Pushpa Thank You Meet: Director Sukumar Touches Lyricist Chandrabose Feet - Sakshi
Sakshi News home page

Pushpa Thank You Meet: ఎమోషనల్‌ అయిన సుకుమార్‌.. చంద్రబోస్ కాళ్లకు మొక్కుతూ

Published Tue, Dec 28 2021 8:22 PM | Last Updated on Tue, Dec 28 2021 11:00 PM

Director Sukumar Touches Lyricist Chandrabose Feet In Pushpa Thank You Meet - Sakshi

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. ఈ చిత‍్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత ఐటమ్‌ సాంగ్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్‌ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాటల రచయిత చంద్రబోస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు డైరెక్టర్ సుకుమార్‌. ఈ క్రమంలోనే చంద్రబోస్‌ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన సుకుమార్‌ చంద్రబోస్‌ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. దాన్ని వద్దని చంద్రబోస్‌ వారిస్తూ తాను కూడా సుకుమార్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. 

అలాగే 'చంద్రబోస్‌ ప్రతిభ ఏంటో నాకు తెలుసు. ఊ  అంటావా అని చంద్రబోస్‌ గారు నాలుగేళ్ల క్రితం అన్నారు. మీరు ఉఉ అనండి.. దాన్ని అలానే దాచేయండి అని చెప్పాను. నాకోసం నాలుగేళ్ల దాచిన ఆ పాట ప్రపంచం మొత్తాన్ని ఊ కొట్టిస్తుంది. చంద్రబోస్‌ స్పాంటేనిటీ అద్భుతం. ఆయన శక్తికి పాదాభివందనం. నాకు పాట కావాలంటే ఐదు నిమిషాల్లో ఈజీగా పాట, పల్లవి చెబుతుంటారు.  అది చూసి నేను ఆశ్చర్యపోతుంటా. చంద్రబోస్‌ నవ్వుతూ ఉంటే మామలు వ్యక్తిగానే ఉంటారు. పాట రాసినప్పుడు మాత్రం ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన గురించి అందరికి తెలియాలనే ఇలా స్టేజ్‌పైకి పిలిపించాను.' అని సుకుమార్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్‌ జోహర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నాడంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement