పార్వతీపురం: విజయనగరం జిల్లా బీఎం వలస మండలం గడసింగాపురం గ్రామంలో బుధవారం వేకువజామున నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారన్న కారణంగా గిరిజనులపై దాడిచేశారు. ఈ దాడిలో అమూల్య(15) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు.
బీసీలు నిర్వహిస్తున్న ఘటాల ఊరేగింపును చూసేందుకు వచ్చిన అమూల్య తదితరులపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. గిరిజనులు తమ ఉత్సవాల్లో పాల్గొనడం సహించలేకనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారని..
Published Wed, May 18 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement