సాక్షి, శ్రీసత్యసాయి: ఓవైపు ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. వైఫల్యం గురించి చర్చ నడుస్తున్న వేళ.. మరోవైపు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది.
కదిరిలో రైలు ప్రమాదం తప్పింది. కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యధేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. అటు ఇటు వాహనాలు నిలిపివేశారు. గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును ఆపేశాడు ట్రైన్ పైలట్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment