కొయ్యూరు(పాడేరు): ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ అంబులెన్స్ బోల్తా పడింది. సుమారు 30 అడుగుల లోయలోకి వెళ్లిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పోతవరం సంతలో వైద్య శిబిరం నిర్వహించేందుకు యూ.చీడిపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారిగా కొత్తగా బాధ్యతలు జగదీశ్వరరావు, దారకొండ పీహెచ్‌సీ వైద్యధికారి సాహితి, హెల్త్ సూపర్‌వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్లు బి.రామకృష్ణ, కుశరాజు, ఫార్మసిస్టు గురువారం యూ. చీడిపాలెం నుంచి అంబులెన్స్‌లో పోతవరం వెళ్లారు.
అక్కడ వైద్యశిబిరం ముగిసిన తరువాత ఎం.భీమవరం నుంచి వై.రామవరానికి రాత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి యూ.చీడిపాలెంలో పీహెచ్‌సీకి వస్తుండగా చవిటి దిబ్బల సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో అదుపు లోయలోకి అంబులెన్స్ బోల్తాపడింది.
అదృష్టవశాత్తు అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంటనే తేరుకున్న వైద్యుడు జగదీశ్వరరావు దుచ్చర్తి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.తరువాత మరో వాహనంలో అందరిని యూ.చీడిపాలెం ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం వరకు అక్కడ చికిత్స పొందారు.
Comments
Please login to add a commentAdd a comment