Choreographer Suchitra Chandrabose's father Chand Basha passes away - Sakshi
Sakshi News home page

కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

Published Sat, Jan 7 2023 10:12 AM

Choreographer Suchitra Chandrabose Father Chand Basha Passed Away - Sakshi

ప్రముఖ గేయరచయిత చంద్రబోస్‌, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుచిత్ర తండ్రి, చంద్రబోస్‌ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. 

చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో  ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం ,  మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement