ప్రేమ పెళ్లి: వరుడి కుటుంబంపై.. | Love Marriage Girls Family Attack On Boys Family In Nalgonda | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి: వరుడి కుటుంబంపై..

Published Sat, Jun 13 2020 2:35 PM | Last Updated on Sat, Jun 13 2020 3:23 PM

Love Marriage Girls Family Attack On Boys Family In Nalgonda - Sakshi

గాయాలపాలైన వరుడి తల్లి, ఇన్‌సెట్‌లో పెళ్లి ఫొటో

సాక్షి, నల్గొండ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి కుటుంబీకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన మాడుగులపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చింతగూడేం గ్రామానికి చెందిన ఓ యువకుడు, యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులక్రితం అమ్మాయి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా వివాహం చేసుకున్నారు. దీంతో యువకుడి కుటుంబసభ్యులపై అమ్మాయి తరపువారు దాడి చేశారు. ( ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి షాక్‌ తిన్నాడు!)

కర్రలు, రాళ్లు, రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో యువకుడి తల్లి రెండు చేతులు విరగటంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలపాలైన యువకుడి కుటుంబమంతా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు మాడుగుల పల్లి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ( దివ్య చుట్టూ రక్కసి మూక! )


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement