ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి ఆత్మహత్య | Girl Commits Suicide in Nalgonda District | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి ఆత్మహత్య

Published Wed, May 17 2017 3:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి ఆత్మహత్య - Sakshi

ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయి ఆత్మహత్య

నల్గొండ జిల్లా: ఆలేరు మండంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఇదే మండలం లింగరాజుపల్లి గ్రామానికి  చెందిన తుమ్మల స్వాతి (19) మంగళవారం ఇంట్లోని మరుగుదొడ్డిలో ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉద యం స్వాతి మరుగుదొడ్డికని వెళ్లింది. చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తుమ్మల శ్రీనివాసరెడ్డి–పద్మ  మరుగుదొడ్డిలో చూశారు.

 ఆమె అందులో ఉరివేసుకుని కనిపించింది. కొన ఊపిరి ఉండడంతో మరుగుదొడ్డి తలుపులు తెరిచి కిందికి దించారు. వెంటనే చికిత్స నిమిత్తం వలిగొండ ఆస్పత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. మృతురాలి తండ్రి తుమ్మల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం లింగరాజుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఫేస్‌బుక్‌లో పరిచయం..
మృతురాలు స్వాతికి మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. నరేష్‌ తల్లిదండ్రులు ముంబై లో ఉంటున్నారు. నరేష్‌ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు.

 మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచిం చారు. అయినా నరేష్‌–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అంబోజు నరేష్‌ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్‌ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఇటీవలనే హైకోర్టులోనూ ఫిటిషన్‌ దాఖలు చేశాడు.

 దీంతో ఈనెల 18న స్వాతితో పాటు ఆమె తండ్రి శ్రీని వాస్‌రెడ్డి, కిడ్నాప్‌కు గురైన నరేష్‌లను కోర్టులో హాజరు పర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం స్వాతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. అసలు స్వాతిది హత్యా..లేక ఆత్మహత్య..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని చౌటుప్పల్‌ ఏసీపీ స్నేహి త, రామన్నపేట సీఐ ఎన్‌.శ్రీనివాస్, ఎస్‌ఐ పి.శివనాగప్రసాద్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement