
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటన
కాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్‌మెంట్‌లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment