Chandrabose Lyricist
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
వైరల్ అవుతున్న 'తంగలాన్' వార్ సాంగ్
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా విజయంపై నమ్మకాన్ని కలిగించాయి. తాజాగా తంగలాన్ వార్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జి. వి. ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు హైలెట్ కానుంది. చంద్రబోస్ రచించిన ఈ సాంగ్‌ను శరత్ సంతోష్ ఆలపించారు.భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇండిపెండెన్స్ డే ఆగష్టు 15న విడుదల కానుంది. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్ నెగటివ్ రోల్ పోషిస్తుండగా.. పార్వతి తిరువోతు, పశుపతి, సంపత్ రామ్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. -
సొంతూరు కోసం మంచి మనసు చాటుకున్న చంద్రబోస్
ప్రముఖ సినీ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో తన గ్రామ ప్రజలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా చల్లగరిగెలో తనకు దక్కిన గౌరవానికి గుర్తుగా 'ఆస్కార్ గ్రంథాలయం' ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు. గ్రామంలో ఇది వరకే ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ. 36 లక్షలతో కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.నేడు జులై 4న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గ్రామంలోని యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.సుమారు 30 ఏళ్ల కెరీర్లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రబోస్. 860 సినిమాల్లో 3600కిపైగా పాటలు ఆయన రాశారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్ అసామాన్యంగా చిత్రసీమలో ఎదిగారు. రాబోవు తరాల కవులకి ఆయన జీవితం, ప్రయాణం ఆదర్శవంతం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన రచించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఎస్సార్ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఆయన అందుకున్నారు. -
'నాటు నాటు' పాట అలా పుట్టింది... వెల్లడించిన చంద్రబోస్
చిట్యాల: చల్లగరిగలో చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతోనే ‘నాటు నాటు’పాట పుట్టింది.. దీంతో ఊరికే ఆస్కార్ అవార్డు దక్కిందని.. సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాసిన ‘నాటు నాటు’పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు ఆదివారం వచ్చిన చంద్రబోస్ దంపతులు.. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఇంటినుంచి పాఠశాల వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. చంద్రబోస్ చదివిన పాఠశాల 1969–2022 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ గ్రంథాలయం నుంచే తనకు అక్షర బీజం పడిందని.. ఇప్పడు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. గ్రామస్తులతో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
తెలుగు రచయిత చంద్రబోస్ తో సాక్షి ఎన్నారై ముఖాముఖీ
-
ప్రపంచ వేదికపై ఓరుగల్లు
హన్మకొండ కల్చరల్/సాక్షి నెట్వర్క్: కళలు, కళాకారులు, కవులు, రచయితలకు పుట్టినిల్లు ఓరుగల్లు. అలాంటి నేపథ్యమున్న ప్రాంతంనుంచి విశ్వవేదిక వరకు ఎదిగిన చంద్రబోస్ ఉమ్మడి జిల్లా కలికితురాయిగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ పాటల విభాగంలో పాట రచయిత, ఉమ్మడి జిల్లాకు చెందిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై పలువురు కవులు, కళాకారులు, రచయితలు, సినీగేయ రచయితలు హర్షం వ్యక్తం చేశారు. వారు కవిత ద్వారా, గీతికల ద్వారా చంద్రబోస్‌ను అభినందించారు. శారద నాట్యమండలి సభ్యులు జేఎన్ శర్మ, జూలూరు నాగరాజు, జేబీ కల్చరల్ సొసైటీ నిర్వాహకులు జడల శివ తదితరులు చంద్రబోస్‌కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులు, సినీ దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బంగారు గురిగిని తీసుకొచ్చే స్థాయికి.. తెలుగు పాటకు ఆస్కార్ రావడం మన జాతికి లభించిన గౌరవం. చంద్రబోస్ అన్నను స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలోకి వచ్చా. తెలుగు వర్ణమాల ఈనాడు మీ మెడలో విజయ వర్ణమాలగా మారింది. చల్లగరిగ నుంచి బంగారు గురిగిని(భారతదేశానికి మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం), ఇప్పుడు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చే స్థాయికి ఎదిగిన చంద్రబోస్‌కు అభినందనలు. – కాసర్ల శ్యామ్, ప్రముఖ జానపద, సినీ గేయ రచయిత తెలంగాణ తల్లికి వజ్రకిరీటం చంద్రబోస్‌కు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు జాతికి వచ్చినంత గర్వకారణం. తెలంగాణ తల్లికి వజ్రకిరీటం.. పల్లె పల్లె పచ్చికలో పూలు పూసిన సంతోషం.. తెలంగాణ పల్లెలోని పచ్చిక పూల తీవాచీ పరుస్తుంది.. పుట్ల కొద్దీ వృక్షజాతి నవధాన్యాల సిరిసంపదలు .. ఇవన్నీ విరివిగా పండి పల్లె ఆసాముల ఇండ్లలో రాశులుగా పోసిన సంతోషం. జాతి గర్వపడే విషయం. తేట జలపాతపు ఊటలు వెనుకటి లాగా ఉప్పొంగి అలుగులు వారిన సంతోషం. జానపద కళలన్నీ కూడా ఈ సందర్భంగా ఆయనకు స్వాగత విజయభేరి మోగిస్తున్నాయి. – వరంగల్ శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు తెలుగు వారంతా గర్వపడే విషయం భారతదేశ చరిత్రలో నాకు తెలిసి గేయ రచయితకు ఆస్కార్ రావడం ఇదే ప్రథమం. అప్పట్లో ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు జాతీయ పురస్కారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం వేటూరి సుందరరామమూర్తిని ఆహ్వానించింది. ‘నా తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తేనే ఈ అవార్డు తీసుకుంటా’ అని ఆయన పురస్కారాన్ని తిరస్కరించారు. అలాంటిది ఈ దేశం గుర్తించని భాషలో(తెలంగాణ మాండలికంలో) పాట రాసిన చంద్రబోస్ ఇప్పుడు ప్రపంచం నోట తెలుగు పాటను పాడిస్తున్నారు. ఈ అవార్డు రావడం తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. – మిట్టపల్లి సురేందర్, సినీ గేయ రచయిత సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు... సినీ కళా సామ్రాజ్యంలో చిరకాల కలగా మిగిలిపోయిన ఆస్కార్ సాకారమైన ఆ సమయం. భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్ష రాలతో లిఖించదగింది. తెలంగాణ తెలుగు పాటల రచయిత చంద్రబోస్ కలం నుంచి జాలువారిన ఆణిముత్యం నాటు నాటు పాట. తెలంగాణ భాష, యాసకు విశ్వవేదికపై స్థానం కల్పించి విజయజెండా ఎగరేసి వీనుల విందుగా విహరింపజేసిన చంద్రబోస్ ఎందరికో ఆదర్శప్రాయుడు. గొట్టె రమేశ్ , పాటల రచయిత చంద్రబోస్‌తో రెండు పాటలు రాశా.. తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించి ఒక తెలుగువాడి సత్తా చాటి భారతదేశ గొప్పదనాన్ని, తెలుగు అనే భాష తెలియని ఇతర దేశాలకు తెలుగు వెలుగులు నింపిన గీత రచయిత చంద్రబోస్ నా ప్రాంతంవాడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. చంద్రబోస్‌తో కలిసి అనువంశికత సినిమాలో రెండు పాటలు రాశాను. చాలా ఆనందంగా ఉంది. – రామకృష్ణ కందకట్ల, గీత రచయిత, సంగీత దర్శకులు (వరంగల్) మా ప్రాంతవాసి కావడం సంతోషకరం ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం హర్షణీయం. పాటను రాసిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ మా ప్రాంతవాసి కావడం సంతోషంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచి్చన చంద్రబోస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. – గండ్ర వెంకటరమణారెడ్డి,భూపాలపల్లి ఎమ్మెల్యే చల్లగరిగలో సంబురాలు చిట్యాల: చంద్రబోస్ రచించిన ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు..నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో గ్రామీణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఆయన స్వగ్రామం చల్లగరిగలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఆయా కార్యక్రమాల్లో దావు వీరారెడ్డి, అప్పాల వెంకటరమణ, మేరుగు సమ్మయ్య, జాలీగపు రవీందర్, బండి సత్యం, కళాకారులు చింతల రమేశ్, దాసారపు నరేశ్, మ్యాదరి సునీల్, రాజు నాయక్, జన్నే యుగేందర్, రజినీకాంత్, పుల్ల ప్రతాప్, రత్నాకర్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది.. ప్రాంతీయ సినిమా విశ్వ వేదికపై నిలబడడం చాలా గొప్ప విషయం. పల్లె పలుకులతో ప్రాణం పోసుకున్న పాట ప్రపంచాన్ని మెప్పించింది. ఇప్పుడు ఏ నోట చూసినా నాటు నాటు పాటే. తెలుగు సినిమా ఎందులోనూ తీసిపోదు అని మరోసారి నిరూపితమైంది. చంద్రబోస్, కీరవాణి, ఇతర టీమ్‌కు అభినందనలు. – ఉదయ్ గుర్రాల, సినీ డైరెక్టర్ హాలీవుడ్‌కు పునాది ‘నాటు నాటు’ పాటలో మట్టివాసన ఉంది. పల్లె ప్రతీకలతో సాహిత్యాన్ని చంద్రబోస్ గొప్పగా రాశారు. చంద్రబోస్ వరంగల్ వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు రావడంతో హాలీవుడ్‌కు పునాది వేసినట్లయ్యింది. ఇకపై ప్రపంచమంతా మన సినిమాలు చూడనుంది. ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. – డాక్టర్ ప్రభాకర్ జైనీ, సినీ దర్శకుడు -
పాట రచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు
-
Oscars 2023 : ప్రపంచస్థాయికి తెలుగు సినిమా.. RRRటీమ్‌కు అరుదైన గౌరవం
-
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా..’’
ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల ‘ది బెవర్లీ హిల్టన్’ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డు లభించింది. ఈ పాటకు గాను సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లకు అవార్డు దక్కింది. అవార్డుల ప్రదానోత్సవం రోజున కీరవాణి ఆ అవార్డును వేదికపైనే అందుకున్నారు. కాగా, ప్రస్తుతం లాస్ఏంజెల్స్లో ఉన్న రచయిత చంద్రబోస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును స్వీకరించారు. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ మా కార్యాలయానికి వచ్చి ఆయనకు చెందిన అవార్డును (నాటు నాటు పాటకు..) స్వీకరించారు. ఆయనకు మరోసారి శుభాకాంక్షలు’’ అని గోల్డెన్ గ్లోబ్ ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంపై చంద్రబోస్ స్పందిస్తూ ‘‘మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూగోళమా.. (లవ్యూ)’’ అని ట్వీట్ చేశారు. ‘నాటు నాటు’ పాట 95వ ఆస్కార్ అవార్డ్స్లోని ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కా ర్ వేడుక మార్చి 12 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13)న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. మనస్ఫూర్తిగా అందరికీ ధన్వవాదాలు-బంగారు భూగోళమా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ https://t.co/xzV6WIhexI — chandrabose (@boselyricist) February 15, 2023 -
నాటు నాట్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాల గర్వంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
-
ఆయన సరస్వతి పుత్రుడు.. తెలుగువారికి ఇది గర్వకారణం: చిరంజీవి
టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఆయన రచించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్‌ను చిరంజీవి, రవితేజ ఘనంగా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ.. 'చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంది. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణితోపాటు ఈ పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. తెలుగు వాళ్లందరి తరఫున చంద్రబోస్‌కు నా ప్రత్యేక అభినందనలు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు.' అంటూ కొనియాడారు. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ గేయరచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుచిత్ర తండ్రి, చంద్రబోస్ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం , మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
ఈ మధ్య నేను విన్న పాటల్లో చాలా అరుదైన పాట అదే : చంద్రబోస్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ "వాసవసుహాస" పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటపై ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రశంసలు కురిపించారు. ''నేను ఈ మధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన,విలువైన పాట.వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట..వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం.రాయడానికి ఎంత ప్రతిభ ఉండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి, భాషా సంస్కరం వుండాలి. కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు'' అంటూ చంద్రబోస్ అభినందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. -
క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే ఘంటసాల: చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. మాస్టార్కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ తనకు చాలదని ఆయితే ఆయనపైన తనకున్న అపారగౌరవంతో కొన్ని విషయాలను పంచుకున్నారు. మాస్టార్ పాటలు పాడకముందు జాతీయోద్యమంలో పాల్గొన్నారని, ఓ సందర్భంలో జైలు జీవితం కూడా గడిపినట్లు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారని కొనియాడారు. 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు అయితే, వారి తరువాత 1945లో స్వర్గసీమ చిత్రంతో మొదలుపెట్టి - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు ప్రయాణం సాగిందని చెప్పారు. శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం, ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం, డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం ఈ కార్యక్రమంలో ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఆయనను స్మరించుకున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని చాలా మంది ప్రముఖులు "ఘంటసాలకి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. -
ఎమోషనల్ అయిన సుకుమార్.. చంద్రబోస్ కాళ్లకు మొక్కుతూ
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాటల రచయిత చంద్రబోస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే చంద్రబోస్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సుకుమార్ చంద్రబోస్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. దాన్ని వద్దని చంద్రబోస్ వారిస్తూ తాను కూడా సుకుమార్ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అలాగే 'చంద్రబోస్ ప్రతిభ ఏంటో నాకు తెలుసు. ఊ అంటావా అని చంద్రబోస్ గారు నాలుగేళ్ల క్రితం అన్నారు. మీరు ఉఉ అనండి.. దాన్ని అలానే దాచేయండి అని చెప్పాను. నాకోసం నాలుగేళ్ల దాచిన ఆ పాట ప్రపంచం మొత్తాన్ని ఊ కొట్టిస్తుంది. చంద్రబోస్ స్పాంటేనిటీ అద్భుతం. ఆయన శక్తికి పాదాభివందనం. నాకు పాట కావాలంటే ఐదు నిమిషాల్లో ఈజీగా పాట, పల్లవి చెబుతుంటారు. అది చూసి నేను ఆశ్చర్యపోతుంటా. చంద్రబోస్ నవ్వుతూ ఉంటే మామలు వ్యక్తిగానే ఉంటారు. పాట రాసినప్పుడు మాత్రం ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన గురించి అందరికి తెలియాలనే ఇలా స్టేజ్‌పైకి పిలిపించాను.' అని సుకుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ? -
‘కలయా.. నిజమా.. గుండెలను పిండేసేలా ఉంది’
‘‘కలయా నిజమా... అనే పల్లవితో సాగే పాటలో కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యాన్ని పొందుపరిచారు. ఈ పాట గుండెలను పిండేసేలా ఉంది. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోశాయి’’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. నాగవర్మ, దివ్యా సురేశ్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలోని ‘కలయా.. నిజమా’ అంటూ సాగే పాటను చంద్రబోస్ విడుదల చేశారు. ‘‘ప్రేమించిన అమ్మాయి కోసం ఓ సినిమా రచయిత ఏం చేశాడు? అనే ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తీశాం’’ అన్నారు హరిచందన్. ‘‘అక్టోబర్‌లో మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ. -
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
పాటే నా ప్రాణం: చంద్రబోస్
సాక్షి, భద్రాచలం : పాటే తన ప్రాణమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ అంతరాష్ట్ర తెలుగు నాటకోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం భద్రాచలం విచ్చేశారు. ఈ సందర్భంగా సాక్షి పలుకరించగా పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘మాతృ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. కీరవాణితో సినిమా అంటే ఎంతో మధురమైన పాటలు ఆశువుగా వచ్చేస్తాయి. పాటల రచయితకు అభిమానులుగా ఉంటూ.. గత నాలుగేళ్లుగా భద్రాచలానికి చెందిన తోటమళ్ల సురేష్, కృష్ణా రెడ్డి లాంటి వ్యక్తులు సేవ చేయడం మరిచిపోలేని విషయం. నేను భవిష్యత్తులోనూ వేరే రంగంలోకి వెళ్లబోను. సినిమానే నా ప్రపంచం. చివరి వరకు ఇందులోనే ఉంటా’. అని చంద్రబోస్ పేర్కొన్నారు. -
చంద్రబోస్ నివాసంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోమృతి చెందారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చంద్రబోస్ చివరివాడు. చంద్రబోస్‌కు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
సినిమా పాటరాయడం చాలా కష్టం..
‘మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుంది’.. ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని’.. అంటూ నిరాశా చీకట్లను తరిమేసే స్ఫూర్తిదాయక పాటలు రాయాలన్నా.. పెదవే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మా... అని తల్లి ప్రేమ మాధుర్యాన్ని గుమ్మరించాలన్నా.. తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చే తల్లి చిరునవ్వులా.. అని అద్భుతమైన గీతం రాయాలన్నా...ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా... అంటూ సమకాలీన రాజకీయాలను స్పృశించాలన్నా..మెగాస్టార్ చిరంజీవి అభిమానుల జాతీయ గీతంగా పేర్కొనే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అని ఉర్రూతలూగించాలన్నా..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది.. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది.. అని చీరకట్టు గొప్పతనానికి జైకొట్టాలన్నా..తెలుగు సినిపరిశ్రమలో ఇప్పుడు ఒక్కరికే సాధ్యం.. ఆ ఒకే ఒక్క రచయిత చంద్రబోస్.. చంద్రబోస్ కాదు.. చంద్ర‘భేష్’ అని తెలుగు సినీ పాట గర్వంగా తలెత్తుకునేలా చేసిన వేటూరి సుందరరామమూర్తితోనే ప్రశంసలు అందుకున్న కవి.మారుమూల పల్లె.. సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్‌లో జేఎన్టీయూ థర్డ్ ర్యాంక్ సాధించి కూడా కేవలం గానం, కవిత్వంపై మక్కువతో సినిమా పాట బాట పట్టారు చంద్రబోస్.మనిషిలో ప్రేరణ, స్ఫూర్తి రగిలించే సోలో, యుగళగీతాలు, సామాజిక సందేశాలు.. ఇలా ఏపాటైనా ఆలవోకగా రాసేసి సినిమా కవిగా వచ్చే ఏడాది పాతికేళ్ళ ప్రాయంలోకి అడుగుపెడుతున్న చంద్రబోస్ సోమవారం విశాఖలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. చదువు.. చదువు.. చదువు... చదువే ఓ మూలధనం.. విద్యార్ధులే కాదు.. సమాజంలో ఎవరైనా.. ఏ రంగంలోని వారైనా.. వారికిష్టమున్న రంగం కావొచ్చు.. అంశంకావొచ్చు.. చదవాల్సిందే.. అధ్యయనం చేయాల్సిందే. ‘పరుగెత్తు..నడువు.. లేదంటే పాకుతూవెళ్లు.. అంతేకానీ ఒకే చోట కదలకుండా కూర్చోకు’.. అని మహాకవి శ్రీశ్రీఅన్నట్లే నా సృజనతో నేను చెప్పేది ఒకే ఒక్క మాటచదవు.. చదువు.. చదువు.. తెలుగుపాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు తెలుగు సినీ పాటకు జాతీయస్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం నాలో ఉంది. జాతీయ అవార్డులు పొందుతున్న మిగిలిన భాషా చిత్రాల పాటలను నేను అనువదించి వింటుంటాను. ఆ సాహిత్యమూ తెలుసుకుంటాను. కచ్చితంగా వాటికంటే మన తెలుగు పాటలేమీ తీసిపోవు. అంతకంటే మంచి సాహిత్యమే మన పాటల్లో ఉంది. కానీ ఎందుకో మొదటి నుంచి తెలుగుపాటకు తగినంత గుర్తింపు దక్కడం లేదు. బహుశా మన పాటను భుజానికెత్తుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్లనేమోనని అనుకుంటాను. నా ఆటోగ్రాఫ్ సినిమాలో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. పాట విషయమే తీసుకుందాం. తమిళ మాతృక సినిమాలో ఆ పాటకు ఎంతో గుర్తింపునిచ్చారు. ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఎన్నో అవార్డులు వచ్చాయి. వాస్తవానికి మాతృకలోని పాట కంటే తెలుగు పాటే ఎక్కువమందికి చేరువైంది. ఆ పాట కంటే మన తెలుగు పాటే బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ జాతీయ స్థాయి అవార్డే కాదు.. రాష్ట్రంలోనూ రాలేదు. కానీ ఆ పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణలోని యువతి ప్రణీత 80శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఎన్నో రోజులు చికిత్స పొందింది. ఆ సమయంలో ఆమె ప్రతిరోజూ భక్తి గీతాలతో పాటు మౌనంగా ఎదగమనే పాటతో పాటు నేనున్నాను సినిమాలోని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. అనే పాటలు విని సాంత్వన పొందానని చెప్పినప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ ఆ రెండు పాటలూ నేను రాసినవే. ఏ అవార్డు ఇంతటి గౌరవాన్ని అందిస్తుంది..చెప్పండి. అందుకే ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కంటే ప్రజలు ఇచ్చే గుర్తింపునకే విలువ ఎక్కువ జానపదమే... జ్ఞానపథం మన సాహిత్యానికి గానీ. సంస్కృతికి గానీ జానపదమే ప్రధానం.. అందుకే నేను జానపదమే జ్ఞానపథం అంటాను. సాహిత్యం జీవనాడిగా ఉందంటే అందుకు జానపదమే కారణం. నేను ఎదిగిన పల్లె వాతావరణం కావొచ్చు, నేను రాసిన పాట పామరులకీ అర్ధం కావాలనే ఆశ కావొచ్చు.. జానపదమే నన్ను ప్రభావితం చేసింది. నాకు సంగీతం అనువంశికంగా కాదు.. అనుసృజనగా వచ్చింది. రంగస్థలం పాటలు రాయలేదు..అశువుగా చెప్పా వాస్తవానికి నేను పాటలు పాడదామనే సినీరంగానికి వచ్చాను. మొదట లక్ష్యం అదే.. కానీ ఆ వైపు అవకాశాలు రాకపోవడంతో ఓ మిత్రుడి సలహా మేరకు పాటలు రాశా ను. మొదటిసారి 1995లో డి రామానాయుడు నిర్మించిన తాజ్‌మహల్ సినిమాలో పాట రాసేందుకు దర్శకుడు ముప్పలనేని శివ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా పాటలు రాస్తూనే ఉన్నాను. 24 ఏళ్ళ కెరీర్లో 3300 పాటలు రాశాను. ఒక్కోసారి ఓ పాట రాసేందుకు నాలుగైదు రోజు లు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ రంగస్థలం సినిమాలోని అన్ని పాటలూ నేనే రాశాను. విచిత్రమేమిటం టే పేపర్‌పై పెన్ను పెట్టి ఒక్క పాట కూడా రాయలేదు. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, నేను కూర్చుంటే... ఆశువుగా అర్ధగంటలో ఒక్కో పాట చెప్పేస్తే.. వాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ పాటల్లో ఎంతటి సాహిత్యముంది.. స్ఫూర్తి రగిలించే పాటలు నేనే ఎక్కువ రాశా నా లిరిక్స్‌లో నవరసాలూ ఉంటాయి. హాస్యం, శృంగారం, క్రోధం, శాంతం, కరుణ భయం,. బీభత్సం.. అన్నీ ఉంటాయి. కానీ నాకు మనిషికి ప్రేరణనిచ్చి.. స్ఫూర్తిని రగిలించి సందేశాన్నిచ్చి ముందుకు నడిపించే పాటలంటేనే ఇష్టం. నిరాశ, నిస్పృహలను పారదోలే స్ఫూర్తి సాహిత్యంతో 35పాటలు రాశాను. బహుశా తెలుగు సినిమా సాహిత్యంలో అలాంటి పాటలు ఎక్కువ రాసింది నేనే అని అనుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువ వచ్చిందని భావిస్తాను.. కొత్త రచయితలూ... సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త రచయితలూ ముందు బాగా చదవండి. కవిత్వానికి మూమూలు మాటకు తేడా ఏమిటో తెలుసుకోవాలి. మాట కవిత్వం ఎలా అవుతుంది.. ఎందుకు అవుతుంది. అయ్యేందుకు మనం ఏం ప్రయోగం చేయాలో ఆలోచించాలి. సినిమా పాటలకు ఉండే నాలుగు లక్షణాలు క్లుప్తత, గాఢత, స్పష్టత, సరళత.. ముందుగా ఇవి అలవర్చుకోవాలి. ఇక సినిమా పాటలకు ఛందస్సు అవసరం లేదు..యతిప్రాస ఉంటే చాలు. ఉదాహరణకు.. ’ మా బాధలను ఓదార్చే తోడుండేవాడివిరా... ఇది మామూలు మాట.. ’’మా బాధలను ఓదార్చే నువ్వుంటే బాగుండురా... ’ ఇది కవిత్వం.. బాలసాహిత్యమే మనిషికి పునాది బాలసాహిత్యమే ఏ మనిషికైనా పటిష్ట పునాది వేస్తుంది. అంతకుమించిన సాహితీ సంపద లేదు. బాలలకు లేతప్రాయంలో శబ్దసంపద, ఊహాశక్తిని పెంపొందించే నైతిక రుజువర్తనను అందించాలి. నీతి కథలు చదివించాలి. సాహిత్యం మనల్ని పరిపుష్టం చేస్తుంది. బాల్యంలో బొమ్మరిల్లు, బుజ్జాయి, చందమామ, బాలమిత్ర.. భాగవతం, బాలసాహిత్యం వంటివి చదివితే ఎదుగుదలలో తిరుగుండదు. ఒకప్పుడు పిల్లలకు వాటితోనే విద్యాభ్యాసం మొదలుపెట్టించేవారు. మాతృభాషకు మించింది ఏదీ లేదు.. ♦ భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్టు.. ♦ మాతృభాషతోనే వేగంగా బుద్ధి వికాసం ♦ తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో తగినంత గుర్తింపు రావడం లేదు ♦ మన పాటను భుజానికెత్తుకునే వాళ్లు అక్కడ లేకపోవడం వల్లనేమో.. ♦ జాతీయ అవార్డులు సాధిస్తున్న ఇతర భాషల పాటల కంటే తెలుగు పాటేం తీసిపోదు ♦ సినిమా పాట రాయడం అవధానం కంటే పెద్ద ప్రక్రియ ♦ పాటలు పాడదామని వచ్చి రచయితగా మారాను ♦ చిరంజీవి సైరాలో పాట రాస్తున్నా విశాఖలో ఉండి ఎన్నో పాటలు రాశాను మాతృభాషను నిర్బంధంగా చదివించాలి మాతృభాషకు మించింది ఏముంది.. భాష బలహీనమైతే బంధం బలహీనమైనట్లే.. నాన్నా అన్న పిలుపులో ఉండే గాఢత డాడీలో ఉండదు. అమ్మా అన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీలో ఉండదు. పిలుపు మారినప్పుడు బంధం కూడా మారుతుంది. మాతృభాషతో బుద్ధి వికాసిస్తుంది. ఆలోచనలు విస్తరిస్తాయి. పరభాషతో బుద్ధి వికాసం అంత త్వరగా రాదు. అందుకే మాతృభాషను నిర్బంధంగా చదివించాలని నేను భావిస్తాను. కనీసం ప్రాధమిక విద్యాబోధనైనా తెలుగులో కచ్చితంగా> జరిగి తీరాలి. ఆస్ట్రేలియాలో మాతృభాషలో చదువుకున్న వారికి అక్కడి ప్రభుత్వం 130 డాలర్లు బహుమతిగా అందిస్తోంది. అక్కడ స్థిరపడిన ఏ భాషకు చెందిన వారైనా వారి మాతృభాషలో చదువుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే కాదు.. మనందరిదీ. సినిమా పాటరాయడం చాలా కష్టం.. మామూలు పాటలు రాయడం వేరు.. సినిమా పాటలు రాయడం వేరు. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్‌ను పట్టుకుని. దర్శకుడు ఇచ్చే సందర్భాన్ని అర్ధం చేసుకుని, హీరో ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులను మెప్పించేలా సినిమా పాట ఉండాలి. అందుకే సినిమా పాట రాయడం చాలా కష్టం. అది ఓరకంగా అవధానం కంటే పెద్ద ప్రక్రియ. ఇటీవలికాలంలో సినిమా కవులకు సోషల్ మీడియా సాహిత్యం సవాల్ విసురుతోంది. వాట్సాప్‌లో ప్రపంచస్థాయి కవిత్వాలు నీతులు, శుభాషితాలు. ఛలోక్తులు.. ఇలా పలు రూపాల్లో కవిత్వం వెల్లువెత్తుతోంది. దాన్ని మించి సినిమాలో చెప్పాలి. అందునా ఇప్పుడు కాలం మారింది. వేగం పెరిగింది. సినిమాకు మహారాజపోషకులైన యువత ఆలోచనలు మారాయి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కవిత్వం రాయాలంటే కత్తిమీద సాములా అయింది. సినిమాల్లో యుగళగీతాలు తగ్గాయి,, సిట్యుయేషన్ సాంగ్స్ వస్తున్నాయి. పాట సినిమాలో అంతర్భాగంగా వచ్చేదే అయినప్పటికీ అది సినిమా కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైతన్యపరుస్తుంది. ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం ♦ సినీ కవుల్లో ఆచార్య ఆత్రేయ అంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే ఎన్నో పాటలు రాశాను. నాలుగైదు మాటలతోనే గొప్ప అర్థం వచ్చేలా.. అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆత్రేయ సాహిత్యం నుంచే నేర్చుకున్నాను. ఓ సందర్భంలో ఆయన రాసిన సాహిత్యం గురించి.. ప్రియుడి సన్నిహితులు చనిపోతే ప్రేయసి ఇలా ఓదారుస్తుంది.. ♦ ‘రారయ్య పోయిన వాళ్ళు.. ఎవరయ్యా ఉండే వాళ్ళు’ ఇదీ సాహిత్యం గొప్పతనం మరో సందర్భంలో ♦ నీకు నాకూ పెళ్ళంట...నింగీ నేలకు కుళ్ళంట...ఎందుకంటేయుగయుగాలుగా ఉంటున్నా అవి కలిసింది ఎప్పుడూ లేవంట..మరో సందర్భంలో నీకూ నాకూ పెళ్ళంట.. నదికి కడలికి పొంగంట..యుగయుగాలు వేరైనా అవి కలవనది ఎపుడూ లేదంట ♦ ఇలా అనల్పమైన అర్ధం ఇవ్వాలనే స్ఫూర్తిని ఆత్రేయ నుంచే పొందాను. పెద్ద పెద్ద సమాసాలతో సంక్లిష్టమైన పదాలతో పాటలు రాయను. నేను రాసిన ప్రతి మాట అమ్మకు అర్ధమవ్వాలని అనుకుంటా.. అమ్మకు అర్ధమైతే అందరికీ అర్ధమైనట్టే. సైరాకు రాస్తున్నా...విశాఖలో ఎన్నో పాటలురాశాను సుందరమైన విశాఖ నగరంలో నాకు వృత్తిరీత్యా ఎంతో అనుబంధముంది. ఆర్య, బన్ని సినిమాల్లోని పాటలతో పాటు ఇటీవల ట్రెండింగ్ సాంగ్‌గా మారిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఫ్రెండ్షిప్పై వచ్చే ట్రెండు మారినా ఫ్రెండు మారడే పాటను ఇక్కడే రాశాను. ఇలా ఎన్నో పాటలను విశాఖలో కూర్చుని రాశాను. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాకి రాస్తున్నాను. పాట రాయాలని నేను వైజాగ్‌లో ఉన్నప్పుడే పిలుపువచ్చింది. -
