అనంతపురం న్యూసిటీ : రైల్వే గేటును ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐదో రోడ్డుకు చెందిన భరత్‌కుమార్ (20) శనివారం వేకువజామున 2.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంలో వెళ్తూ రామచంద్రనగర్ రైల్వేగేటును ఢీకొన్నాడు. తలకు తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు సర్వజనాస్పత్రికి తరలించారు. ఉదయం భరత్ ఆరోగ్యం బాగుందని తండ్రి చంద్రశేఖర్ ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం తలనొప్పి వస్తోందంటూ తిరిగి భరత్‌కుమార్ చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.