హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని కదిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు చాంద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చాంద్బాషా మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిస్థితుల వల్లే రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆరోపించారు. అటు సాగు నీరు ఇటు తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని చాంద్బాషా ఆందోళన వ్యక్తం చేశారు.