
సాక్షి, కదిరి (సత్యసాయి జిల్లా): కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌పై పట్టణ పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ కాలనీ చివరలో బుధవారం జరిగిన స్థల వివాదంలో కుటాగుళ్లకు చెందిన ఎరికల గంగులప్పను కులం పేరుతో దూషించినందుకు కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ మధు తెలిపారు.
అలాగే గంగులప్ప ఆస్తిని కాజేయాలని చూసిన కందికుంటపై బాధితుడి ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్లు వివరించారు. భూ వివాదంలో అక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం, పెట్రోలు తెచ్చి తగలబెట్టాలని చూడటం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వారందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
చదవండి: (కదిరి టౌన్ సీఐ మధును చంపాలి)
Comments
Please login to add a commentAdd a comment