మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి బైరాగిగూడ విద్యానగర్ కాలనీలో మంగళవారం తుపాకీ తూటా కలకలం రేపింది. పద్మ అనే మహిళ కాలును తాకుతూ వెళ్లింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. బాధితురాలు పద్మ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పద్మ తమ ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా కాలుకు అకస్మాత్తుగా ఏదో వస్తువు తగిలినట్లయ్యింది. కాలును గీసుకుని వెళ్లి రక్త్రస్తావమైంది.
ఆ ప్రాంతంలో వెతకగా బుల్లెట్ కనిపించింది. కాలికి కాకుండా శరీరం పైభాగంలో అది తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బుల్లెట్‌ను స్వా«దీనం చేసుకుని బాధితురాలిని గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
ఆర్మీ బుల్లెట్‌గా గుర్తింపు..
గంధంగూడకు ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీస్ ఫైరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇటీవల ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండటంతో బుల్లెట్లు చుట్టు పక్కల ఉన్న జవావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంధంగూడలో మహిళకు తగిలిన బుల్లెట్ ఆరీ్మదిగా గుర్తించామని, వారికి ప్రజలకు హాని కలిగే పరిస్థితులు వివరిస్తూ నోటీసు పంపుతామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీంతో ఆదారాలను సేకిరించామని, తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment