![Police Arrested Four Members For Miryalaguda Honour killing Case - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/15/maruthi-rao.jpg.webp?itok=w5YnfYpo)
ప్రణయ్, అమృత, నిందితుడు మారుతీరావు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు అమ్మాయి తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్‌లతోపాటు ఇద్దరు సుఫారీ కిల్లర్‌లను శనివారం నగరంలోని కొత్తపేటలో అదుపులోకి తీసుకున్నారు. అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్ అనే వ్యక్తి మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. (చదవండి: ప్లీజ్.. ప్రణయ్ దగ్గరికి తీసుకువెళ్లండి)
ప్రణయ్‌ను చంపించినందుకు తనకేం బాధలేదని అమృత తండ్రి మారుతీరావు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ‘తన కూతురిపై ప్రేమతో ప్రణయ్‌ను హత్యచేయించా. కూతురికన్నా సోసైటిలో తన పరువే ఎక్కువ అనుకున్నా. 9వ తరగతిలోనే ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం తెలుసు. అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చా. ఎన్నిసార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు. దీంతోనే ప్రణయ్‌ను హత్యచేసేందుకు రూ.10 లక్షల సుఫారీ ఇచ్చాను. తొలుత రూ. 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాను. ప్రణయ్ కోసం సుఫారీ గ్యాంగ్ రెండు నెలలుగా రెక్కీ నిర్వహించింది. తన కూతురికి ఎలాంటి హానీ తలపెట్టొద్దని వారికి సూచించాను. జైలుకు వెళ్లడానికి సిద్దపడే ఈ ప్లాన్ వేసాను.’ అని మారుతీరావు పోలీసు విచారణలో తెలిపాడు.
సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ సరిహద్దులో ఉన్న జిల్లాకి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. గర్భవతి అయిన అమృతకు అబార్షన్ చేయాలని మారుతీరావు డాక్టర్ జ్యోతిని కోరినట్లు తెలుస్తోంది. అబార్షన్ చేస్తే ఎన్నిలక్షలైనా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు కూడా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment