
తలుపుల: అనంతపురం జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్‌బాషాకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా తలుపుల మండలం నూతనకాల్వ పంచాయతీలో పర్యటించిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాను ప్రజలు ‘ఏపార్టీ తరఫున వచ్చావయ్యా..’ అంటూ నిలదీశారు. గతంలో గ్రామానికి వచ్చినప్పుడు తనకు మంచి ఆదరణ లభించిందని, ఇప్పుడేమైందంటూ స్థానికులను ఆయన ప్రశ్నించడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీలో ఉండడం వల్ల ఓట్లేసి గెలిపించుకున్నామని, ఇప్పుడు ఏ పార్టీ తరఫున ఊళ్లో అడుగుపెట్టారంటూ ప్రశ్నించారు. ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక మౌనంగా వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో దిగువ బైగారిపలిలోనూ ఆయనకు ప్రజా వ్యతిరేకత ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment