
తుపాకీ మిస్ ఫైర్ అయిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం చౌటపెల్లికి చెందిన కిరణ్‌కుమార్ కొంత కాలంగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 4:50 గంటల సమయంలో చేతిలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని గుడ్డతో తుడుస్తుండగా ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. దీంతో తూటా కిరణ్‌కుమార్ ఎడమ దవడ నుంచి తలలోకి దూసుకెళ్లింది. స్టేషన్‌లో సిబ్బంది గమనించి వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కిరణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుధీంద్ర పరిశీలించారు.
– తిర్యాణి (ఆసిఫాబాద్)
Comments
Please login to add a commentAdd a comment