Injures
-
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
బైరాగిగూడలో మరోసారి బుల్లెట్ కలకలం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి బైరాగిగూడ విద్యానగర్ కాలనీలో మంగళవారం తుపాకీ తూటా కలకలం రేపింది. పద్మ అనే మహిళ కాలును తాకుతూ వెళ్లింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. బాధితురాలు పద్మ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పద్మ తమ ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా కాలుకు అకస్మాత్తుగా ఏదో వస్తువు తగిలినట్లయ్యింది. కాలును గీసుకుని వెళ్లి రక్త్రస్తావమైంది. ఆ ప్రాంతంలో వెతకగా బుల్లెట్ కనిపించింది. కాలికి కాకుండా శరీరం పైభాగంలో అది తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బుల్లెట్‌ను స్వా«దీనం చేసుకుని బాధితురాలిని గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆర్మీ బుల్లెట్‌గా గుర్తింపు.. గంధంగూడకు ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీస్ ఫైరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇటీవల ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండటంతో బుల్లెట్లు చుట్టు పక్కల ఉన్న జవావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంధంగూడలో మహిళకు తగిలిన బుల్లెట్ ఆరీ్మదిగా గుర్తించామని, వారికి ప్రజలకు హాని కలిగే పరిస్థితులు వివరిస్తూ నోటీసు పంపుతామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీంతో ఆదారాలను సేకిరించామని, తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
గనిలో అగ్ని ప్రమాదం
లండన్: కజఖిస్తాన్లోని కొస్టెంకో బొగ్గు గనిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 32 మంది కార్మికులు చనిపోగా మరో 14 మంది గల్లంతయ్యారు. లగ్జెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ విషయం తెలిపింది. శనివారం ప్రమాద సమయంలో గనిలో 252 మంది కారి్మకులు పనిచేస్తున్నారని వివరించింది. మీథేన్ గ్యాస్ వెలువడటం వల్లే గనిలో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్. ఈ సంస్థకు అనుబంధంగా కజఖిస్తాన్లో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ పనిచేస్తుంది. ఘోర ప్రమాదం నేపథ్యంలో కజఖ్ ప్రభుత్వం ..దేశంలో ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఆధ్వర్యంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు, బొగ్గు, ఇనుప ఖనిజం గనులను జాతీయం చేసింది. -
ఐపీఎల్ నుంచి ఇషాంత్ శర్మ అవుట్
గాయం కారణంగా మరో ప్లేయర్ ఐపీఎల్ టి20 టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే మిచెల్ మార్‡్ష, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా తప్పుకోగా... తాజాగా వీరి సరసన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్, భారత ఆటగాడు ఇషాంత్ శర్మ చేరాడు. పక్కటెముకల్లో గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు ఇషాంత్ అందుబాటులో ఉండటంలేదని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడగా... 32 ఏళ్ల ఇషాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. ఇషాంత్ తన 4 ఓవర్ల కోటా వేసి 26 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేదు. కెరీర్లో 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ సకాలంలో కోలుకుంటే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. -
నాగర్‌కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
లోయలో అంబులెన్స్ బోల్తా
కొయ్యూరు(పాడేరు): ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ అంబులెన్స్ బోల్తా పడింది. సుమారు 30 అడుగుల లోయలోకి వెళ్లిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం సంతలో వైద్య శిబిరం నిర్వహించేందుకు యూ.చీడిపాలెం పీహెచ్సీ వైద్యాధికారిగా కొత్తగా బాధ్యతలు జగదీశ్వరరావు, దారకొండ పీహెచ్సీ వైద్యధికారి సాహితి, హెల్త్ సూపర్వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్లు బి.రామకృష్ణ, కుశరాజు, ఫార్మసిస్టు గురువారం యూ. చీడిపాలెం నుంచి అంబులెన్స్‌లో పోతవరం వెళ్లారు. అక్కడ వైద్యశిబిరం ముగిసిన తరువాత ఎం.భీమవరం నుంచి వై.రామవరానికి రాత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి యూ.చీడిపాలెంలో పీహెచ్‌సీకి వస్తుండగా చవిటి దిబ్బల సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో అదుపు లోయలోకి అంబులెన్స్ బోల్తాపడింది. అదృష్టవశాత్తు అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే తేరుకున్న వైద్యుడు జగదీశ్వరరావు దుచ్చర్తి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.తరువాత మరో వాహనంలో అందరిని యూ.చీడిపాలెం ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం వరకు అక్కడ చికిత్స పొందారు. -
విజయనగరం పట్టణంలో కాల్పులు కలకలం
-
విజయనగరంలో కాల్పులు
విజయనగరం జిల్లా: విజయనగరం పట్టణంలో కాల్పులు కలకలం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య వివాదం చోటేచేసుకోవడంతో కాల్పులకు దారి తీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజుపై పాత నేరస్తుడు బొత్స మోహన్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తేలింది. గాయపడిన అప్పల రాజును విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వన్డే సిరీస్ ముందు దక్షిణాఫ్రికాకు షాక్
జోహన్నెస్‌బర్గ్: వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దూరమయ్యారు. భారత్‌తో జరిగిన మూడో టెస్టులో డివిలియర్స్ చేతి వేలికి గాయమైంది. ఈ గాయం మానడానికి మరో రెండు వారాల సమయం పట్టవచ్చునని డాక్టర్లు తేల్చడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డివిలియర్స్‌కు విశ్రాంతినిచ్చింది. డివిలియర్స్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయడం లేదని బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 10న జరగబోయే పింక్ వన్డే(నాలుగో వన్డే) సమయానికి డివిలియర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆరు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఫిబ్రవరి 1న కింగ్స్‌మీడ్ మైదానంలో జరుగనుంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అనంతపురం సెంట్రల్ : సుభాష్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన చాంద్‌బాషా శుక్రవారం ఆటోలో టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి వైపుకు వస్తుండగా మార్గమధ్యలో ఆ బైక్ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చాంద్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఆరెపల్లిలో ఆటోబోల్తా..
నలుగురికి గాయాలు తప్పిన పెనుప్రమాదం జైపూర్ : మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం అదుపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లికి చెందిన ఆటో ఆరుగురు వ్యక్తులతో భీమారం వస్తుండగా మార్గమధ్యలో ఆరెపల్లిలో మరో ముగ్గురు ఎక్కారు. ఆటోడ్రైవర్‌తో సహా పది మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆరెపల్లి శివారులో గొర్రెల మంద ఎదురుకావడం..ఆటో అతివేవంగా ఉండడంతో అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు సమీపంలో రెండు పల్టీలు కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కొత్తపల్లికి చెందిన పలుక మొండి, ఆరెపల్లికి చెందిన తంగళ్లపల్లి సత్తయ్య తీవ్రంగా గాయపడ్డారు. అలాగే తంగళ్లపల్లి సంతోష్, దుర్గం లస్మయ్యకు స్వల్పగాయాలు కాగా మరో ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మొండి, సత్తయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై సంజీవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రెండు పల్టీలు కొట్టడంతో ఆటో ధ్వంసమైంది. ఆరెపల్లి గ్రామం, ఆటో బోల్తా, గాయాలు AREPALLI, AUTO BOLTHA, INJURES -
ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారని..
పార్వతీపురం: విజయనగరం జిల్లా బీఎం వలస మండలం గడసింగాపురం గ్రామంలో బుధవారం వేకువజామున నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారన్న కారణంగా గిరిజనులపై దాడిచేశారు. ఈ దాడిలో అమూల్య(15) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. బీసీలు నిర్వహిస్తున్న ఘటాల ఊరేగింపును చూసేందుకు వచ్చిన అమూల్య తదితరులపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. గిరిజనులు తమ ఉత్సవాల్లో పాల్గొనడం సహించలేకనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ఖానాపూర్ (ఆదిలాబాద్): ఖానాపూర్ శివారులోని పెట్రోల్‌బంకు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకవ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నిర్మల్ నియోజకవర్గం మామిడ మండలం బోరేగావ్ గ్రామానికి చెందిన నర్సయ్య(45) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ పరారయ్యాడు. -
లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
నల్లగొండ: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు గ్రామ శివారులో జరిగింది. వివరాలు..జాతీయరహదారి65పై ఒక లారీ డీజిల్ అయిపోవడంతో ఆగి పోయింది. ఈ క్రమంలోనే విజమవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివేకం: రెండవ దృష్టికోణం
ఓ సన్యాసి తన సాధన కోసం అడవికి వెళ్లాడు. అతనికి ముందరి రెండు కాళ్లు పోగొట్టుకొని ఎటూ కదల్లేని ఒక నక్క ఎదురుపడింది. అది ఊరికే ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. చూస్తే దానికి బాగానే ఆహారం దొరుకుతున్నట్టుగా ఉంది. ఆ నక్క బహుశా ఏ వేటగాడి ఉచ్చులోనో పడి అలా అయి ఉండవచ్చు అనుకున్నాడు. ఆ గాయం చాలా కాలం క్రితమే మానిపోయినట్టుంది. కాళ్లు లేకుండా నక్క ఎలా జీవించగలుగుతోందో సన్యాసికి అర్థం కాలేదు. ప్రకృతి కుంటితనంపై అంత దయ చూపదు. ఆహారం సంపాదించుకోలేకపోతే, మరణించినట్టే. అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ, ఆ సాయంత్రం అక్కడికో సింహం వచ్చింది. అది తను వేటాడిన ఒక జంతు కళేబరాన్ని అక్కడికి తీసుకొచ్చి తిన్నది. తినగా మిగిలినదాన్ని నక్క ముందుంచింది. సన్యాసి తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ప్రతి రెండు మూడ్రోజులకూ, ఆ సింహం వచ్చేది, కొంత మాంసాన్ని నక్క ముందుంచి వెళ్లిపోయేది. దీంతో ఆ సన్యాసి ఇది దేవుడి నుండి వచ్చిన సందేశమే కాని మరొకటి కావడానికి వీల్లేదు. ఒక సింహం కుంటి నక్కను మేపడం ఒక అద్భుతం. అందుకే, అతను ఇది నాకో సందేశం అనుకున్నాడు. ఒక కుంటి నక్కకు అది కూర్చున్నచోటికే ఆహారం వస్తే, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న ఓ సన్యాసినైన నాకు ఆహారం ఎందుకు దొరకదు? భిక్షాటన కోసం నేను నగరానికి ఎందుకు వెళ్లాలి? కూర్చొని ధ్యానం చేయటానికి బదులు, నేను ఆహారం కోసం అనవసరంగా నగరానికి వెళుతున్నాను అనుకున్నాడు. అతను అడవిలో ఓ రాతిమీద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మూడు రోజులు ఎలాగో గడిపాడు. నాలుగో రోజు నుంచీ అతను ధ్యానం చేయలేకపోయాడు. అతను పొట్టను గట్టిగా పట్టుకొని కూర్చుండిపోయాడు. అతన్ని ఆకలి దహించి వేస్తోంది. 18 రోజులు గడిచాయి. అతను పూర్తి బలహీనంగా, బక్కగా అయిపోయాడు. కానీ ఇంకా దైవకృప కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. నాకు తటస్థ పడింది తప్పకుండా దేవుని సందేశమే. అయినా నాకేం జరుగుతోంది? ఎందుకు ఎవరూ రావట్లేదు. ఆహారాన్ని ఎందుకివ్వట్లేదు? అనుకున్నాడు. ఆ దారినే ఒక యోగి వెళుతూ, ఈ సన్యాసి మూలగడం విని, నీకేమైంది? ఎందుకు నువ్వీ పరిస్థితిలో ఉన్నావు? అని అడిగాడు, నక్క-సింహం ఉదంతాన్ని వివరించి సన్యాసి ఇలా అడిగాడు: వివేకవంతులైన మీరే చెప్పండి. ఇది దైవ సందేశం కాదా? ఆ యోగి అతన్ని చూసి, కచ్చితంగా ఇది దేవుడి సందేశమే. కానీ నువ్వు కుంటి నక్కలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? దయ కలిగిన సింహంలా ఎందుకు ప్రవర్తించడం లేదు? అన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వీరిద్దరిలోని తేడా గమనించారా? మీరు పరిస్థితిని సరిగా అర్థం చేసుకోండి. సమస్య - పరిష్కారం కష్టాలొచ్చినప్పుడు మానవులు ఎక్కువ పూజలు చేయడం అవశ్యమా? అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? - ఎన్.కుమారి, నిడదవోలు సద్గురు: పూజలు ఎందుకోసం చేస్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికా? మీరు పూజలు చేసేది దానికోసం కాదు. భగవంతుడు మీ కోరికలు తీర్చే ఒక యంత్రంగా మీరు భావిస్తున్నారు. భగవంతుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలు తీరుస్తాడని అందరూ మీతో చెప్పడం వల్ల, ఆయన ముందు విన్నవించుకోవడాన్నే మీరు ప్రార్థన అనుకుంటున్నారు. అసలు భయం వల్ల కాని, ఆశల వల్ల కాని భగవంతుడిని పూజించడం ప్రార్థన కాదు. భగవంతుడికి బదులుగా ఒక గాడిదను చూపి, దాన్ని పూజిస్తేనే మీ కష్టాలు తీరుతాయని ఎవరైనా అంటే ఆ పనిని కూడా మీరు సంతోషంగా చేస్తారు. ప్రార్థనను ఒక పనిలా కాకుండా, మనస్సుని నిజాయితీతో భగవంతుడిపై కేంద్రీకరించగలిగితే మీకు కష్టమొచ్చినప్పుడు స్నేహితుడిలా మిమ్మల్ని ఆదుకోగలడు. అయితే మీ ప్రార్థనలో భక్తి శ్రద్ధలు లోపించి, పూజలు ఒక సంప్రదాయంగా భావిస్తే, కోటి మార్లు పూజలు చేసినా ఎటువంటి ఫలితమూ పొందలేరు. - జగ్గీ వాసుదేవ్