర(చొప్పదండి): ప్రేమ పేరుతో వేధించి ఓ బాలిక మృతికి కారకుడైన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. మండలంలోని కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి చెందిన తూడి రచన(17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. దీపావళి పండుగకు ఇంటికిరాగా, అదే గ్రామానికి చెందిన గడ్డం సరేశ్ అనే యువకుడు తనను ప్రేమించాలని లేకుంటే చంపుతానని బెదిరించారు.
కొద్ది రోజులుగా కళాశాలకు కూడా వచ్చి వేధిస్తున్నాడని బాధితురాలు ఇంట్లో చెప్పింది. వేధింపులతో మనస్తాపంచెందిన రచన ఇంట్లోని బాత్‌రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రచన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment