Miss Fire
-
హైదరాబాద్: మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటనకాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
హైదరాబాద్: అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లిన బులెట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది.ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి
కర్నూలు: లోకాయుక్త కోర్టులో గార్డు విధుల్లో ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రేగడ్డ సత్యనారాయణ (52) ప్రమాదవశాత్తూ తుపాకీ (ఎస్ఎల్ఆర్) పేలి మృతిచెందాడు. ఈయన అశోక్‌నగర్‌లోని నాగార్జున అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి లోకాయుక్త కార్యాలయానికి వెళ్లాడు. గార్డు విధుల్లో ఉంటూ బాత్రూమ్కి వెళ్లి బయటకు వస్తుండగా చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న సత్యనారాయణను సహోద్యోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 1992లో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం(ఏఆర్)లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఈయన ఎక్కువకాలం ఎంటీఓ సెక్షన్లో పనిచేశారు. ఇటీవలనే జనరల్ డ్యూటీలకు నియమించుకుని లోకాయుక్త కోర్టులో గార్డు డ్యూటీ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈయనకు భార్య అనురాధతో పాటు పద్మనందిని, మౌనిక కూతుర్లు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, నాలుగో పట్టణ ఎస్ఐ పెద్దయ్య నాయుడు, ఆర్ఐలు రమణ, పోతురాజుతో పాటు పలువురు అధికారులు, సహోద్యోగులు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి తన భర్త మృతిచెందినట్లు సత్యనారాయణ భార్య అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన తండ్రి నారాయణ కూడా ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. -
విషాదం: పీఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్ మృతదేహన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు. -
తుపాకీ మిస్‌ఫైర్..తోటి ఉద్యోగుల చేయూత
సాక్షి, హైదరాబాద్ : తుపాకీ మిస్‌ఫైర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎస్ఐ ఆదిత్య సాయి కుమార్ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు. వివరాల ప్రకారం.. ఈనెల 16న ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా టీఎస్ఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆదిత్య సాయి చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో తోటి ఉద్యోగులు ఆదిత్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అందరూ కలిసి జమచేసిన 27,50,000 రూపాయల చెక్కును ఆదిత్య సాయి కటుంబానికి అందజేశారు. బెటాలియన్ అదనపు డిజిపి అభిలాష్ భిష్తి స్వయంగా చెక్కును అందించారు. కష్టకాలంలో ఆదిత్య కటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆదిత్య కటుంబానికి మరింత అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కారుణ్య నియామకం కింద ఆదిత్య సోదరుడిని పోలీసు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) -
తుపాకీ మిస్‌ఫైర్.. ఆర్ఎస్ఐ మృతి
చర్ల: తుపాకీ మిస్‌ఫైర్ అయి రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా బుధవారం చోటుచేసుకుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ (25) చేతిలో ఉన్న ఏకే 47 తుపాకీ పేలి బుల్లెట్లు తొడలోకి దూసుకుపోయాయి. సహచర జవాన్లు సాయికుమార్‌ను తిప్పాపురం తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. మృతదేహానికి భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అతడి స్వస్థలమైన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు తరలించారు. మరో రెండు నెలల్లో గ్రేహౌండ్స్ ఆర్ఐగా పదోన్నతి పొందాల్సిన సాయికుమార్ మృతి పట్లకుటుంబ సభ్యులు, సహచర జవాన్లు ఆవేదన చెందుతున్నారు. -
తుపాకీ మిస్ ఫైర్
తుపాకీ మిస్ ఫైర్ అయిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటపెల్లికి చెందిన కిరణ్‌కుమార్ కొంత కాలంగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 4:50 గంటల సమయంలో చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకీని గుడ్డతో తుడుస్తుండగా ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. దీంతో తూటా కిరణ్‌కుమార్ ఎడమ దవడ నుంచి తలలోకి దూసుకెళ్లింది. స్టేషన్లో సిబ్బంది గమనించి వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కిరణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుధీంద్ర పరిశీలించారు. – తిర్యాణి (ఆసిఫాబాద్) -
మిస్‌ఫైర్
సిరిసిల్లక్రైం: పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో గార్డుడ్యూటీ నిర్వహించడానికి సన్నద్ధమవుతుండగా ఎస్ఎల్ఆర్ వెపన్ మిస్‌ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో కలకలం రేగింది. తోటి సిబ్బంది వివరాల ప్రకారం.. వై.సత్యనారాయణ అనే కానిస్టేబుల్ తన రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హెడ్‌క్వార్టర్‌లో గార్డుడ్యూటీ చేయడానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో తన ఎస్ఎల్ఆర్ వెపన్‌ను పరీక్షించే క్రమంలో మిస్‌ఫైర్ అయ్యింది. చేతితో పాటు ఎడమ చెంప భాగం నుంచి తూటా పాక్షికంగా దూసుకెళ్లింది. గమనించిన తోటి సిబ్బంది సిరిసిల్ల ఏరియాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రాణాపాయం లేదు: ఎస్పీ రాహుల్‌హెగ్డే గార్డు డ్యూటీ నిర్వహణలో ఒక కానిస్టేబుల్ నుంచి మరొక కానిస్టేబుల్ షిప్టుల వారీగా తమకు ఉన్న వెపన్లను పరీక్షిస్తారని, ఈ క్రమంలోనే సత్యనారాయణ తన ఆయుధాన్ని పరీక్షిస్తుండగా మిస్‌ఫైర్ జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. కానిస్టేబుల్‌కు ప్రాణాపాయం ఏమీలేదని, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ అనిల్‌కుమార్ ఉన్నారు. -
‘పిస్టల్’ రూపంలో వెంటాడిన ‘దురదృష్టం’
విధుల నుంచి ఇంటికి విశ్రాంతి కోసం వచ్చాడు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా దురదృష్టం వెంటాడింది. ప్రమాదవశాత్తు అది పేలింది. గన్‌మెన్ నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ సంఘటన గురువారం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విజయదశమి పండుగకు రెండు రోజుల ముందు జరిగిన ఈ ఘటన కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కడప అర్బన్ : జిల్లాలోని వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (45) 1992 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ (ఏఆర్ పిసి– 1245)గా పోలీసు శాఖలో చేరారు. గతంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డికి గన్‌మెన్‌గా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డికి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు పనిచేసిన ఆయన గురువారం విశ్రాంతి తీసుకునేందుకు ఉదయం కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రవీంద్రనగర్ రామాలయం వీధిలో నివసిస్తున్న తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తనకు భద్రత విధులకు తీసుకుని వెళ్లే ‘పిస్టల్’ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ సంఘటనలో పిస్టల్ బుల్లెట్ చంద్రశేఖర్‌రెడ్డి శరీరంలో ఛాతీకి కింద భాగం నుంచి వెనుక వైపునకు దూసుకుని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ రెడ్డిని మొదట రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న హిమాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తరలించారు. క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షలు చేసి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ సంఘటనతో చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో పడ్డారు. భార్య స్వర్ణలత, కుమారులు నితిన్‌రెడ్డి ఇంటర్మీడియేట్, ధనుష్‌రెడ్డి ఏడవ తరగతి చదువుతున్నారు. విధుల నుంచి ఇంటికి వచ్చిన తండ్రి తమతోపాటు పండుగ జరుపుకుంటాడని సంతోషంతో ఉండగా, అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగేసరికి బోరున విలపించారు. కుటుంబాన్ని ఆదుకుంటాం:ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందాడన్న వార్త తెలియగానే ఎస్పీ బాబూజీ అట్టాడ తమ సిబ్బందితో హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్‌రెడ్డి మరణం దురదృష్టవశాత్తు జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రుషికేశవరెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు దారెడ్డి భాస్కర్‌రెడ్డి, టీవీ సత్యనారాయణ, రామకృష్ణ, పురుషోత్తంరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
మిస్ ఫైర్‌తో మంత్రి ‘ఆది’ గన్‌మ్యాన్ మృతి
