- నలుగురికి గాయాలు
- తప్పిన పెనుప్రమాదం
ఆరెపల్లిలో ఆటోబోల్తా..
Published Wed, Aug 10 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
జైపూర్ : మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం అదుపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాలివీ.. కొత్తపల్లికి చెందిన ఆటో ఆరుగురు వ్యక్తులతో భీమారం వస్తుండగా మార్గమధ్యలో ఆరెపల్లిలో మరో ముగ్గురు ఎక్కారు. ఆటోడ్రైవర్‌తో సహా పది మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆరెపల్లి శివారులో గొర్రెల మంద ఎదురుకావడం..ఆటో అతివేవంగా ఉండడంతో అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు సమీపంలో రెండు పల్టీలు కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కొత్తపల్లికి చెందిన పలుక మొండి, ఆరెపల్లికి చెందిన తంగళ్లపల్లి సత్తయ్య తీవ్రంగా గాయపడ్డారు. అలాగే తంగళ్లపల్లి సంతోష్, దుర్గం లస్మయ్యకు స్వల్పగాయాలు కాగా మరో ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మొండి, సత్తయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై సంజీవ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రెండు పల్టీలు కొట్టడంతో ఆటో ధ్వంసమైంది. ఆరెపల్లి గ్రామం, ఆటో బోల్తా, గాయాలు AREPALLI, AUTO BOLTHA, INJURES
Advertisement
Advertisement