
ఈవ్‌టీజింగ్ కారణంగా బాలిక ఆత్మహత్య
లక్నో: ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఈవ్ టీజింగ్ కారణంగా ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని లక్నోలో శనివారం వెలుగుచూసింది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనను పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అయినా తనను పదేపదే ఈవ్ టీజింగ్ చేయడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె బలవర్మణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ కూతురి ఫిర్యాదును నమోదు చేయెద్దంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.