వేటూరి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి
సాక్షి, పాయకరావుపేట (విశాఖ జిల్లా): ఊపిరి ఉన్నంత వరకు తన జీవితం సినీపరిశ్రమకే అంకితమని ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా చంద్రబోస్‌కు వేటూరి అష్టమ సాహితీ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశాయి. తుని చిట్టూరి మెట్రోలో జరిగిన కార్యక్రమంలో సాహితీ పీఠం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగా జోగేశ్వరశర్మ, ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విజయ్‌ప్రకాష్‌లు ఈ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ప్రదానం చేశారు. చంద్రబోస్‌కు పురస్కారంతో పాటు, 120 సాహితీ పుస్తకాలతో తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. వేటూరి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువతకు గాయకులుగా, గేయ రచయితలుగా రాణించడానికి ఎన్నో అవకాశాలున్నాయని మాతృభాషపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. వేటూరిని పూజించడమంటే అక్షరాన్ని పూజించడమేనని అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు, టాలీవుడ్ చానల్ సీఈవో శర్మ పాల్గొన్నారు. -
చంద్రబోస్‌కు ‘వేటూరి’ పురస్కారం
తుని: అక్షర పారిజాతాల వంటి వేలాది పాటలతో శ్రోతలను అలరించిన వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా తుని వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు వేటూరి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాయి. ఈ నెల 29న వేటూరి జయంతి సందర్భంగా స్థానిక చిట్టూరి మెట్రోలో వేటూరి జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నామని పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వరశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 7 గురు ప్రముఖులకు వేటూరి పురస్కారాన్ని అందించామని, అష్టమ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ఇస్తున్నామని తెలిపారు. వేటూరి సాహితి పీఠం గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు తనికెళ్ల భరణి, వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా తాతబాబు, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావుల పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందని శ్రీప్రకాష్ కల్చ రల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. -
లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఉత్సవం జరుపుకునే సందర్భానికి తగ్గట్టు ఈ పాట రాశాను. విజయం సాధించే సమయానికే హోలీ పండుగ కూడా వస్తుంది. అలా ఈ పాటను సందర్భోచితంగా హోలీ పండుగను అన్వయిస్తూ రాశాను. ఈ సినిమా పెద్దగా ఆడకపోవటం వలన ఈ పాట కూడా అందరికీ ఎక్కువగా తెలియదు. కాని నాకు చాలా బాగా నచ్చిన పాట, బాగా వచ్చిన పాట కూడా ఇది. హరివిల్లులో ఉండే రంగులను, హోలీ రంగులకు... మనుషుల్లో ఉండే భావాలకు అన్వయిస్తూ ఈ పాట రాశాను. ఆ ఊరి వారంతా వారి ఆనందాన్ని, సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఉత్సాహంగా నాట్యం చేస్తూ పాడుకునే పాట. ఇది మంచి ఆలోచనతో సాగే పాట. హరివిల్లే వరదల్లే ఇలపైకి దిగివచ్చే సింగారంగా రంగల్లే విరిజల్లే వరమల్లే ఎదలోకి ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు చెంగుమంటూ చిందులేద్దామా నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు ముంగిలంతా ముగ్గులేద్దామా హరివిల్లు అంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సింగారంగా రంగురంగులుగా వరదలా భూమి మీదకు వచ్చాయి. పూలజల్లులు వరాలు ఇస్తున్న చందంగా మనసుల్లోకి గంగా ప్రవాహంలా వైభోగంగా ఎందురొచ్చాయి. అటువంటి ఇంత అందమైన పండుగరోజున అందరం రంగులు చల్లుకుందాం. ఆడుతూ పాడుతూ చెంగుచెంగుమంటూ చిందులు వేద్దాం. మన ఆనందాలన్నీ నింగి హద్దులు దాటాలి. ముంగిళ్లన్నీ ముగ్గులతో నిండిపోవాలి... అంటూ పండుగ సంబరాలు జరుపుకోవడానికి ఒకరినొకరు ఆహ్వానించుకోవడం పల్లవిలో చూపాను. నవ్వే తెలుపంట చూపే ఎరుపంటా నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంటా నీడే నలుపంటా ఈడే పసుపంటా లోలో దాగే ఊహలపొంగే ఊదారంగంటా లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో ఏకంగా కదలాలో శోకాలే సంతోషాలే కొలువుంటవి మదిలో రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే... మొదటి చరణంలో రంగుల విశిష్టతను వివరించాను. మనలోని భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తాయి రంగులు. భౌతికమైన రూపం రంగు. భావోద్వేగాలు మానసికమైనవి. వన్నె కలిపితే అది రంగుగా మారుతుంది. తెలుపు రంగు నవ్వుకి చిహ్నం. ఎరుపురంగు చూపుకి చిహ్నం. ఆశ అనేది జీవచైతన్యానికి ప్రతీక. అది పచ్చరంగులో ఉంటుంది. ఒక కొత్త శక్తి వస్తుంది. అందుకు ప్రతీకగా పచ్చపచ్చగా చిగురించే ఆకుపచ్చ రంగును భౌతిక రూపంగా చూపాను.నీడ నల్ల రంగులో ఉంటుంది. నలుపు భయానికి ప్రతీక. చాలా మంది నీడను చూసి భయపడతారు. పసుపు రంగు ఈడుకి ప్రతీక. పిల్లలకు ఈడొచ్చినప్పుడు పసుపు, గంధం పూస్తాం. అందుకే ఆ రంగుతో పోల్చాను. ఊహలపొంగు ఊదారంగు. మన మనసులో మెదడులో, బుద్ధిలో ఉంటాయి ఊహలు. వాటిని ఊదారంగుతో పోల్చాను. ఇది చాలా అరుదైన రంగు. ప్రతిమనిషిలోనూ ఊహలు బయటికి కనిపించవు. అవి లోలోపలే ఉంటాయి. అందుకే ఎక్కువగా కనిపించని ఈ రంగుతో పోల్చాను. ఊహలు బయటకు రావడం చాలా అరుదు. ఊహ బయటకు వస్తే వాస్తవం అవుతుంది.సృష్టిలోని రంగులన్నీ మనలోనే ఉన్నాయి. ఉద్వేగం, భావం అన్నీ మన మనసులో నుంచే పుడతాయి. పాంచభౌతికమైన మనిషి దేహమే అన్నిటికీ మూలం. ప్రకృతికి ఒక సంక్షిప్త రూపం మానవుడు. ఐదడుగుల రూపంలో మలిస్తే మానవుడు. మానవుడి తాలూకు అన్ని చర్యల్లోను ఒక్కోరంగు ఉంటుంది. మనలోని భావోద్వేగాలు, మనలోని స్పందనలు, మనలోని ఆలోచనలు ఈ రోజు రంగులుగా మారాయి అని చెప్పడం. మోసం నిలవదుగా ద్రోహం మిగలదుగా ఏనాడైనా అన్యాయానికి న్యాయం జరగదుగా పంతం చెదరదుగా ఫలితం దొరికెనుగా ఏ రోౖజ నా మంచికి చెడుపై విజయం తప్పదుగా ఆలోచన బీజం వేసి చెమటే నీరుగ పోసి ఆవేశం ఎరువే వేసి పని చేస్తే పండేనంట ఆనందాలరాసి రెండవ చరణంలో సినిమా కథకు సందర్భోచితంగా రచన సాగింది... అలతి అలతి పదాలతో కవితాత్మకంగా సాగింది ఈ చరణం. ఆనందాల రాసులు కావాలంటే, ఎంత కష్టపడాలో చెప్పడానికి చేనుతో పోల్చాను. ధాన్యరాసులు చేతికి రావడానికి ఎంత కష్టపడాలో, అదేవిధంగా ఆనందాల రాసులను సంపాదించుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. పంతం పడితే అన్నీ లభిస్తాయి. సాధారణ కోణంలో చూస్తే... మంచి గెలుస్తుంది... చెడు ఓడిపోతుంది.... అనిపిస్తుంది. అన్యాయానికి న్యాయం జరగదు అని చెప్పడంలో ఎప్పుడూ న్యాయమే గెలుస్తుంది అని చెప్పడం. మనకు మనసు బాగుండకపోతే ప్రపంచంలో ఏవీ సానుకూలంగా కనిపించవు. మనసు హాయిగా ఉంటే, ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి... మన భావోద్వేగాలకు ప్రకృతి దర్పణం. – సంభాషణ: డా. వైజయంతి