ఉద్యోగం రావడంతో పెండ్లికినిరాకరించిన ప్రియుడు | Boy Friend Cheat Handicapped Lover | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా

Published Mon, Apr 16 2018 1:10 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

Boy Friend Cheat Handicapped Lover - Sakshi

ధర్నా చేస్తున్న ప్రేమలత, గ్రామస్తులు

నల్లగొండ క్రైం : ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రియుడి ఇంటి ఎదుట దివ్యాంగురాలైన యువతి ఆదివారం ధర్నాకు దిగింది. వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని మెళ్లదుప్పలపల్లికి చెందిన దివ్యాంగ యువతి పాలడుగు ప్రేమలత అదే గ్రామానికి చెందిన పగడాల రమేష్‌ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి దివ్యాంగురాలు కావడంతో త్వరగా ఉద్యోగం వస్తుందని భావించిన రమేష్‌ ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఆటంకం ఉండదని భావించి.. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రేమలత గర్భవతి అయ్యింది. ప్రేమలత కంటే ముందే రమేష్‌కు అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఆరు నెలలుగా నకిరేకల్‌ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రేమలత రమేష్‌ను నిలదీసింది. నిన్నే విహహం చేసుకుంటానని నమ్మబలికి.. గర్భంతో ఉన్న ప్రేమలతకు టాబ్లెట్‌లు ఇచ్చి గర్భస్త్రావం చేయించాడు.

ప్రస్తుతం వారం రోజులుగా ప్రేమలతతో రమేష్‌ సరిగా మాట్లాడకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లిన ప్రేమలత తిరిగి గ్రామానికి చేరుకుంది. అసలు ఏం జరిగిందని.. వాకబు చేయగా.. రమేష్‌ పెళ్లిసంబంధం విషయం తెలిసింది. దీంతో ప్రమలత జరిగిన విషయం పెద్దమనుషులకు చెప్పింది. గ్రామస్తులంతా ఆమెకు అండగా నిలిచారు. ప్రియుడి ఇంటిముందు టెంట్‌వేసి ధర్నాకు దిగారు. యువతి తల్లి పెద్దులమ్మతో కట్నం, కానుకల విషయమై మాట్లాడారు. రూ.15లక్షల విలువైన ఎకరం భూమితో పాటు మరో 4తులాల బంగారం పెడతామని గ్రామపెద్దలు యువతి తరుపున హామీ ఇచ్చినా అందుకు రమేష్‌ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రస్తుతం రమేష్‌ పరారీలో ఉన్నాడు. ఈ విషయమై గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతి తల్లి పెద్దులమ్మ తన కూతురికు న్యాయం చేయాలని కోరుతోంది. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ రాములు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీచ్చినప్పటికీ యువతీతో పాటు గ్రామస్తులు ఆందోళన విరమించేందుకు నిరాకరించారు. ఫిర్యాదు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రేమలత ఒప్పుకోలేదు. తనతో మూడేళ్లపాటు కలసిఉన్నాడని, గర్భస్త్రావానికి సంబంధించిన వైద్యుల చిట్టిని పోలీసులకు చూపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement