అనంతపురం సెంట్రల్ : సుభాష్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన చాంద్‌బాషా శుక్రవారం ఆటోలో టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి వైపుకు వస్తుండగా మార్గమధ్యలో ఆ బైక్ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చాంద్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.