railway gate incident
-
కదిరి వద్ద తప్పిన రైలు ప్రమాదం
సాక్షి, శ్రీసత్యసాయి: ఓవైపు ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.. వైఫల్యం గురించి చర్చ నడుస్తున్న వేళ.. మరోవైపు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. కదిరిలో రైలు ప్రమాదం తప్పింది. కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వాహనాలు యధేచ్ఛగా అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. అటు ఇటు వాహనాలు నిలిపివేశారు. గేటు వేయకపోవడాన్ని గమనించి రైలును ఆపేశాడు ట్రైన్ పైలట్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రైల్వే గేటును ఢీకొని యువకుడి మృతి
అనంతపురం న్యూసిటీ : రైల్వే గేటును ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐదో రోడ్డుకు చెందిన భరత్‌కుమార్ (20) శనివారం వేకువజామున 2.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంలో వెళ్తూ రామచంద్రనగర్ రైల్వేగేటును ఢీకొన్నాడు. తలకు తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు సర్వజనాస్పత్రికి తరలించారు. ఉదయం భరత్ ఆరోగ్యం బాగుందని తండ్రి చంద్రశేఖర్ ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం తలనొప్పి వస్తోందంటూ తిరిగి భరత్‌కుమార్ చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.