కడప అర్బన్: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌గా (ఏఆర్ పీసీ 1245) బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (45) గురువారం తన ఇంట్లో ‘పిస్టల్’ని శుభ్రపరుస్తుండగా పేలడంతో మృతి చెందారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా వున్నాయి. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ‘పిస్టల్’ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా పేలి బుల్లెట్ అతని ఛాతీ కింది భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి కడపలోని హిమాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు రిమ్స్‌లో వైద్యులు నిర్ధారించారు. అతని మృతదేహాన్ని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పిస్టల్’ను శుభ్రం చేస్తుండగా దురదృష్టవశాత్తు పేలడంతో ప్రమాదం జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవ్ రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనంతపురం రైల్వేస్టేషన్లో మిస్‌ఫైర్
► ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కాళ్లలోకి దూసుకెళ్లిన బుల్లెట్ అనంతపురం న్యూసిటీ: అనంతపురం రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్ చేతిలోని కార్బన్ తుపాకీ మిస్‌ఫైర్ అయిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ టంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుళ్లు(గుంతకల్లు) రామచంద్ర, రఫీ విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 19న రాత్రి 12 గంటల సమయంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం బయలుదేరారు. అనంతపురంలో బుధవారం 1.35 గంటల సమయంలో అనంతపురం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద దిగారు. రైలు రన్నింగ్‌లో ఉండగానే ఓ వ్యక్తి పరుగెత్తుకుని వస్తూ హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను తగులుతూ రైలెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రయాణికుడు వేగంగా తగలడంతో రామచంద్ర మరో హెడ్‌కానిస్టేబుల్‌ను తగలగా వీరిద్దరూ కింద పడ్డారు. రామచంద్ర చేతిలో ఉన్న కార్బన్ తుపాకీ కింద పడడంతో లాక్ ఓపెన్ అయ్యి క్షణాల్లో మిస్‌ఫైర్ జరిగింది. రామచంద్ర మోకాలు కింద భాగంలో బుల్లెట్ దూరి రఫీ అనే హెడ్‌కానిస్టేబుల్ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. -
రైల్వే స్టేషన్లో మిస్‌ఫైర్
– ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కాళ్లలోకి దూసుకెళ్లిన బుల్లెట్ – మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు అనంతపురం న్యూసిటీ: అనంతపురం రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్ చేతిలోని కార్బన్ తుపాకీ మిస్‌ఫైర్ అయిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుళ్లు(గుంతకల్లు) రామచంద్ర, రఫి విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 19న రాత్రి 12 గంటల సమయంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం బయలుదేరారు. అనంతపురంలో హంపి ఎక్స్‌ప్రెస్ బుధవారం 1.35 గంటల సమయంలో ఆగింది. ఈ క్రమంలో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద దిగారు. రైలు రన్నింగ్‌లో ఉండగానే ఓ వ్యక్తి పరుగెత్తుకుని వస్తూ హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను తగులుతూ రైలెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రయాణికుడు వేగంగా తగలడంతో రామచంద్ర మరో హెడ్‌కానిస్టేబుల్‌ను తగలగా వీరిద్దరూ కింద పడ్డారు. రామచంద్ర చేతిలో ఉన్న కార్బన్ తుపాకీ కింద పడడంతో లాక్ ఓపెన్ అయ్యి క్షణాల్లో మిస్‌ఫైర్ జరిగింది. రామచంద్ర మోకాలు కింద భాగంలో బుల్లెట్ దూరి రఫి అనే హెడ్‌కానిస్టేబుల్ తొడలోకి దూసుకెళ్లింది. అప్పటికే రామచంద్ర కుప్పకూలిపోయాడు. మిస్‌ఫైర్ జరిగి బుల్లెట్ లోపలికి వెళ్లిదంటూ బిగ్గరగా కేకలు వేశాడు. రఫి ప్యాంటుకు రంధ్రం పడి ఉండడాన్ని గమనించి తనకూ బుల్లెట్ తగిలిందని నిర్ఘాంతపోయాడు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటినా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అప్పటికే రామచంద్ర శరీరం నుంచి అధికంగా రక్తస్రావం జరిగింది. డ్యూటీ వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. రామచంద్ర కదలలేని స్థితిలో ఉండిపోగా, రఫి బాగానే స్పందిస్తూ ఉన్నాడు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. కమాండెంట్ పరామర్శ: సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్‌కానిస్టేబుళ్లను కమాండెంట్ ఎలిషా పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ల లెక్కింపు.. ఇద్దరికి గాయాలు కావడంతో ఆర్పీఎఫ్ పోలీసులు కార్బన్ తుపాకీలో ఉన్న బుల్లెట్లను లెక్చించారు. ఒక్కో కార్బన్ తుపాకీలో 30 బుల్లెట్లు ఉంటాయి. రామచంద్ర కార్బన్ తుపాకీ పరిశీలించగా అందులో 29 మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక బుల్లెట్ మాత్రమే బయటకు వచ్చిందని పోలీసులు నిర్థారించారు. అంబులెన్స్ కోసం గంటల తరబడి.. వైద్యులు కర్నూలుకు రెఫర్ చేయగా అంబులెన్స్ కోసం క్షతగాత్రలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని అంబులెన్స్ పంపాలంటే ఆర్ఎంఓ అనుమతి రావాలి. ఆ సమయంలో డ్యూటీ వైద్యులు సూపరింటెండెంట్, ఆర్ఎంఓకు ఫోన్ చేయగా వారు 2.30 గంటల సమయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినా..అంబులెన్స్‌లో డీజిల్ లేదు. దీంతో డ్రైవర్ డీజిల్ లేదంటూ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోడారు. అంబులెన్స్‌లో డీజిల్ వేసుకుని బయలుదేరే సరికి ఉదయం 5.30 సమయం పట్టింది. రాత్రి 1.40 గంటల సమయంలో మిస్‌ఫైర్ జరిగితే అంత వరకు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో ఉండాల్సి వచ్చిందంటే సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. బుల్లెట్ శరీరంలో ఉన్నప్పుడు విషంగా మారి ప్రాణానికే ప్రమాదం సంభవించవచ్చు. అటువంటి ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం ముందస్తు ఆలోచన లేకుండా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. -
ఏం జరిగింది..?
కర్నూలులో సీఎం సభలో పేలిన తుపాకీ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హంపన్న మృతి మిస్‌ఫైరా... ఆత్మహత్యా? అనంతపురం సెంట్రల్ : కర్నూలులో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో తుపాకీ పేలి కానిస్టేబుల్ హంపయ్య (24) మృతి చెందారు. ఈ ఘటన ఎలా జరిగింది.. అసలు కారణాలు ఏంటి? అనే అంశంపై పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. కళ్యాణదుర్గానికి చెందిన నారాయణ, మారెక్క దంపతుల కుమారుడు హంపయ్య. 2011లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. విడపనకల్లు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై స్పెషల్ పార్టీలోకి వచ్చారు. సోమవారం సీఎం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు విధుల కోసం వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న హంపయ్య తుపాకీ పేలడంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు. పోలీస్ అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తుపాకీ మిస్‌ఫైర్ కావడంతోనే హంపన్న మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈ మృతిపై 'అనంత'లో పలు రకాల వాదనలు వినపడుతున్నాయి. హంపన్న కొద్దిరోజులుగా సెలవులో ఉన్నారని, సీఎం బందోబస్తు ఉండడంతో తిరిగి విధుల్లోకి వచ్చారని తెలుస్తోంది. మంగళవారం నుంచి కర్నూలు జిల్లాలో జరిగే ఎస్ఐ రిక్రూట్మెంట్కు కూడా అర్హత సాధించినట్లు సమాచారం. ఈ సమయంలో డ్యూటీ వేయడంతో రిక్రూట్మెంట్ ఉందని, సెలవు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. అయినా డ్యూటీకి పంపడంతో ఎస్ఐ కావాలన్న కోరిక తీరకుండా పోతోందని మనస్తాపం చెంది..ఆత్మహత్య చేసుకున్నాడేమోనని కొందరు పోలీసులు చర్చించుకుంటున్నారు. అలాగే హంపన్న కొద్దికాలంగా ప్రేమలో ఉన్నారని, ఇది కూడా కారణమా అనే అనుమానాలను మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే..మృతికి గల అసలు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ విషయంపై స్పెషల్‌పార్టీ ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ వలిని వివరణ కోరగా... సెలవులో ఉంటూ గత నెల 24న విధుల్లోకి వచ్చి రిపోర్టు చేసుకున్నాడని తెలిపారు. ఎస్ఐ పరీక్షలకు ఎంపికయ్యాడా లేదా అన్నది చూడాల్సి ఉందన్నారు. మిస్‌ఫైర్ వల్ల చనిపోయాడా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా దర్యాప్తులో తేలుతుందన్నారు. -
గన్ మిస్‌ఫైర్... ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్
ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటన చందంపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఊపిరితిత్తుల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. -
పోలీస్ అకాడమీలో మిస్‌ఫైర్
-
సీఆర్పీఎఫ్ ట్రైనింగ్‌లో మిస్‌ఫైర్
-
గురితప్పింది