
సత్యనారాయణ పరిస్థితిపై వివరాలు తెల్సుకుంటున్న ఎస్పీ రాహుల్ హెగ్డే , గాయాలపాలైన సత్యనారాయణ
సిరిసిల్లక్రైం: పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో గార్డుడ్యూటీ నిర్వహించడానికి సన్నద్ధమవుతుండగా ఎస్‌ఎల్‌ఆర్ వెపన్ మిస్‌ఫైర్ కావడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో కలకలం రేగింది. తోటి సిబ్బంది వివరాల ప్రకారం.. వై.సత్యనారాయణ అనే కానిస్టేబుల్ తన రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హెడ్‌క్వార్టర్‌లో గార్డుడ్యూటీ చేయడానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో తన ఎస్‌ఎల్‌ఆర్ వెపన్‌ను పరీక్షించే క్రమంలో మిస్‌ఫైర్ అయ్యింది. చేతితో పాటు ఎడమ చెంప భాగం నుంచి తూటా పాక్షికంగా దూసుకెళ్లింది. గమనించిన తోటి సిబ్బంది సిరిసిల్ల ఏరియాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
ప్రాణాపాయం లేదు: ఎస్పీ రాహుల్‌హెగ్డే
గార్డు డ్యూటీ నిర్వహణలో ఒక కానిస్టేబుల్ నుంచి మరొక కానిస్టేబుల్ షిప్టుల వారీగా తమకు ఉన్న వెపన్‌లను పరీక్షిస్తారని, ఈ క్రమంలోనే సత్యనారాయణ తన ఆయుధాన్ని పరీక్షిస్తుండగా మిస్‌ఫైర్ జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. కానిస్టేబుల్‌కు ప్రాణాపాయం ఏమీలేదని, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ అనిల్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment